‘‘సద్గురువు కటాక్షం లభించిన వారికి కష్టాలు ఉండవు. బాబా మన సద్గురువు.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

ఆశ్చర్యంగా షిండే శ్యామాలు ఒకరినొకరు చూసుకున్నారు.

‘‘చూస్తూ చూస్తూ పసిబిడ్డ ప్రాణాలు తీస్తామా? ఆ బిడ్డ మంటలకి ఆహుతి కావడం కంటే నా చేతులు ఆహుతి కావడమే మేలనుకున్నాను.’’ అన్నారు బాబా.

‘‘ఎవరు బాబా ఆ బిడ్డ?’’ అడిగాడు శ్యామా.

‘‘పక్క గ్రామం వడ్రంగి లేడూ, అతని బిడ్డ. ఆ భార్యభర్తలిద్దరూ నా భక్తులే! నా భక్తుల కష్టాలు నేనుగాక ఇంకెవరు భరిస్తారు?’’ అన్నారు బాబా. నవ్వారు.

జరిగింది అంతా గమనించిన నానాకి నోట మాట రాలేదు. పక్కనున్న కులకర్ణిని చూశాడతను.

‘‘సద్గురువు కటాక్షం లభించిన వారికి కష్టాలు ఉండవు. బాబా మన సద్గురువు.’’ అన్నాడు కులకర్ణి.

బాబాని చూస్తూ చేతులు జోడించాడు నానా.కాలిన బాబా చేతులకి వెన్న రాశాడు షిండే. గాయాల మీద తామరాకులు ఉంచి, కట్టు కట్టాడు.‘‘చల్లగా ఉందా బాబా?’’ అడిగాడు.

‘‘నా సేవలో నీ మనసు చల్లబడింది కదా, అది చాలు.’’ అన్నారు బాబా. షిండే తల ప్రేమగా నిమిరారు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles