Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
తరవాత మా పెద్ద అబ్బాయి రేవంత్ కి చిన్నప్పుడే బాగా ఆయాసం జ్వరం వచ్చింది. నేను తట్టుకోలేక బాబా దగ్గర ఏడ్చేదాన్ని.
ఇలా కాదులే అని బాబా ఆజ్ఞతో “గురుచరిత్ర” చదవటం మొదలుపెట్టాను. 18 సార్లు చదివేసరికి ఎవరో ఒక ఆవిడ తలుపుతట్టి ”గాడిద పాలు పట్టు తగ్గిపోతుంది” అని చెప్పింది.
వెంటనే అది తప్పో ఒప్పో ఆలోచించలేదు, వెంటనే గాడిద పాలు మూడు స్పూన్లు పట్టాను. ఇంత వరకు అంటే ఇప్పటికి 15 సంవత్సరాలు చక్కగా ఉన్నాడు.
ఆయాసం ఎటు పోయిందో తెలియదు, బాబా రక్షించాడు అనుకున్నాము.
అలాగే బాబుకి ఉపనయనం అనుకున్నాము. కానీ బాబా ఉన్నారులే అని మొదలుపెట్టాము. చేతిలో డబ్బులు లేవు. ఏదైతే అదవుతుంది అని అనుకున్నాము.
అంతే అందరూ తలా ఒక చెయ్యి వేసుకుని కార్యం జరిపించారు. బాబా దయ వలన గట్టెక్కింది.
ఉపనయనం రోజున తెల్లవారుఝామున రెండు గంటలు నుండి మా పెద్ద అబ్బాయి బాబాకి 108 రకాలతో అభిషేకం చేస్తూనే ఉన్నాడు.
ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. ఇద్దరు బ్రాహ్మణులు భోజనానికి కావాలన్నారు. కానీ ఒక బ్రాహ్మణుడే దొరికాడు.
ఎలా ఎలా అని అనుకుంటే నా చెవి దగ్గర ఒక గొంతు వినపడింది. ఏమనంటే “నాకు విస్తరి వేయి. నేను వస్తున్నాను” అని. వెంటనే విస్తరి వేసి వడ్డించి బాబాని ఆహ్వానించాను. చెప్పలేనంత ఆనందం వేసింది.
తరువాత 16 రోజులకి పండుగ వచ్చింది. ఉపనయనం అయిన 16 రోజులకి ముతైదువులను పిలిచి మొలకెత్తిన నవధాన్యాలు, ముకుడను వాయినం ఇవ్వాలి అన్నారు.
అప్పుడు వెంటనే ఫోన్ వచ్చింది. మా భజన మండలి సభ్యుల నుండి. ”అమ్మా బాబా గారు ఏదో ఒక రూపంలో మూకుడు తీసుకోవడానికి వస్తారట స్వప్నంలో చెప్పారు. చాలా జాగ్రత్తగా చూసుకో ఎవరి రూపంలో వస్తారో” అని చెప్పారు.
నేను బాబాకి రోజూ పడుకునే ముందు మంచినీరు పెడతాను. అక్కడికి వెళ్లి బాబా ఏ రూపంలో వస్తారో ఏమిటో అనుకుంటూ మంచం దగ్గర ఉన్న చెంబుని చూసాను, అందులో సగం నీళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది.
రాత్రి నేను చెంబు నిండా నీళ్ళు పెట్టాను, ఇప్పుడు సగం ఉన్నాయి అని అనుకున్నంతలో ఒకావిడ ఎవరో తలుపు తట్టి ఇవాళ మీ ఇంట్లో భోజనం చేస్తాను. నాకు ఏదైనా దానం ఇవ్వండి అంది.
ఆమ్మో బాబా వచ్చాడని అనుకోని, ఆమెను కూర్చోబెట్టి ఉపచారాలు చేసి, భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మూకుడు వాయనం ఇచ్చాను. ఎంతో సంతోష పడ్డాను.
ఆవిడ ఎవరో తెలియదు పైగా ”నేను బ్రాహ్మణుల ఆవిడనే నాకు ”వాయనం” ఇవ్వొచ్చు” అంది. తీసుకుని ఎటువైపు వెళ్లిందో తెలియదు. అలా ఉపనయనం జరిగింది.
నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. చాలా భయపడ్డాము. ”బాబా” నువ్వే దిక్కు అనుకున్నాను.
మెడిటేషన్ చెయ్యటం మొదలుపెట్టాను. ”బాబా”, సచ్చరిత్రలో చెప్పింది అదే కదా! అంతర్ముఖంగా అని అన్నారు కదా అని ధ్యానం మొదలు పెట్టిన ఆరు నెలలకి ఒక్క మందు వాడకుండానే MRI తీస్తే అందులో ఏమి లేదు అని వచ్చింది.
MRI తీసే ముందు రోజు బ్రెయిన్ లో ఏదో పెద్ద శబ్దం వచ్చింది, పగిలినట్లుగా ఏమిటో అనుకున్నాను. తరువాత తెలిసింది ట్యూమర్ పగిలింది అని. అక్కడ సేవ్ అయ్యాను.
మేము మధ్య తరగతి వాళ్ళం. మాకు మానస సరోవరం వెళ్ళే స్థోమత లేదు, కానీ నాకు ఒకటే వెళ్ళాలని ఉండేది.
ఎందుకో ఎప్పుడు వెడతాను అనుకునే దాన్ని, అంతలో ఆఫర్ వచ్చింది. మాకు తెల్సిన వాళ్ళు వెళ్తున్నారు. నువ్వు వస్తావా అని అడిగారు.
కానీ ”నాకు అంత స్థోమత లేదండి” అని అన్నాను. కానీ లోపల వెళ్ళాలని ఉంది కానీ ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
మానస సరోవరం తీసుకెళ్ళే ట్రావెల్స్ కి ఫోన్ చేసాం. ”నాకు రావాలని ఉంది, కానీ నా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవు. రెండు మూడు నెలల తర్వాత ఇస్తాము” అన్నాను.
మాములుగా అలా అంటే ఎవరు ఒప్పుకోరు కానీ బాబా దయ వల్ల ఒప్పుకున్నారు, నన్ను తీసుళ్ళారు.
మానస సరోవరం నుండి వచ్చిన సంవత్సరానికి ఆ డబ్బులు మా అమ్మగారు ఇచ్చారు. ఆ సంవత్సరం నన్ను వాళ్ళు డబ్బులు కోసం ఒత్తిడి చేయలేదు.
ఇక మానస సరోవరంలో జరిగింది చెప్తాను. అక్కడ ఆక్సిజన్ లేదు, గాలి ఆడదు, అక్కడ పరిక్రమ చేసేటప్పుడు (శిఖరానికి) పెద్ద తుఫాను వచ్చింది, అందులో తడిసిపోయాను, వణికిపోతున్నాము, బట్టలు మరో జత లేవు, రూములో ఉన్నాయి.
ప్రదక్షిణలు చేసేదగ్గర అవి కూడా బరువు అని తీసుకెళ్ళనియ్యరు. ఇంక చిన్న చిన్న డేరాలలో చేరాము. చలికి వణికి పోతున్నాము,” ఇంక నా పని అయిపోయింది, బాబా నా పిల్లలను కాపాడు, ఇక్కడే ప్రాణాలు వదులుతాను, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను” అన్నా బాబాతో.
నాకసలు ఊపిరి ఆడటం లేదు. ఒక్క క్షణం అలా నిద్ర లాగా వచ్చింది. అప్పుడు బాబా కనపడి ”వెనక్కి మరలిపో ప్రదక్షిణ వద్దు” అని చెప్పారు.
బాబా నోటి వెంట ”చొంగ” వస్తుంది అది నా నోట్లో పోశారు. అంతే చలి మటుమాయం. నేను లేచాను ఆక్టివ్ గా.
కొంతమంది ముందుకు వెడదాం అన్నారు, నేను రాను అన్నాను, నాతో కొంతమంది వెనక్కు వచ్చేసారు. ముందుకు వెళ్లిన వాళ్ళు ఇరుక్కుపోయారు, కొంతమంది చనిపోయారు. నన్ను అలా కాపాడారు బాబా.
ఇంకా చాలా ఉన్నాయి. బాబాను పట్టుకున్న ప్రతి ఒక్కరికి అనుభవాలు, అనుభూతులు కోకోల్లలు.
బాబాకి నేను రుణ పడి ఉంటాను. నాకు అసలైన బాబాను కలుసుకొని ఆయనతో సాంగత్యానికి నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు.
The above miracle has been typed by : Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా నామస్మరణ ఎన్నో ఆపదల నుండి కాపాడే రక్షక కవచం …!
- ప్రాణ గండం నుండి కాపాడిన కాలాతీతుడు
- భక్తునిపై ఆకారణముగా వచ్చిన ఆపదల నుండి కాపాడిన బాబా వారు.
- గ్యాస్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు
- కాన్సర్ బారి నుండి కాపాడిన బాబా 1వ బాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments