Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఇప్పుడు వీరేంద్ర తర్కాడ్ గారు వారి ఫ్యామిలీ కి చెందిన మరి కొన్ని లీలలు సాయి సచ్చరిత్ర లో వచ్చిన వాటి గురించి చెప్తున్నారు.
వరుణదేవునిపై ఆథిపత్యం
సాయి సచ్చరిత్రలో, షిరిడీలో అనుకోని విథంగా వర్షం వచ్చినపుడు జరిగిన ఒక దృష్టాంతం ఉంది.
రెండు మహాశక్తుల మథ్య జరిగిన యుథ్థాన్ని వీక్షించిన అదృష్టవంతులలో మా నాన్నగారు ఒకరు.
సాయిబాబా గారు అష్టసిథ్థులు సంపాదించారని, వాటిని అవసరమయినపుదు తన భక్తులు కోరినప్పుడు వారిని కష్టాలబారి నుండి బయట పడవేయడానికి ఉపయోగించే వారని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.
సాయిబాబాయే ఈ భూప్రపంచం మీద భగవంతుని అవతారం కాబట్టి, ప్రకృతి శక్తులు కూడా, ఆయన చెప్పినట్లు సానుకూలంగా శిరసావహించేవి.
అప్పుడు వర్షాకాలం రోజులు. మద్యాహ్నం నించి వర్షం కురుస్తూ ఉంది.
సాయంత్రమయేసరికి వర్షం యింకా పెద్దదయింది. ఆకాశంలో దట్టంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.
ఈదురుగాలులు వీయడం మొదలైంది. ఉరుములతో కూడిన గాలివాన వచ్చే సూచనలు బాగా కనిపించాయి.
ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వాటి వెనకే పెద్ద ఉరుముల శబ్దాలు కూడా వస్తున్నాయి. ఆ తుఫాను బాగా తీవ్రంగా ఉండి షిరిడీ గ్రామమంతా విపరీతమయిన వర్షం బాగా గట్టిగా కొడుతోంది.
ప్రతీచోటా నీరు నిలిచిపోవడంతో, అంతకుముందెప్పుడూ అటువంటి ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి చూడకపోవడంతో గ్రామస్తులంతా తమ పశువులతో ద్వారకామాయిలోకి వచ్చి గుమికూడటం మొదలెట్టారు.
మా నాన్నగారూ యేమీ తీసిపోలేదు. ఆయన కూడా ద్వారకామాయిలోకి వచ్చారు. మా నాన్నగారు భగవద్గీతలో లో కృష్ణపరమాత్మ, అనుకోకుండా వచ్చిన కనీవినీ యెరుగని ప్రకృతి ఆగ్రహాన్నించి సమస్త ప్రాణులను గోవర్థనగిరి పర్వతం యెత్తి రక్షణ కల్పించిన సంఘటనని గుర్తు చేసుకున్నారు.
అక్కడున్నవారందరికీ అటువంటి భయానక పరిస్థితినుండి రక్షించడానికి ‘గోవర్థనగిరీ లాంటివాడు మాత్రమే రక్షించగలడు. అటువంటి వాడి అవసరం యిప్పుడు షిరిడీ వాసులకు అవసరమయింది.
అందరూ కూడా ఆందోళనలో ఉండి తమ మీద బాబా అనుగ్రహం కోసం యెదురు చూస్తున్నారు.
తుఫాను తగ్గే సూచనలు యెక్కడా కనపడలేదు. వెంటనే బాబా ఓర్పు కూడా నశించింది.
ఆయన తనున్న చోటునించి లేచి, సటకా చేతిలోకి తీసుకుని ద్వారకామాయి ద్వారం దగ్గిరకి దిగి వచ్చారు.
ఆయన అక్కడ ఆరుబయట నిలబడ్డారు. ఆకాశంలో తీవ్రమైన మెరుపు మెరిసింది.
బాబా సటకాతో నేలమీద కొట్టి తీవ్రమయిన స్వరంతో గర్జిస్తూ యిక్కడినించి వెళ్ళిపో అన్నారు (జాతేస్కి నై — మరాఠీలో) ఆయన గర్జింపు యొక్క శబ్ద తీవ్రత యెంతెలా ఉందంటే షిరిడీలో భూకంపం వచ్చిందా అన్నంతగా అక్కడి ప్రదేశం వణికి పోవడం మొదలెట్టింది.
మరొకసారి తీవ్రమయిన మెరుపు, షిరిడీనుంచి వెళ్ళిపొమ్మని వరుణ దేవుడిని అడుగుతూ బాబా సటకాతో నేలమీద కొట్టడం. ఈవిథంగా మూడు సార్లు జరిగింది.
అది రెండు మానవాతీత శక్తుల మథ్య పోరాటమని స్పష్టంగా కనపడుతోంది.బాబా అభ్యర్థన్ల కనుగుణంగా తుఫాను, మెరుపులు ఆగిపోయాయి.
వర్షం తగ్గి గాలులు మెల్లగా వీచాయి. సుమారు ఒక గంట తరువాత మరొకసారి అంతా ప్రశాంతంగా అయింది. ఆకాశం నిర్మలంగా ఉంది.
బాబా అందరినీ తమ తమ యిళ్ళకు తిరిగి వెళ్ళమని చెప్పారు. మా నాన్నగారు తన సాయంత్ర విథి ప్రకారం యథావిథిగా పెట్రొమాక్స్ దీపాలని వెలిగించారు.
ఆయుథ్థం గురించి బాబాని అడుగుదామని తగిన సమయం కోసం చాలా యిదిగా ఉన్నారు. యిప్పుడా సమయం వచ్చింది.
ఆయన బాబాని, ఆయనకి ప్రకృతిని కూడా శాసించగల స్థాయి ఉందా అని అడిగారు. బాబా సమాథానం చెబుతూ “భావూ ! నా భక్తులు కష్టాలలో ఉన్నప్పుడెల్లా నేను విశ్వమంతటికీ ప్రభువైన భగవంతుడిని, ఆయన దయని వారిమీద కురిపించమని ప్రార్థిస్తాను. భగవంతుడు నా రక్షణకు వచ్చి నాకు సహాయమందిస్తాడు”.
మా నాన్నగారు ఆ దృశ్యాన్ని మరచిపోలెకపోయారు. అది బాబా వర్షంలోమథ్యలో నిలబడి వరుణదేవునితో షిరిడీని వదలి వెళ్ళిపొమ్మని గట్టిగా అరవడం. బాబా తనే భగంతునిగా విలక్షణమైన రీతిలో కనిపించారు.
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భక్తురాలి ఆర్తిని అర్ధం చేసుకొని ఎండవేడిని వర్షం రూపంలో తగ్గించుట
- భక్తురాలికి బాబా వారు ప్రసాదించిన దివ్య పూజ అనుభవములు
- త్రికాలవేది…. మహనీయులు – 2020… సెప్టెంబరు 5
- భారీ వర్షంలో కూడా పిండి తడవకుండా ఉంది(సాయి లీలామ్మ గారి అనుభవం)
- నమ్మికొలిచే వారికి కొంగు బంగారము మా సాయి–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “బాబా సటకాతో నేలమీద కొట్టి తీవ్రమయిన స్వరంతో గర్జిస్తూ యిక్కడినించి వెళ్ళిపో అన్నారు-Taarkad-29-Audio”
B.mallesh
September 4, 2016 at 8:20 amSuperb.
Pavan
January 8, 2019 at 5:18 pmSome suggestions/corrections:
> Please correct your Pronunciation of telugu words.
Example: Name is not taarkad, it is tarkad. Like that there are some many pronunciation mistakes.
Sai Baba
January 9, 2019 at 8:19 amThank you Sai ..for your correction..We will rectify it..