కాన్సర్ బారి నుండి కాపాడిన బాబా 1వ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

 ఈ రోజు నెల్లురు నించి సుకన్య గారు సేకరించి పంపిన ఒక అద్భుతమైన బాబా లీలను తెలుసుకుందాము. ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో, అపరిమితమైన భక్తితో బాబానే నమ్ముకున్న సాయి భక్తుడు చెప్పిన ఈ అద్భుతమైన లీలను వారి మాటలలోనే తెలుసుకుందాము.

కాన్సర్ బారి నుండి కాపాడిన బాబా

నా పేరు రాజ శేఖర్. బాబా అనుగ్రముతో నాకింత వరకు ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు. ఎప్పుడయినా నేనొక విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు అది ఒక సమస్యగా అవుతూ ఉండేది. బాబా నన్నా కష్టాన్నుండి గట్టెంక్కించేవారు. ప్రతీక్షణం ఆయన నాతోనే ఉన్నారని నేను నమ్ముతాను. ప్రంపంచం లో అందరినీ ఆయన కాపాడుతూ ఉంటారు. ఎన్నో ప్రశ్నలకి సమాధాలనిచ్చి పరిష్కారాలను సూచించారు. ఆయనే నా జీవితం, అనురాగం, ఆయన లేని జీవితాన్ని నేనూహించుకోలేను.

సుమారు నాలుగు నెలల క్రితం నా సోదరి రెండవసారి గర్భిణీతో ఉందనే సంతోషకరమైన వార్త తెలిసింది. మేమంతా చాలా సంతోషించాము. ఆమె అత్తింటి వారు షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకుని షిరిడీకి ప్రయాణమయ్యారు. షిరిడీలో వారికి దర్శనం బాగా జరిగింది. దర్శనం అయిన తరువాత యింటికి తిరిగి వచ్చారు.

నా సోదరి చాలా తెలివయిన విద్యార్థిని. ఆమె దూరవిద్య ద్వారా ఎం.సీ.ఎ. చదువుతోంది. తను హైదరాబాదు నుంచి విజయవాడకు (స్వంత ఊరు, పుట్టిల్లు) వెళ్ళేటప్పటికి నాలుగవ నెల అనుకుంటాను. అప్పుడామె రెండవ సంవత్సరం పరీక్షలకు తయారవుతోంది. ఆ సమయంలో ఆమె విపరీతమయిన నొప్పితో బాధ పడుతూ ఉండేది. మేము డాక్టరుని కలిసి పరిస్థితిని వివరించాము. అంతా బాగానే ఉంది సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు అందరికీ వచ్చే సామాన్యమయిన నొప్పులే అని డాక్టరుగారు చెప్పారు.

నా సోదరికి రోజు రోజుకీ నొప్పి ఎక్కువ కాసాగింది. రాత్రిళ్ళప్పుడు నిద్ర పోలేనంతగా నొప్పి ఎక్కువ కాసాగింది. ఇలా ఉండగా నా తల్లి తండ్రులకి సిల్వర్ జూబిలీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు (వివాహమయిన 25 సంవత్సరాలు). నేను ఒక్కడినె కొడుకుని కాబట్టి హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరాను. నేనెప్పుడూ నాతో ఊదీ తీసుకుని వెడుతూ ఉంటాను. కాని ఈ సారి నేను విజయవాడలో ఉండేది మూడు రోజులే కాబట్టి ఊదీ అవసరం ఉండదని భావించాను. కాని ఎందుకనో ఊదీ ని తీసుకుని విజయవాడకు ప్రయాణమయ్యాను.

ఫంక్షన్ చాలా బాగా జరిగింది. నా సెలవు అయిపోయిన నాలుగవ రోజు పొద్దున్నే హైదరాబాదుకు ప్రయాణమయ్యాను. రైలు స్టేషన్ కి చేరుకున్న తరువాత, యింటి దగ్గరే ఊదీ ఉన్న చిన్న పెట్టి మర్చిపోయానని గుర్తుకు వచ్చింది నాకు. ఏమి చేయాలో నా కర్ధం కాలేదు. యింటికి వెళ్ళి ఊదీ తెచ్చుకుందామనుకున్నాను. కాని ఏదొ అంతరాత్మ ప్రబోధించినట్లు ఇలా అనిపించింది. “దానిని అక్కడే వదలివేయి. ఎందుకంటే ఒక పెద్ద సమస్య ఎదురవబోతోంది.” అన్య మనస్కంగానె అసంతృప్తితో నేను హైదరాబాదు చేరుకున్నాను.

3, 4 రోజుల తరువాత నా సోదరికి భరించలేనంతగా నొప్పి రావడంతో డాక్టరు వద్దకు వెళ్ళారు. ఆమె ఆర్థో సర్జన్ (ఎముకల వైద్య నిపుణుడు) వద్దకు తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. నా తల్లితండ్రులు ఆమెని బోన్స్ స్పెషలిస్ట్ వద్దకు తీసుకునివెళ్ళారు. నా సోదరికి స్పైనల్ కార్డ్ లో టిష్యూ (ట్యూమర్) ఉందనీ అదే కాళ్ళకి, నడుము నొప్పికి కారణమవుతోందనీ చెప్పారు.  బాబా రాబోయే ప్రమాదాన్ని ముందే సూచించారనీ, ఊదీ రాయమనీ మా అమ్మగారికి చెప్పాను.

పరీక్షలు అయిపోయిన తరువాత తను మా అమ్మగారితో హైదరాబాదు వచ్చింది. కాని ప్రతీ రోజు నొప్పితో బాధపడుతూ ఉండేది. హైదరాబాదులో కుడా మేము ప్రసూతి వైద్యురాలిని సంప్రదించాము. కానీ ఆమె, అసలు సమస్య ఏమిటో గుర్తించకుండా నొప్పితగ్గడానికి మందులు ఇచ్చారు. యిక ఏమాత్రం భరించలేనంతగా నొప్పి ఎక్కువయింది. ఆమె ప్రతీరోజు బాధతో బాగా ఏడవటం మొదలెట్టింది. నాకు మరొకసారి అంతర్యామి ఇలా చెప్పింది “ఆమెని సాయి తత్వం చదవమను”. 

ఆమె వెంటనె సాయి తత్వం చదవడం ప్రారంభించింది. నాలుగు అధ్యాయాలు పూర్తి చేసింది. కాని నొప్పి ఇంకా ఎక్కువవడంతో ఇక చదవలేకపోయింది. యిక ఆఖరికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చూపిద్దామనె నిర్ణయానికి వచ్చాము. ఆ సమయంలో నా సోదరికి నడవటం కూడా చాలా కష్టమయింది. ఆమెని చక్రాల కుర్చీలో తీసుకుని వెళ్ళవలసివచ్చింది. 23 సంవత్సరాల వయస్సున్న నాసోదరిని నేనెప్పుడు అంతలా ఊహించలేదు. మాకు చాలా బాధ వేసింది.

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న డాక్టర్స్, స్పైనల్ కార్డ్ లో ఉన్న ట్యూమర్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసివేయాలనీ అదే నడుము, కాళ్ళ నొప్పికి కారణమనీ చెప్పారు. డాక్టర్స్ ఇంకా ఇలా అన్నారు, “ఆమెకు కాళ్ళు కదపలేకపోయే పరిస్థితి కూడా రావచ్చు, లేక నడవటానికి 3 నుంచి 6 మాసాలు పట్టవచ్చు”.

ఇంతవరకు బాబా అంతా చూసుకుంటారనే నమ్మకంతోనే ఉండి బాధపడలేదు. కాని ప్రతీక్షణం పరిస్ఠితులు మారిపోవడం మొదలైంది. ఆమె తొందరగా నడిచేటట్లు చూడమనీ, ఆమె చక్రాల కుర్చీలో తిరగడం చూడలెననీ బాబా వద్ద రోదించాను.

ఆ సమయం లో మా బంధువలందరూ వచ్చి మాకు దైర్యాన్ని చెప్పారు. ఈ ఆపరేషన్ విజయవంతమయ్యి నా సోదరి తొందరలోనే నడిచేటట్లు చేయమని మేమంతా బాబాని ప్రార్థించాము. మరునాడు ఆపరేషన్ అయిన తరువాత డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందనీ, ఆస్పత్రిలో 10 రోజులు ఉండాలనీ చెప్పారు. అసలు ఇది ఎందుకని వచ్చిందో తెలియడానికి తీసి వేసిన భాగాన్ని బయాప్సీ పరీక్ష కోసం పంపిస్తామని చెప్పారు. ఒక వారం రోజుల తరువాత అది కాన్సర్ వల్ల అని చెప్పారు.

నాకు బాగా దుఃఖం వచ్చింది. ఆమెని ఈ కాన్సర్ బారినుండి గట్టెక్కించమని బాబాని ప్రార్థించాను. నాకంతకన్న మార్గం తోచలేదు. మరలా మరలా బాబా పాదాలను పట్టుకుని నా సోదరికి ఆరోగ్యాన్ని ప్రసాదించి మామూలు మనిషిని చేయమని వేడుకున్నాను.

మేము మా సోదరిని మల్టీ స్పెషాలిటీ కాన్సర్ ఆస్పత్రిలో చేర్పించాము. కాన్సర్ కి వైద్యం కెమోథెరపీ మొదలుపెట్టడానికి ముందర అబార్షన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. కాన్సర్ కి చాలా శక్తివంతమైన మందులు వాడటం వల్ల కడుపులోని బిడ్డకి కూడా హానికరం అవుతుందనే ఉద్దేశ్యంతో మేము కూడా దానికి సరే అన్నాము.

కాని అబార్షన్ చెయలేదు. ఈ సమయంలో కూడా తను నడవలేకపోయేది. బాబా దయ వల్ల గురువారము నాడు సుఖ ప్రసవమయింది. (సిజేరియన్ అవుతుందేమో అనుకున్నాము అది ఇంకా బాధాకరంగా ఉండేది.) కాని బాబా అనుగ్రహంతో నార్మల్ డెలివరీ అయింది, కాని శిశువు కొద్ది గంటలలోనే మరణించింది.

రేపు తరువాయి బాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles