Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
అందంగా పెంచిన లెండీబాగ్లోకి భాగోజీ షిండేని కూడా అనుమతించేవారు బాబా. ఒక రోజు ఆ తోటలో ఓ చెట్టు చాటున ఓ గొయ్యి తవ్వారు బాబా. సహకరిస్తానని ముందుకు వచ్చిన షిండేని వారించారు.
ఆ రోజు నుంచి ప్రతి రోజూ పొద్దునే షిండేని తోడు తీసుకుని లెండీబాగ్లోకి ప్రవేశించేవారు బాబా. గోతికి కొద్ది దూరంలో షిండేని నిలబడమని, తాను గోతిలోకి దిగేవారు బాబా.
ఆ గోతిలో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించేవారు. దీపాన్ని వెలిగించి, ఆకాశం కేసి, చూస్తూ ప్రార్థించేవారు బాబా.
గోతిలో దీపాన్ని పెట్టడం, ప్రార్థించడం అంతా దేనికోసం? ఎవరి కోసం? అన్నది తెలుసుకోవాలనుకున్నాడు షిండే. అడిగేశాడు ఒక రోజు.
‘‘ఏమిటి బాబా ఇదంతా? గోతిలో దీపం పెట్టి, ఎవరిని ప్రార్థిస్తున్నారు?’’
‘‘ఎవరిని అంటే…జ్యోతి స్వరూపుడు పరమాత్మను పార్థిస్తున్నాను. రోజూ ఆ గోతిలో పరమాత్మనుఆవాహన చేసి, మీ అందరి సుఖసంతోషాల కోసం వేడుకుంటున్నాను.’’ అన్నారు బాబా.
ఆ దీపాన్నే తర్వాత అంతా ‘నందాదీపం’గా వ్యవహరిస్తూ వచ్చారు.
నందాదీపాన్ని చూడాలని, దానికి నమస్కరించాలని శ్యామాతో పాటు చాలా మందికి కోరిగ్గా ఉండేది.
అయితే బాగ్లోనికి ఎక్కువమందిని అనుమతించేవారు కాదు బాబా. దాంతో అప్పుడప్పుడు మాత్రమే ఒకరో ఇద్దరో దీపాన్ని చూడగలిగి, నమస్కరించేవారు.
అంతా ఆనందంగా, హాయిగా ఉంది అనుకున్న సమయంలో ఊహకి అందని విధంగా షిరిడీ చుట్టుపక్కల కలరా వ్యాపించింది. అక్కడ ఇద్దరు చనిపోయారు.
ఇక్కడ ఇద్దరు చనిపోయారని ప్రచారం కావడంతో షిరిడీ వాసులు భయపడసాగారు. తమ గ్రామానికి కూడా కలరా సోకడం తప్పదనుకున్నారు.
ఒక రోజు బయటికి వెళ్ళి ద్వారకామాయికి వస్తూనే హడావుడిగా షిండేని కేకేశారు బాబా.‘‘చెప్పండి బాబా’’ చేతులు కట్టుకుని నిల్చున్నాడు షిండే.
‘‘నువ్వు తొందరగా బజారుకి వెళ్ళి, ఓ బస్తాగోధుమలు, అవి విసరడానికి ఓ తిరగలి తీసుకుని రా’’ చెప్పారు బాబా.
‘‘ఇప్పుడవి…?’’ ఎందుకన్నట్టుగా అడిగాడు షిండే.‘‘చెప్పిన పని చెయ్యవయ్యా, వెళ్ళు.’’ అన్నారు బాబా. విసుక్కున్నారు.
ఆయన బాగా కోపంగా ఉన్నారు. షిండే మారుమాట్లాడలేదు, వెళ్ళిపోయాడు అక్కణ్ణుంచి. బస్తా గోధుమలు, తిరగలితో తిరిగి వచ్చాడు.
ఆ సరికే నేల మీద గోనె పట్టాని పరిచి, గోధుమలు విసిరేందుకు సిద్ధమయ్యారు బాబా. పట్టా మీద తిరగలి ఉంచారు. తెరిచిన గోధుమల బస్తాని పక్కన ఉంచుకున్నారు.
పిడికిలి పిడికిలిగా గోధుమలు తీస్తూ, తిరగలిలో వే స్తూ విసరసాగారు బాబా. బలంగా చాలా వేగంగా విసరసాగారు. ద్వారకామాయి అంతా తిరగలి చప్పుడు ప్రతిధ్వనించసాగింది.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నా కోసం నేను కాదు, మీ కోసమే నేను. ఈ ఉత్సవాలూ ఉత్సాహాలూ మీకోసమే! మీ ఆనందం కోసమే’’
- ‘‘నమ్మవద్దు! నన్ను నమ్మమని నీకు చెప్పానా?’’ గట్టిగా అరిచారు బాబా.
- ‘‘ఏ పనయినా పద్ధతి ప్రకారం చెయ్యాలి. లేకపోతే ఇదిగో ఇలాగే ఆటంకాలు ఎదురవుతాయి.
- నేను ఆనందం ఆశ్చర్యం లో వుండగానే, Postman వచ్చి మేడమ్, మీ Courtcase తేలిపోయింది
- అందరి కంటే గొప్ప వైద్యుడైన శ్రీ సాయికి సాధ్యం కానిది ఏముంది?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “జ్యోతి స్వరూపుడు పరమాత్మను పార్థిస్తున్నాను. రోజూ ఆ గోతిలో పరమాత్మనుఆవాహన చేసి, మీ అందరి సుఖసంతోషాల కోసం వేడుకుంటున్నాను.”
kishore Babu
January 11, 2017 at 5:58 amSai Baba…Sai Baba…Sai Baba.
http://saileelas.com/m/videos/view/Sai-Baba-Naamam-7