పాపను కాపాడుమనుచూ ఊదీ నోటిలో వేయగా ఆరోగ్యమునొందుట–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


1941 ఏప్రియల్ 21 వ తేదీన శ్రీ కేశవయ్య గారు శ్రీ సాయిబాబాను పూజించుచుండగా తన ఎదుటనే యున్న శ్రీ సాయిబాబా పటము నుండి మహిషవాహనము అధిరోహించిన యమధర్మరాజు దర్శనమిచ్చెను.

ఆ రోజు రాత్రి గం.3 -00 ల సమయమున వీరి చంటి పాపకు ఊపిరాడక దగ్గువచ్చి కళ్లుమూతబడి శరీరము చల్లబడినది.

అప్పుడు కేశవయ్యగారు బాబా ఊదీని చేతిలోకి తీసుకొని “బాబా! మా బిడ్డను రక్షింపుము” అని ప్రార్ధించినారు. బాబా ఊదీని పాప నోటిలో వేయుటకు ప్రయత్నించగా నోరు తెరవలేదు.

కేశవయ్య గారు అప్పుడు పాప శరీరమునకు ఊదీ పూసిరి. ఆ పాప 15 నిమిషములకల్లా నోరు తెరిచేను. ఊదీని నోటిలో వేయగానే ఆ పాప గుటక వేసినది.

అరగంట కల్లా పాప ఆరోగ్యమును పొందినది. బాబాకు, బాబా ఊదీకి, సాయి సచ్చరితకు బేధముండడందురు. యమధర్మరాజు కూడా బాబా ఊదీ చెంతకు రాదు అని ఈ లీల తెలుపుచున్నది.

డాక్టర్ పేషంటు అయిన పిల్లవానిని కాపాడమని బాబాను ప్రార్ధించి ఊదీని వాడగా తగ్గుట

కాన్పూరులోని బి.జి.దాస్.అను డాక్టరు యున్నాడు. ఇతను వైద్యము చేయుచున్నప్పుడు శ్రీ సాయిబాబాను అర్దించి, బాబా సహాయమును కోరినాడు. ఇప్పుడు ఒకలీల తెలుసుకుందాము.

కాన్పూరులో 4 సం: ల బాలుడు 15 అడుగుల ఎత్తున యున్న ఇంటి మొదటి అంతస్తు నుండి క్రిందగచ్చు చేసిన చోట పడెను.

తలకు దెబ్బతగిలినది. అక్కడ రక్తము గడ్డకట్టినది ఆ బాలుని ముక్కు నుండి నోటి నుండి రక్తము కారుచుండెను. తల్లిదండ్రులు ఆ పిల్లవానిని ఈ డాక్టరుగారు వద్దకు తీసికొనివచ్చిరి.

మెదడు నరములు చిట్లి ప్రమాదకరపరిస్థితులలో యున్న ఆ బాలుడు బ్రతుకునని నమ్మకము లేదు.

అప్పుడు ఈ డాక్టరు సాయిబాబాను ఆ పిల్లవాని ప్రాణములను కాపాడమని ప్రార్ధించి, ఆ పిల్లవాని నోటిలో బాబా ఊదీని వేసి, తలకు దెబ్బతగిలిన చోట ఊదీని రాసి, అవసరమైన ఇంజక్షను చేసినారు.

ఆ విధముగా ఆ పిల్లవానిని ఆసుపత్రిలో యుంచిరి. పిల్లవానికి మూడవరోజుకు తెలివి వచ్చినది.

అంత ఎత్తు నుండి పడినా ఎముకలు ఎచ్చటను విరగలేదు. అంతా బాబా అనుగర్హమే, వారి మహిమ బాలుని రక్షించింది అని డాక్టరు చెప్పిరి.

అది యదార్దమేకదా! ఇట్టి డాక్టర్లు బాబాను తలచి వైద్యము చేయువారున్నారు. ఇచ్చట తల్లిదండ్రులు బాబా భక్తులు కారు. వైద్యుడే బాబా భక్తుడు.

ఎవరు ప్రార్ధించినా బాబా నుండి ఫలితము లభించగలదనుటయు అర్ధమగుచున్నది. ఊదీ మహిమయే ఇచ్చట తెలియుచున్నది.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల ( ఫిబ్రవరి – 2016)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles