Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ సాయి స్వయంగా చేసిన నామకరణం, అక్షరాభ్యాసం
శ్రీ సాయిబాబా పన్ను భద్రపరచిన పూనాలోని శివాజీ సాయి మందిర్నిర్మాతగా సాయి భక్తుల హృదయాలలో అమరుడైన భక్తుని నామధేయం (దౌలత్ షా ఉరఫ్ దత్తాత్రేయ రస్నే ఉరఫ్ నానా సాహెబ్ రస్నే ) కన్న తల్లిగర్భంలోకి రాకముందే సాయి నిర్ణయించారు.
శ్రీ దామోదర సావల్రాం రస్నేకు రెండు వివాహాలు చేసుకున్నా సంతానం కలగకపోవడంతో జ్యోతిష్కులను సంప్రదించాడు. వాళ్ళు అతని జాతకచక్రం చూసి, అతనికి సంతానయోగం లేదని ఖచ్చితంగా చెప్పారు. ఆతరువాత అతను సాయిబాబాను దర్శించి తన కోరిక విన్నవించుకున్నాడు. బాబా అతనికి నాలుగు మామిడిపండ్లు ప్రసాదంగా ఇచ్చి “ఇవి నీ రెండవ భార్యకివ్వు! నీకు మొత్తం 8 మంది సంతానం కలుగుతారు. మొదట ఇద్దరు మగ పిల్లలు కలుగుతారు. వారిలో మొదటి పిల్లవానికి ‘దౌలత్ షా‘ అని, రెండవవానికి ‘తాన్ షా’ అని పేర్లు పెట్టు” అని ఆశీర్వదించారు. దామోదర్రస్నే బాబా చెప్పిన వివరాలు యింటికెళ్ళగానే తన డైరీలో వ్రాసుకున్నాడు. బాబా చెప్పిన విథంగానే సంవత్సరం తిరిగే సరికల్లా (1901) అతడికొకకొడుకు పుట్టాడు. ఆ పిల్లవానికి 15 నెలల వయస్సప్పుడు షిరిడీకి తీసికెళ్ళి,బాబా దర్శనం చేసుకుని తన కొడుక్కు ఏం పేరు పెట్టమంటారని అడిగాడు. (బహుశా ఈ సారి బాబా ఏదైనా హిందూ పేరు చెప్తారేమోననే ఆశతోకావచ్చు). దానికి బాబా “నేను యెప్పుడో చెప్పాను కదా? “దౌలత్ షా’ పేరు పెట్టమని. ఆ విషయం నువ్వు డైరీలో 3 వ పేజీలో రాసుకున్నావు కూడా”అన్నారు. అయితే దామోదర్ రస్నే బాబా పెట్టిన పేరు లాంఛనంగా ఉంచి, ఆపేరుతో పాటు తన కుమారుడికి ‘దత్తాత్రేయ’ అనే హిందూ పేరును కూడా జోడించి నామకరణం చేశాడు.
తరువాత 1906 లో తన కుమారుడికి అయిదేళ్ళు వచ్చాక బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. బాబా అప్పుడు ఆపిల్లవాడి చేతికి బలపం ఇచ్చి తాము స్వయంగా పిల్లవాడి చేయి పట్టుకుని పలకపైన ‘హరీ ‘ అని వ్రాయించి అక్షరాభ్యాసం చేశారు. అలా బాబా దౌలత్ షా చేత హరినామం దిద్దించారు.
అయితే ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో జన్మించిన బాలుడికి బాబా ముస్లిం పేరు యెందుకు పెట్టినట్లు? బాబా చెప్పినట్లు ఆయన చర్యలకు కారణాలు తెలుసుకోవడం సాథ్యం కాదు. అవి అనూహ్యాలు. కానీ, మన స్థాయిలో బాబా యొక్క ఈ చర్య నుండి నేర్చుకోవలసినది మాత్రం చాలా ఉంది. మత సామరశ్యము మతైక్యము, బాబా అవతార ప్రయోజనాలలోఒకటి. ఈ నాడు సమాజంలోని వ్యక్తుల పేర్లు మత సూచకాలు, కుల మత సంకేతాలుగా ఉంటున్నాయి. ఒక మతం వారు ఒక మతం వారికి సంబంధించిన పేర్లు పెట్టుకోవడం ద్వారా ముందు బాహ్యంగానయినా మతానికీ మతానికీ మథ్య అడ్డుగోడలు నశిస్తాయి. మతైక్యానికి ఇది మొదటిమెట్టు. అప్పుడే..
“యెల్ల లోకము వొక్క ఇల్లై, వర్ణభేదము లెల్ల కల్లై,,,,మతము లన్ని మాసి పోవును, జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును”…
అన్న మహాకవి వాక్యం వాస్తవమౌతుంది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబాని పరిచయం చేసిన శ్రీ షిరిడీ సాయి మహత్యం ……!
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
- శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments