నమ్మికొలిచే వారికి కొంగు బంగారము మా సాయి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio prepared by Mr Sri Ram


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

నెల్లూరు నుండి ఇందిరా బాలాజీ రావు గారు తమ సాయి  సంత్సంగ సభ్యులకు కలిగిన అద్భుత  అనుభవాన్ని  సాయి బంధువులందరితో పంచుకుంటున్నారు.

సాయి తనను  నమ్ముకున్న వారికోసం చేసిన అద్భుత లీలను చదివి ఆనందించండి.

శ్రీ సచ్చిదా నంద సద్గురువు సాయి నాధ్ మహరాజ్ కి జై :-  నెల్లూరులో  “పద్మావతి నగర్-అద్దాల మందిరం సాయి బాబా” అంటే  తెలియని వారంటూ  వుండరేమోl ఆగుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మధుసూదన్ గారు  వారి సతీమణి లక్ష్మీ  వారి కొడుకు  సాయి బస్వంత్ కు దక్కుతుంది.

కుటుంబం అంతా సాయి సేవ చేస్తూ వుంటారు. ప్రతి ఆదివారం ఒక్కొక్కరి ఇంట్లో సత్సంగం నిర్వహిస్తూ వుంటారు. 

మేము అందులో సభ్యులం. మేము అన్నా వారికి కూడా  చాలా అభిమానం. విషయం ఏమిటంటే వారికి ఒక్కడే కొడుకు. సాయి వరప్రసాదం వాడు.

మా సత్సంగ సభ్యులందరికీ వాడు ముద్దు బిడ్డ. ఎప్పుడూ సందడిగా అందరినీ ఆకట్టుకుంటాడు.

సాయినాధ్ మహరాజ్ చూపించిన  అద్భుతం కనండి. ఆ సాయిబస్వంత్ వివాహం  మొన్న శుక్రవారం 26-8-2016న.సమయం రాత్రి 7.36 నుండి 9.35 లోపల  సుమూహుర్తం.

ఒక్కడే కొడుకు చాలా  బ్రహ్మాండంగా చేయాలని సంకల్పం. చాలా మందిని పిలిచారు కూడా. మధుసూదన్ గారు  తలచుకొంటే, ఎక్కడైనా, ఏ కళ్యాణమండపంలో నయినా చేయగలిగిన సమర్దత గలవారు.

కానీ ఆయన కు బాబా ప్రక్కన ప్రాంగణంలో వివాహం చేయాలని  ఉద్దేశం. అంతా open place ఎక్కువమంది  వస్తారని అంచనా. పెళ్లి సమయం దగ్గరకు వచ్చింది.

అంతా తారుమారు అయ్యింది. ఒకటేముసురూ ఆగకుండా వర్షం. శుక్రవారం ఉదయం నుంచి ఒకటే వాన.

ఆసమయంలోఒక తండ్రిగా ఆయన పరిస్థితి  ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. నేలంతా చిత్తడి. ఏంచేయాలి?

అందరం సాయిబంధువులం కాబట్టి ఆయన బిడ్డ ను తమ బిడ్డ  అనుకున్నారు.  సత్సంగ సభ్యులందరూ ఉదయం 11గం నుండి  సాయంత్రం 4గం.ల వరకూ ఆపకుండా సాయినామం చెప్పారు.

అవాంతరం తొలగిపోయేలా చేయమని. కొంతమంది కళ్యాణ మండపం బుక్ చేద్దామన్నారు.

అప్పుడు మధుసూదన్ గారు వారిని ఆపి, గుడిలో బాబా ఎదురుగా నిలబడి “నాకు ఒక్కగానొక్క బిడ్డ మాఇంట్లో జరిగే మొదటి శుభకార్యం యిదే. నీ ఆశీస్సులతో ఎన్నో ఉత్సవాలు ఘనంగా ఇక్కడ జరిగాయి. మరి ఇది నా బిడ్డ పెళ్ళి. ఏంచేస్తావో నీఇష్టం. వర్షం పడిందా? నీ ఎదురుగానే  గుడిలో పెళ్ళి  చేస్తా. అంతే కానీ ఏ మండపాల్లో చేసే ప్రసక్తి లేదు”  అన్నారు.

అక్కడే ఒకామె సచ్చరిత్ర పారాయణ చేస్తూ వుంటే ఆమె చేతిలో నుండి సచ్చరిత్ర తీసుకుని ఒకపేజీ తీసారట.

సచ్చరిత్ర లో 71వపేజీ “ఆకాశము మబ్బుపట్టి వుంది.

కొద్ది సేపటిలో మబ్బులన్నీయు చెదిరి పోయి ఆకాశము నిర్మలమగును. నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము వారి కష్టములన్నియు నావే”. అని వచ్చింది.

ఆయన కళ్ళల్లో నీరు. విశేషం ఏమిటంటే అక్క డ  పారాయణ చేస్తూవున్న ఆమె చదువుతున్న పేజీ, వాక్యాలు కూడా అవే. ఎంత ఆశ్చర్యమో  చూడండి. అక్కడ ఎవరికీ  నోటమాటరాలేదట.

ఆయన చెప్పారు – “ఇంక నేను  ఏదీ  ఆలోచించేదిలేదని”.  అంతే వర్షం తగ్గుముఖం పట్టింది. 5గం.లనుండి పూర్తిగా వర్షం ఆగిపోయింది. అందరికీ ఆనందం. చాలా మంది వచ్చారు.

చాలా బ్రహ్మాండంగా వివాహం జరిగింది. మాంగల్యధారణ సమయంలో మధు సాయి ఆనందంతో సాయినామంమైకులో  చెబుతూ వుంటే అందరికీ  సంతోషంగా అనిపించింది.

🌹 పెళ్లి  భోజనాలు అయ్యి అందరూ ఎవరి గూటికి వారు చేరిన తరువాత, అర్థరాత్రి 2గం.ల తరువాత మరోసారి  వర్షం ఆగకుండా తెల్లవారిందాక పడింది. ఇదంతా చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించటంలేదూ?

ఇదంతా చూస్తుంటే సాయి లీల అని అర్దం అయిపోతుంది. ఆ నూతన దంపతులకు  బాబా ఆశీస్సులు  లభించాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

నమ్మికొలిచే వారికి  కొంగుబంగారమతడు. ఆతండ్రి మనపై చూపించే ప్రేమకు  యింతకంటే నిదర్శనం  ఏంకావాలి చెప్పండి. అందరికీ సాయి రామ్ ఇందిరా బాలాజీ రావ్.. నెల్లూరు .

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నమ్మికొలిచే వారికి కొంగు బంగారము మా సాయి–Audio

B.mallesh

Entha adbutham paramadbutham.chala anandamga vundi.madusudan sir Garu chala adrustavanthulu.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles