Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శివపూర్ బాబా మందిరము మహిమలు అరవ బాగం….
లీల నం.15
20 రోజుల క్రితం ఒక బాలుడికి ఫైబర్ ముక్క కంటిలో గుచ్చుకొంది. తల్లితండ్రులు ఆ పిల్లవానిని హాస్పిటలికి (కలకత్తాలో ప్రముఖ కంటి ఆసుపత్రి) తీసుకువెళ్ళారు. 15 రోజులు వైద్యం చేసినా యెమి గుణము కనపడలేదు. వారు కన్ను పూర్తిగా చెడిపోయింది, భవిష్యత్తులో అబ్బాయి చూడలేడు, చూపు పోతుంది అని చెప్పారు.
తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె శివపూర్ బాబా గుడికి వచ్చి బాబా ముందర విలపించింది. ఆమె అమిత్ గారిని పిల్లవాడి కోసం బాబాని ప్రార్థించమని చెప్పింది. అమిత్ గారు బాబా ముందు ప్రార్థించి ఆమెకు బాబా ప్రసాదం ఇచ్చారు. తరువాత వారు పళ్ళు తీసుకు వచ్చి బాబా కి కృతజ్ణతలు చెప్పారు, అబ్బాయికి ఛూపు వచ్చిందని ఆనందంతో చెప్పారు. యెంత అద్భుతమైనలీల చేశారు బాబా గారు?
లీల నం.16
కొన్నాళ్ళక్రితం ఒక పెద్దాయన ఉదయం 4 గంటల ప్రాంతంలో అమిత్ గారి వద్దకు వచ్చి శిరసు వంచి నమస్కరించారు. అమిత్ గారు ఆశ్చర్య పోయి, నాకెందుకు శిరసు వంచి నమస్కారము చేస్తున్నారు, నేను మీకన్నచిన్నవాడిని అన్నారు. అప్పుడు ఆయన తనకి వచ్చిన కల గురించి చెప్పారు.
“అమిత్జీ గారు పొడవైన కఫినీ, ధోతీ థరించి, కుడిచేతిలో సటకా, యెడమ చేతిలో కమండలము థరించి సముద్రము మథ్యలో కూర్చున్న బాబా గారి వద్ద నిలబడి ఉన్నారు. ఇద్దరూ సంభాషించుకొంటున్నారు, బాబా గారి చేయిఅమిత్ గారి మీద ఉంది” అమిత్ గారు బాబా గారి చేత అనుగ్రహింపబడినవారు.
లీల నం.17
బ్రెస్ట్ కాన్సర్ ని తగ్గించిన బాబా అద్భుత లీల
బాబా యొక్క మరొక అద్భుతమైన లీల తెలుసుకుందాము. ఇది నిజంగా చాలా అత్యద్భుతమైన లీల. ఈ లీల ద్వారా బాబా ఘటనాఘటన సమర్థుడు అని తెలుస్తుంది.
నాడియా వాసి అయిన శ్రీమతి లతికా ఘోష్ గారికి రొమ్ము వద్ద యిన్ ఫెక్షన్ మొదలయింది. దురదృష్టవశాత్తు స్థానికంగా ఉన్న వైద్యులు సరిగా గుర్తించకుండా తప్పుడు వైద్యం చేశారు. రోజులు గడుస్తున్నా ఆమె ఆరోగ్యంలో యెటువంటి మార్పు లేదు, ఆమె పరిస్థితి యింకా దిగజారడం మొదలుపెట్టింది. అప్పుడామె యింకా కొన్ని అవలక్షణాలతో బాధపడుతోంది.
ఆఖరికి అది కాన్సర్ అని గుర్తించాక, ఆమెని నిల్ రతన్ సర్కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడామె తీవ్రమైన రక్తలేమితో బాధపడుతూంటే అది లుకేమియాగా గుర్తించి ఆమెకు వెంటనే రక్తం మార్చడానికి నిర్ణయించుకున్నారు. చివరికి యిక ఆమె బ్రతకదని, ప్రతీరోజు ఆస్పత్రి చార్జీలు కూడా చెల్లించడానికి వారు అంతగా ఆర్థికంగా ఉన్నవారు కాదు కనుక ఆస్పత్రినించి ఆమెని విడుదల చేశారు.
లతిక గారి తోటి కోడలు శివపూర్ గ్రామంలోని యింటి వారి కోడలు. ఆమె శ్రీరామ నవమి నాడు (24, మార్చ్ 2010) బాబా గారి ప్రతిష్ఠాపన జరుగుతున్న రోజున బాబా దర్శనానికి వచ్చింది. హఠాత్తుగా ఆమెకు, లతికా చివరి దశలో ఉందనీ, ఎంత వీలైతే అంత తొందరగా యింటికి రమ్మని మొబైల్ కి కాల్ వచ్చింది.
ఇది వినగానే ఆమె అదిరిపడి బాబా ముందు ఉద్రేకంగా బిగ్గరగా ఏడిచింది. అక్కడి గుడి కమిటీ సభ్యులని, బాబా దయతో లతికా ప్రశాంతంగా దేహాన్ని విడిచి వెడుతుందని కొంత ఊదీ, ప్రసాదం లతిక కోసం అడిగింది. ఊదీ, ప్రసాదం తీసుకుని వెంటనే ఆమె యింటికి వెళ్ళేటప్పటికి లతిక పూర్తిగా అచేతనంలో ఉంది. మెల్లిగా ఆమె చివరిదశలోకి వెడుతోంది. ఆమె వెంటనే లతిక నోటిలో ప్రసాదం ఉంచి, కొంత ఊదీ ఆమె నుదుటిమీద పెట్టింది.
తరువాత జరిగిన అద్భుతమైన లీలకి, అక్కడ ఉన్నవారికి ఎవరికీ నోట మాట లేదు. వెంటనే లతిక లేచి మంచం మీద కూర్చుని పూర్తి స్పృహలోకి వచ్చి, నిలకడగా, స్పష్టంగా, “నువ్వు యింతకుముందే నాకు ఈ ఊదీ ప్రసాదం ఎందుకు తేలేదు?” అని అడిగింది.
ఇప్పుడు జరిగినది చూసి అక్కడున్న ఆమె బంధువులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. లతిక తోటికోడలు వెంటనే బాబా గుడికి వెళ్ళి బాబా ముందు ఏడిచింది. ఇప్పుడు ఆమె కళ్ళలోంచి వచ్చిన కన్నీరు బాబా అనుగ్రహంతో పరిమళించాయి. అవి బాబా మీద ప్రేమకి, భక్తికి ప్రతీకలు. బాబా ఘటనాఘటన సమర్థుడు. ఇప్పుడు లతిక పూర్తిగా కోలుకుంది. ఇంతకు ముందులాగే ఆమె తన పనులన్నీ చేసుకుంటోంది.
ఇవీ సౌమ్య గారు చెప్పిన శివపూర్ బాబా మందిర లీలలు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శివపూర్ బాబా మందిరము మహిమలు నాల్గవ బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు మొదటి బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు మూడవ బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు రెండవ బాగం….
- శివపూర్ బాబా మందిరము మహిమలు ఐదవ బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments