ఛండీఘర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర 1వ బాగం..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఛండీఘర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర 1వ బాగం..

ఛండీఘర్ లో ని సాయిబాబా మందిరము నిర్మాణము వెనుక బాబా గారి లీలను తెలుసుకుందాము. భాబా గుడి కట్టాలంటే యెంతో పుణ్యం చేసుకుని వుండాలి. మనలొ సంకల్పం కలగాలే గాని, బాబా గారు దగ్గిరుండి మరీ మనకు సహాయం చేస్తారు.

35 సంవత్సరాల క్రితం చండీఘర్ దాని చుట్టు పక్కల గల ప్రాంతంలో చాలా మందికి సాయిబాబా గురించి తెలియదు. కొంత మంది ఆర్మీ వారు ఛండీఘర్ నుంచి పూనా వద్ద పోస్ట్ చేయబడ్డారు. ఆవిథంగా వారికి షిర్డీ సాయిబాబా గురించి తెలిసింది.

ప్రతీరోజు రేడియో వినే వారికి భక్తి సంగీతం గురించి తెలుసు. 1980 ప్రాంతాల్లో పొద్దున్న, మథ్యాన్నం భక్తి సంగీతం ప్రసారమవుతూ ఉండేది. ప్రతిరోజు మథ్యాన్నము సాథారణంగా ప్రసారం చేసే భజన “రాం కహో రహనాం కహో, మేరే సాయీ సబ్ మే సమాయా హై, హర్ తరఫ్ కీ ఉసీ కీ చాయా, రాం కహో రహనాం కహో” ప్రజలకి షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకోవడానికి ఇదొక ప్రచార మాథ్యమం. ఆ రోజుల్లో ఛండీఘర్ ప్రాంతంలో శ్రీ ఐ.పీ. మెహతా అనే సామాన్య వ్యక్తి పోస్ట్ మాన్ గా పని చేస్తూ ఉండేవారు.
అతని జీవనాథారం అతని ఉద్యోగమే. అతను ఛండీఘర్ లో సెక్టార్ 30 లో ఉండేవాడు. బహుశా కొంతమంది ఆర్మీ వారు ఛండీ ఘర్ లో ఒక చిరునామాకి సాయి లీల పత్రిక పోస్ట్ లో పంపడం జరిగింది. మెహతా గారికి పోస్ట్ లో వచ్చిన ఈ సాయి లీల పత్రికను చూద్దామనే తలంపు కలిగింది. ఆయన పుస్తకం తెరచి చదివి మరల కవరులో పెట్టి ఆ పుస్తకం యెవరికి వచ్చిందో వారికి అందజేశాడు. ఆయన ఆ పత్రిక చదివాక శ్రథ్థ కలిగి మరొక సంచిక కోసం ఆత్రుతగా యెదురు చూశాడు. ఇక్కడ బాబా గారి లీల తన భక్తులని యెలా రప్పించుకుంటున్నారో చూడండి. పత్రిక, చందా వల్ల క్రమం తప్పకుండా వస్తోంది. మెహతా గారు పత్రిక రాగానే దానిని పూర్తిగా చదివాక మరునాడు, దానిని స్వంత చిరునామాదారునికి అందచేస్తూ ఉండేవారు. ఆయనకి బాబా పట్ల భక్తి ప్రేమ వృథ్థి చెంది, షిరిడీ వెళ్ళాలనే కోరిక పెరగడం మొదలు పెట్టింది. కేవలం పత్రిక చదివినందువల్లనే మెహతాగారు బాబా వారి వద్దకు లాక్కోబడ్డారు. బాబా గారే తన గురువు అనే విషయం కూడా ఆయనకి తెలియదు. ఇదంతా కూడా 30 – 35 సవంత్సరాల నాటి మాట. ఇదంతాకూడా భక్తులకి కూడా అర్థముకాని బాబా లీల. ఆ విథంగా మరొక పిచ్చుక షిరిడీకి లాగబడింది.

మెహతా గారు బాబా గారికి శరణాగతుడయ్యారు. ఒకరోజు ఆయనకు బాబా సత్సంగము చేయమని స్వప్న దర్శనం కలిగింది. ఒకరోజు ఆయనకి వేరు వేరు యిండ్లలో సత్సంగములు జరిపించమని కల వచ్చింది. ఆయన ఈ విషయాన్ని కొంతమందికి చెప్పారు, కాని యెవరూ ఆసక్తి కనపరచలేదు. నా యింట్లో సాయి సత్సంగము చేస్తే యెవరూ రారు అనుకుని, సెక్టార్ 21 లో ఉన్న బాబా మందిరంలో చేద్దామని నిశ్చయించుకున్నాడు. బహుశా అదే ఛండీఘర్ లో జరిగిన మొట్టమొదటి సాయిబాబా సంత్సంగం. సత్సంగానికి ప్రజలను ఆకర్షించడానికి బయట బోర్డ్ ని వేళ్ళాడగట్టాడు. ఆ బోర్డ్ చదివి ఆయన దగ్గరివారు, బంథువులే కాకుండా మరికొంత మంది కూడా అక్కడికి వచ్చారు. వారు గ్రూపుగా యేర్పడదం వల్ల బాబా గారి పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రారంభంలో సమయాన్ని బట్టి వీరంతా ఒక్కొక్కరి యింటికి వెళ్ళి సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడ 4, 5 కుటుంబాల వారు నియమిత కాలంలో తమ తమ యిండ్లలో సత్సంగాలు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో మెహతాగారికి ఒక సైకిలు ఉండేది. సైకిలికి వెనకాల డప్పు ఒకటి కట్టుకుని యింటింటికి వెళ్ళి ప్రతీ వారిని మీ యింటిలో సత్సంగము పెట్టించుకొమ్మని అడుగుతూ ఉండేవారు. మెహతాగారు తనతో పాటు సైకిలు మీద డప్పుని తీసుకెళ్ళడమే కాదు, బాబాగారికి ప్రసాదాన్ని కూడా తీసుకెడుతూ ఉండేవారు. బాబాగారికి మాత్రమే తెలుసు తన పథ్థతులు, ఇంకా తనభక్తులకు యెలా యేర్పాటు చెయ్యాలో తెలుసు.

మెల్ల మెల్లగా ఇంకా ఇంకా భక్తులు ఆసక్తి చూపడం మొదలుపెట్టి, చెయ్యీ చెయ్యీ కలుపుకొని, ఛండిఘర్లో మొట్టమొదటగా “షిరిడి సేవా సమాజ్” ని ప్రారంభించారు. ఈ ఆర్గనైజేషన్ ని వారు రెజిస్టర్ చేయించారు. సభ్యులుగా ఉన్న భక్తులంతా కూడా బాబా లీలలు ప్రచారమెలా చేయాలో తమలో తాము చర్చించుకుని, బాబా వారికి మందిరం నిర్మించాలనే యేకగ్రీవ నిర్ణయానికి వచ్చారు.

ఇక తరువాతి దశ బాబా మందిరానికి స్థలం కావాలి. అందుచేత ఆర్థిక వనరుల సమస్య ఉండటం వల్ల తమ కల నిజం కావడం అసాథ్యమనుకున్నారు. కాని, బాబా గారు ఛండీఘర్ లో మందిరం ఉండాలి అని నిర్ణయించుకొంటే యేది అడ్డుకొంటుంది? సామెత చెప్పినట్లుగా కఱ్ఱ దొరికితే బండి తయారు చేయచ్చు. ఆ రోజుల్లొ మత సమంబంథమైన సంస్థలు స్థలం కొనదలిస్తే ప్రభుత్వం ఒక స్కీమును పెట్టింది. స్థలం కావాలంటే స్థలం విలువలో 10 శాతం ప్రభుత్వానికి కట్టాలి. మరలా ఆర్థిక సమస్య, కాని యెక్కువ భక్తిగల భక్తులు కొందరు తమ సంపాదన లోని ప్రతీ పైసా భక్తితో సమర్పించుకున్నారు. బాబా గారు దీనిని సాథ్యం చేశారు. ఛండీఘర్లో ని సెక్టార్ 29 లో స్థలం కేటాయించబడింది. అడ్మినిస్ట్రేటివ్ శాఖలో కొంతమంది తమంత తాముగ ఈ స్థలం కేటాయింపులో నిశ్వార్థమైన సేవ చెసి ఈ ప్రణాళికని విజయవంతం చేయడం మెహతా గారు గుర్తు చేసుకుంటూ ఉంటారు.  బాబా గారు తప్ప మరెవరు దీనిని సాథ్యం చేయగలరు….?

స్థలం కేటాయించబడ్డాక, తరువాత పెద్ద దశ కట్టడం ప్రారంభించడం, కాని అప్పటికే మరల ఆర్థిక సమస్య, వారి వద్ద తాము అన్నుకున్నంత సొమ్ము లేదు. సమాజ్ లో ని భక్తులందరూ కూడా తమ శాయశక్తులా తమ వంతు సహాయం చేసి సాయి సత్సంగ్ లో విరాళాలుగా వచ్చిన సొమ్మంతా కూడా మందిర నిర్మాణానికి కావలసిన నిథులకే సమర్పించారు. కాని వసూలయిన చందా అంత యెక్కువ కాదు, మందిర నిర్మాణమంటే అది ఒక బృహత్కార్యం.

రేపు తరువాయి బాగం…..

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఛండీఘర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర 1వ బాగం..

kishore Babu

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles