జలంథర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఫ్రియాంకా రౌతేలా గారి అనుభవం

మేము కుటుంబంతో జలంథర్ వెళ్ళాము.  మా జలంథర్ ట్రిప్ ముందు అనుకున్న ప్రోగ్రాం కాదు, కాని బాబా గారు నాకోసం వేరే ఉద్దేశ్యంతొ చేయించి ఉండవచ్చు. ఆయన లీలలు, చర్యలు చాలా నిగూఢంగా ఉంటాయి.  అక్కడ వెతుకుంటూ బాబా మందిరం కి వెళ్ళాం.  మందిరం లోపల పెద్ద బాబా విగ్రహం ఉంది. మందిరం వెలుపలి భాగం చాల అందంగా నిర్మించారు, ఆ ఆకృతి అందాన్ని చూసిన తన్మయత్నంలోనించి తేరుకునేటప్పటికి నాకు 15 నిమిషాలు పట్టింది. ఆకృతిని చూసి ఆశ్చర్య పడుతుండగా నా కళ్ళు ఒక బోర్డ్ మీద పడ్డాయి, దాని మీద ఇలా రాసుంది  “పంజాబులో ఇదే మొట్టమొదటి బాబా మందిరము”.  నేను సంతోషంగా ఉన్న సమయంలో, ఈ బాబా మందిరం చరిత్ర గురించిన సమాచారం నాకు లభ్యమవుతుందా అనే అలోచనలో నిమగ్నమయ్యాను.  బాబా దర్శనం అయిన తరువాత, నేను అన్నివైపుల అడుగుతూ, గగన్ కాల్ రా గారిని కలుసుకున్నాను. ఆయన ఈ క్రింది విథంగా జలంథర్ బాబా మందిరం చరిత్రని వివరించారు/

సెప్టెంబరు, 5 వ తారీకు, 1996 న సాయి మందిర్ జలంథర్ ప్రారంభింపబడింది. ఇది కాల్ ర కుటింబీకుల స్వంత మందిరం. గగన్ జీ గారు గతంలోకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు. 1992 లో మా కుటుంబమంతా కూడా చాలా ఆర్థిక బాథలలో ఉన్నాము. పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఆ సమయంలో గగన్ జీ చదువును ఆపేయవలసి వచ్చింది. ప్రైవేటుకి ఇవ్వడానికి, యితర చదువుకి సంబంథించిన ఖర్చులకి కూడా డబ్బు చెల్లించలేకపోయేవారు.

గగన్ జీ గారి తల్లి గొప్ప భక్తిపరురాలు. ఆమె తన యింటిలో నున్న మందిరంలో చిన్న బాబా ఫోటొ ఒకటి పాతది ఉంది. దానికే ఆమె రోజు పూజ చేస్తూ ఉండేది.  ఒకరోజు దీపావళి నాటి రాత్రి దీపావళి చేసుకోవడాన్ని పక్కన పెట్టండి, తమ యింటిలొ ఆహారానికి కూడా డబ్బులేదనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. గగన్ జీ గారి తల్లి బాబా ముందర కూర్చుని యేడిచింది. “బాబా నువ్వు నీటితో దీపాలను వెలిగించావు. కానీ  నా యింటిలో తినడానికి కూడా యేమీ లేదు, యిక దీపావళి యెలా చేసుకోను బాబా” అని యేడిచింది. సరిగ్గా అప్పుడే యిద్దరు కుఱ్ఱవాళ్ళు వారి వద్దకు వచ్చి, వృత్తి రీత్యా ఉపాథ్యాయుడైన గగన్ జీ తండ్రి గారిని ప్రైవేటు చెప్పమని అడిగారు. యీ అబ్బాయిలిద్దరూ ట్యూషన్ ఫీజు ముందుగానె చెల్లించారు. వారందరికి యిది కొంచెం ఆశ్చర్యమనిపించింది, యెందుకంటే సాథారణంగా ముందుగానే ఫీజు ఇచ్చే పథ్థతి లేదు. ఆ రోజు వారందరూ తమ ఆకలిని తీర్చుకోవడమే కాక దీపావళి కూడా చేసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. కాల్ రా కుటుంబం మొత్తమందరికి సాయి భక్తి అప్పుడే మొదలైంది. ఆరోజునించి కార్ లా కుటుంబమంతా బాబాని యెక్కువ భక్తితోను నమ్మకంతోను పూజించడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తూ ఉండగా గగన్ జీ తండ్రి గారి వద్దకు యింకా యింకా ట్యూషన్స్ రావడం మొదలు పెట్టాయి, యింకా యెప్పటినుంచో  పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసు గెలిచి వారి ఫ్యాక్టరీ వారికి తిరిగి వచ్చింది. యిక ప్రతీదీ కూడా వెనకకు తిరిగి రావడం మొదలుపెట్టాయి. బాబా దయతో తక్కువ కాలంలోనే వారు తమ స్వంత ప్లాటు కొనుక్కున్నారు.

ఒకరోజున అనుకోకుండా చిన్న కుక్క పిల్ల ఒకటి (3 నెలల వయసు) వాళ్ళ యింటి ప్రవేశ ద్వారం వద్ద బయట కూచుని ఉంది. ఆ కుక్కపిల్లని మొదటగా చూసింది గగన్ జీ తల్లిగారే. కొంచెం పరీక్షగా చూసేటప్పటికి అది చాలా అనారోగ్యంతో ఉంది. గగన్ జీ గారు దానిని పశు వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళి దానికి అవసరమయిన వైద్యం చేయమన్నారు.  కొద్ది రోజులలోనే, కుక్కపిల్ల కోలుకుంది. అది కాల్ రా గారి కుటుంబంలో ఒక భాగమయిపోయింది. గగన్ జీ తల్లి దానికి ప్రేమగా రాజు అని పేరు పెట్టారు. రాజు మిగత కుక్కలకన్న వేరుగా ఉండేది. గగన్ జీ తల్లి గారు బాబా పూజ చేస్తున్నప్పుడల్లా అది ఆవిడ ఒళ్ళో కూర్చుంటూ ఉండేది. ఒక రోజున ప్రార్థిస్తూ ఆమె రాజు తో, యేదీ, నీకళ్ళల్లొ బాబా ని చూడగలమేమో చూస్తాను అని, దాని కళ్ళల్లో బాబా ఫొటొ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూశారు.

అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కాల్ రా కుటుంబమంతా పూర్తిగా బాబా భక్తిలో నిమగ్నమైపోయారు. వారి వ్యాపారం కూడా బాగా అభివృథ్థి చెందుతూ, రోజులు గదిచేకొద్దీ కాల్ రా గారి కుటుంబం ఐశ్వర్యం దిశగా పయనించారు. యితర ఆస్తులే కాకుండా వారికి కొంత స్థలం కూడా ఉంది. అందులో వారు సొంతంగా ఇల్లు కట్టుకుని,  యింటి ముందర చిన్న బాబా మందిరం కూడా కట్టుకుందామనే యోచనలో ఉన్నారు.

ముందర అనుకున్న ప్రకారం చిన్న మందిరంలో పెట్టడానికి చిన్న బాబా విగ్రహం కొనడానికి, 1995 లో కార్ లా కుటుంబం జయపూర్ వెళ్ళారు,  కాని అక్కడకి వెళ్ళి సుందరమైన పెద్ద బాబా విగ్రహాన్ని చూశాక, యిక ఆగలేక పెద్ద విగ్రహానికి ఆర్డర్ ఇచ్చారు. అంత పెద్ద విగ్రహానికి తాము ఆర్డర్ ఇవ్వడం వారికే చాలా ఆశ్చర్యం వేసింది.  విగ్రహం పూర్తవడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఈ లోగా గగన్ జీ తల్లి గారికి 21 జూన్ ఉదయం 4.30కి ఒక కల వచ్చింది. అందులో ఆమెకు యేమీ కనపడలేదు, కాని బాబా గారి మాట వినపడింది.  “ఇప్పుడు నా కోసం సమాథిని కూడా నిర్మించు”  ఆమె నిద్ర నుండి లేచింది, నా కోసం సమాథి నిర్మించు అన్నారు, దీని అర్థమేమిటి, తాము బాబా సమాథి యెట్లా నిర్మించాలి అని ఆశ్చర్య పడింది. దాని గురించి యింకా ఆలోచించే లోపలే, తన మంచం కింద తన చిన్న కుక్క రాజు చనిపోయి ఉండడం చూసింది. అప్పుడామెకి అర్థమయింది, రాజు, బాబా తప్ప మరెవరూ కాదని. 

రాజు చనిపోయిన 3 నెలలకి, జయపూర్ నుంచి,  బాబా విగ్రహం తయారయింది, వచ్చి తీసికెళ్ళమని ఫోన్ వచ్చింది. కార్ లా కుటుంబం యింకా మరికొంత మంది కుటుంబ సభ్యులతో పెద్ద విగ్రహాన్ని తీసుకురావడానికి పెద్ద ట్రక్కులో బయలుదేరి వెళ్ళారు. వారు ట్రక్కుని షిర్డీ లో సమాథి మందిరానికి పక్కనే నిలిపి ఉంచారు. పూజారి గారు అక్కడే అన్ని పూజాదికాలు, ప్రాణప్రతిష్ట మొదలైనవన్ని చేశారు. షిరిడీ లో ప్రాణ ప్రతిష్ట చేసిన తరువాత, కార్ లా కుటుంబాము వారి యింటి వద్దకు తెచ్చి విగ్రహ స్థాపన చేశారు. సాయి తాను స్వయంగా కోరిన కోరిక ప్రకారం రాజు సమాథి ఈ మందిరంలోనే చెశారు.

 బాబా చేసిన ఈ లీలలు అగోచరము. అది మానవుని ఆలోచనా శక్తికందనిది. ఈ రోజున ఈ సుందరమైన పెద్ద మందిరానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. షిర్డీలో జరుగుతున్నట్లే హారతి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. హారతీ, యింకా మిగతా కార్యక్రమాలన్ని కూడా కార్ లా కుటుంబము వారే చేస్తున్నారు. కార్ లా కుటుంబము వారికి ఈ తరంలోనే కాదు, వచ్చే అన్ని తరాల వారికి కూడా బాబా ని సేవించుకునే అనుగ్రహం కలిగింది.

సాయి బంథువులారా గగన్ జీ గారి తల్లి పాత బాబా ఫొటొ ఒకటి ఉంటే దానినే తన యింటిలో చిన్న మందిరంలో పెట్టుకుని పూజిస్తూ ఉండేది. ఆమె యెప్పుడు తమ దీన స్థితి గురించి బాబాని నిందించలేదు. ఒక దీపావళి రోజున కూడా ఆమె బాబా కి నైవేద్యము కూడా యేమీ సమర్పించలేదు. ఆర్తితో “బాబా, నువ్వు నీటితో దీపాలని వెలిగించావు. మా యింటిలో తినడానికే తిండి లేదు, యిక దీపావళి యెలా చేసుకోము బాబా” అని రోదించింది. ఇక్కడ బాబా గారు , తనకి యేమి సమర్పించలేదని మిన్నకుండిపోయారా? మంచి అందమైన ఫొటో పెట్టుకోకుండా పూజిస్తున్నారని మిన్నకున్నారా? లేదు. ఆయన నాకు కావలసింది భక్తి, ఓర్పు, సహనం, శ్రథ్థ అన్నారు. బాబా గారు ఆమె ఆర్తికి, భక్తికి చలించి పోయారు. వెంటనే తన లీలని ప్రకటించారు. యెంతటి అదృష్టవంతులు వారు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “జలంథర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర

Sreenivas

ఈ లీల చాలా బాగుంది సాయి…సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles