‘‘ఏ పనయినా పద్ధతి ప్రకారం చెయ్యాలి. లేకపోతే ఇదిగో ఇలాగే ఆటంకాలు ఎదురవుతాయి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

 

అబ్దుల్లా భోజనం కూడా అయిపోయింది. భక్తులంతా లేచి నిల్చునారు.‘‘జై బోలో, సమర్థ సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కీ, జై’’ అంటూ నినదించారు.

చేతులు కడుక్కునేందుకు దూరంగా నీటి గోళెం దగ్గరగా వెళ్ళి వరసలో నిల్చున్నారంతా. వారందరినీ చల్లగా చూశారు బాబా. తర్వాత పైకి, ద్వారకామాయి పైకప్పుకేసి చూశారు.‘‘ఇక నీ ఇష్టం, కానీ’’ అన్నారు. అంతే! పెద్దగా శబ్దం చేస్తూ ద్వారకామాయి పైకప్పు కొంత మేర కూలిపోయింది. కింద ఎవరూ లేరు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అదే ఓ పావుగంట ముందు జరిగి ఉంటే భోంచేస్తున్న భక్తుల్లో చాలా మంది గాయాలపాలయి ఉండేవారు. అందుకే బాబా హెచ్చరించారు దాన్ని.‘‘ఠైరో! జరఠైరో! ఆగక్కడ’’ అన్నారు. ఆ మాటకి ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఇప్పుడు అనుజ్ఞ లభించింది. దాంతో కూలిపోయింది. కూలిపోయిన పైకప్పును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.

తర్వాత బాబాకి చేతులు జోడించారు. చరాచర జీవకోటి అంతా బాబా మాట వింటున్నందుకు మురిసిపోయారు.పైకప్పు కూలిపోయి, శిధిలావస్థకి చేరింది ద్వారకామాయి. బాగు చేయించాలి దానిని. ఆ బాధ్యతను నానాసాహెబ్‌, కాకాదీక్షిత్‌లకు అప్పగించారు బాబా.

ద్వారకామాయి మరమ్మత్తులో ఉన్న కారణంగా బాబా చావడిలో నివసించసాగారు.ఒకరోజు ద్వారకామాయికి వచ్చారు బాబా. మరమ్మత్తులు ఏ మేరకు జరిగాయో చూడసాగారు.

అంతా ప్రారంభ దశలోనే ఉంది. పనులు ముందుకు జరుగుతున్న దాఖలాలు లేవు. పైగా అంతా అస్తవ్యస్తంగా ఉంది. కోపం వచ్చింది బాబాకి.

దాంతో పైకప్పు నిర్మించేందుకు అక్కడ పాతిన గుంజల్ని ఒకొక్కటీ తీసి పారేశారు. వారించబోతూ దగ్గరగా వచ్చిన అందర్నీ తిట్టిపోశారు. ‘బాబా బాబా’ అంటూ తనని పట్టుకుందామని ప్రయత్నించిన భక్తుల మీదకి ఇటుకల్ని విసిరారు.

భయభ్రాంతులయిపోయారంతా. దూరంగా పరుగులు పెట్టారు. ద్వారకామాయిని మరమ్మత్తు చేయడం ఇక జరగదనుకున్నారు. అయితే చిత్రంగా కాస్సేపటికి బాబా శాంతించారు. నవ్వుతూ నానాని పిలిచారు.

‘‘చెప్పండి బాబా’’ చేతులు కట్టుకుని నిల్చున్నాడు నానా.‘‘ఏ పనయినా పద్ధతి ప్రకారం చెయ్యాలి. లేకపోతే ఇదిగో ఇలాగే ఆటంకాలు ఎదురవుతాయి.’’ అన్నారు బాబా.

తర్వాత గుప్పెట్లో ఉన్న నాణెన్ని ఒకసారి చూశారు. దానిని ఈశాన్యంలో ఉన్న గోతిలోనికి జారవిడిచారు. నమస్కరించారు. తీసి పారేసిన గుంజను ఒకదాన్ని తెచ్చి, ఆ గోతిలో నిలబెట్టారు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles