ఛండీఘర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర 2వ బాగం..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

మొదటి బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి……

ఛండీఘర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర 2వ బాగం..

నిన్నటి తరువాయి బాగం…

మెహతా గారు తన భార్య నగలు అమ్మి ఆ సొమ్ముతో యిటుకలు, ఇంకా మందిరం కట్టడానికి కావలసిన యితర సామగ్రి కొనడానికి వినియోగించారు. కూలీ ఖర్చు పొదుపు చేయడానికి సాయి సమాజ్ సభ్యులందరూ కూడా, నిర్మించే పని తామే స్వయంగా చేయడానికి నిర్ణయించుకున్నారు. వారు మట్టి ని తవ్వి, అందరూ కూడా ఒక వరుసలో గొలుసులా నిలబడి యిటుకలు, సిమెంట్ బేసిన్ లు అన్ని అందించుకున్నారు. ఇవన్నీ మెహతా గారు గుర్తు చేసుకున్నారు. ఈ విథంగా సాయి మందిర శంకుస్థాపన, సాయి సమాజ్ సభ్యులందరి కఠోర శ్రమతో జరిగింది.

సమాజ్ సభ్యులందరిదీ కూడా యెంత భక్తి? వారి చేతులతో స్వయంగా వారు సుందరమైన సాయి మందిరానికి శంఖుస్థాపన చేశారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం. వారు యెంతటి అదృష్టవంతులో కదా…..!

ఈ బృహత్కార్యంలో వివిథ కుటుంబాల వారందరూ కూడా ఒకొళ్ళకొకళ్ళు భోజన పదార్థాలు తీసుకుని వచ్చి బాబా గారికి సమర్పించిన తరువాత స్వీకరిస్తూ ఉండేవారు. వారెంతటి పుణ్యం చేసుకున్నారో కదా..

ఒక్కక్కప్పుడు వీరంతా రాత్రి పొద్దుపోయేదాకా కూడా, వారి గురువు, … మన గురువు…. మన సాయి… కి సుందరమైన నివాసం కొరకు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటు పని చేశారు. సాయి ఆజ్ఞ లేనిదే సాయి మందిర నిర్మాణము జరగదని మనకు తెలుసు, పైగా సాయి మందిర నిర్మాణము యెక్కడయితే జరుగుతూ ఉంటుందో అక్కడకు బాబా గారు స్వయంగా వస్తారనే నమ్మకం కూడా ఉంది. ఇది ఛండీఘర్ సాయి మందిరంలో కూడా జరిగింది.

భక్తులు చాలా సార్లు రాత్రిళ్ళప్పుడు బాబా గారిని చూశారు. ఒక్కొక్కసారి ఆయన సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక్కొక్కసారి ముసలి ఫకీరు లాగా వచ్చి గుడి నిర్మాణం పర్యవేక్షిస్తూ ఉండేవారట. ఒక భక్తునితో మాట్లాడిన తరువాత మాయమయిపోతూ ఉండేవారట.

మెహతాజీ గారు గుర్తు చేసుకున్న ఈ సంఘటన చూడండి. ఒకసారి ఒక మహిళా భక్తురాలు గుడి నిర్మించే స్థలం లో ఉంది. అప్పుడు బాబా గారితో జరిగిన సంభాషణ:

భక్తురాలు: బాబాజీ యెక్కడనించి వస్తున్నారు? వినమ్రంగా అదిగింది.

బాబా జవాబు: షిరిడీ

భక్తురాలి తరువాతి ప్రశ్న: యెక్కడకు వెళ్ళాలి?

బాబా జవాబూ: షిరిడీ

మరలా ఆమె తిరిగి చూసేటప్పటికి బాబా గారు అదృశ్యమయారు. ఆపుడు ఆమెకు అర్థమయింది తను కలుసుకున్నది బాబాగారిని తప్ప వేరెవరినీ కాదని.
ఓ మై సాయి దేవా… నీలీలలను నేనెట్లా వర్ణించగలను. నేనంతటి నేర్పరిని కాదు. నిన్ను వర్ణించడానికి నాకు మాటలు రావు. చేయించేవాడివి నువ్వే.

బాబా గారు ఆ విథంగా తన మందిరాన్ని నిర్మాణ దశలో ఉన్నప్పుడు పర్యవేక్షించారు.  ఒకానొక దశలో యిటుకలు సరఫరా చేసిన కంట్రాక్టర్ , యింకా యిటుకలు కావాలంటే డబ్బు కావాలని చెప్పాడు. సాయి సమాజ్ వారు, మెల్ల మెల్లగా దబ్బు యిస్తాము కాని, గుడి నిర్మణానికి సామగ్రి మాత్రం ఆపద్దు అని చెప్పారు. మొదట కఠినంగా ఉన్నాడు, కానీ బాబాగారు తలుచుకున్నారు. బాబాగారె స్వయంగా తన మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించినపుడు యేదీ ఆగదు. కాంట్రాక్టర్ కావలసిన సరుకు యెంతయినా సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ విథంగా ఛండీఘర్లో సుందరమైన బాబా మందిరం నిర్మించబడింది.

గుడిలో స్థాపించడానికి విగ్రహాన్ని జయపూర్ నుండి  తేవడానికి నిర్ణయించారు. గుడి సహాయార్థం ఒక భక్తుడు తన వ్యాపారంలో మొదటి షేర్ ప్రతినెల ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఈ భక్తుని సహాయంతోను, సాయి సమాజ్ భక్తులందరి సహకారంతో చక్కటి సుందరమైన షిరిడి సాయి విగ్రహం ప్రతిష్టించబడింది.  నిర్మాణము జరిగే సమయంలోనూ, గుడి యేర్పాటు అయిన దగ్గరనించి చాలా మంది భక్తులు బాబా లీలను చూసారు, అనుభవించారు. కొన్ని సంవత్సారల క్రితం ఈ మందిరంలో జరిగిన ఒక లీలను మీముందుంచుతున్నాను.

ఈ గుడికి దగ్గరలో ఒక ఫోటొ స్టూడియో ఉంది. ఫోటో షాపతను బాబా విగ్రహాన్ని ఫోటో తీసి పెద్దదిగా పోస్టర్ గా చేద్దామనుకున్నాడు. మందిరంలోకి వెల్లి బాబా విగ్రహాన్ని వివిథ కోణాలలొ 10 ఫోటోలు తీశాడు. షాపు కి తిరిగి వచ్చి ఫోటోలని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. కాని రీలంతా కూడా ఖాళీగా ఉండి ఒక్క ఫోటో కూడా రాకపోవడంతో అతనికి ఆశ్చర్యం వేసింది. బహుశా యెక్కడో పొరపాటు చేసి ఉంటాను అనుకుని అతను మరలా మందిరంలోకి వెళ్ళి బాబా విగ్రహాన్ని వివిథ కోణాలలో,యింకా అనేక ఫోటోలు తీశాడు. మరలా షాపుకి తిరిగి వచ్చి రీలు డెవలప్ చేసి చూద్దామనుకుంటే రీలు అంతా ఖాళీగా ఉంది. ఫోటొలన్నీ చాలా క్లియర్ గా వచ్చాయి కాని బాబా ఫోటోలు మాత్రం రాలేదు.

అతను తిరిగి మందిరంలోకి వెళ్ళి ఒక భక్తునితో మాట్లాడాడు. అతను ఫోటో తీసేముందు బాబాగారి అనుమతి తీసుకోమని చెప్పాడు. అతను బాబా అనుమతి తీసుకోనందుకు బాబాకి క్షమాపణ చెప్పి, ఈ సారి ఫోటోలు తీసుకోవడానికి బాబా గారి అనుమతి కోరాడు. ఈసారి తీసిన ఫోటోలన్నీ బాగా వచ్చాయి. తన షాపులో కూడా తను తీసిన బాబా ఫోటొ ఫ్రేం కట్టించి పెట్టాడు. యెంతటి అథ్భుతమైన బాబా లీల. నేడు ఛండీఘర్లోని బాబా మందిరం యెంతో అందంగా ఉంది. బాబా దీవెనల వల్ల సుమారు ప్రతిరోజు 1000 మంది వస్తూఉంటారు. గురువారాల్లో 2500 – 3000 మంది భక్తులు ఈ మందిరానికి వస్తూ ఉంటారు.

గీతాంజలి గారు ఈ సమగ్ర సమాచారాన్ని పంపగా, శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగులో 2008 లొ పోస్ట్ చేయడం జరిగింది.

బాబా మందిరము ఛండీఘర్ చిరునామా:

షిర్డీ సాయి మందిర్,
సెక్టర్ 29 ఏ,
ఛండీఘర్.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఛండీఘర్ బాబా మందిరము – అద్భుత చరిత్ర 2వ బాగం..

Maruthi.Velaga

Jai Saibaba

kishore Babu

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4

pvln murthy

Sachitananda sadguru sai nath maharaj ki jai. Shiridi sai baba is a practical god.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles