Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
గౌరికి పెళ్ళీడు వచ్చింది. పెళ్ళి చెయ్యాలి ఆ పిల్లకి. పెళ్ళి చేసి, కూతుర్ని అత్తారింటికి పంపితే తను ఒంటరి వాడయిపోతాడు. భార్య ఎప్పుడో పోయింది.
పెళ్ళి పేరుతో ఇప్పుడు కూతురు కూడా దూరమయిపోతే తను బతకడం కష్టం. అలాగని కూతురికి పెళ్ళి చేయకుండా ఉండలేడు.ఏం చెయ్యాలో పాలుపోయేది కాదు పూజారికి.
ఎవరయినా ఇల్లరికం వస్తే బాగుణ్ణు అనుకునేవాడతను. ఆ దృష్టితో పెళ్ళికొడుకుని వెదకసాగాడు.‘
గౌరికి మంచి సంబంధం కుదరాలి బాబా! ఇల్లరికం వచ్చినట్టుగా అల్లుడు నా ఇంట ఉండిపోవాలి. అలాంటి కుర్రాడు కావాలి. దొరికితే బాగుణ్ణు.’ అనేవాడు పూజారి.‘దొరుకుతాడు. వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.’ అనేవాణ్ణి.
నేను అన్నట్టుగానే జరిగింది.ఒకరోజు ఓ బీద బ్రాహ్మణ కుర్రాడు, పూజారి ఇంటికి భిక్షకి వచ్చాడు. కుర్రాడు బాగున్నాడు. గౌరికి అన్ని విధాలా తగినట్టున్నాడు అనుకుని, అతని వివరాలన్నీ సేకరించాడు పూజారి. ఆ కుర్రాడు ఎవరో కాదు, వీరభద్రప్పే!
అతన్ని చేరదీశాడు పూజారి.‘పిల్లనిచ్చి పెళ్ళి చేస్తాను, ఇక్కడ ఉండిపోతావా?’ అడిగాడు. ఉండిపోతానన్నాడు వీరభద్రప్ప. అతనికి ఇంకో దిక్కులేదు. అదే అదృష్టంగా భావించాడు.
అతనికీ, గౌరికీ పెళ్ళి చేశాడు పూజారి.కొద్దిరోజులు గడిచాయి.అనారోగ్యం పాలయి, పూజారి చనిపోయాడు. చనిపోతూ తనకి ధనరాజ్ భార్యగా గత జన్మలో అందజేసిన భూమినే, ఇప్పుడు తిరిగి కూతురు గౌరికి అందజేశాడతను.
భార్యభర్తలుగా గౌరీ, వీరభద్రప్పా, అప్పుడప్పుడూ ఆలయానికి వచ్చేవారు. నన్ను సందర్శించేవారు. కూర్చుని కబుర్లు చెప్పేవారు.
పేదరికాన్ని తట్టుకోలేకపోతున్నామని బాధపడేవారు. ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలిద్దర్ని కూడా పోషించలేని పరిస్థితి అంటూ కన్నీళ్ళు పెట్టుకునే వాడు వీరభద్రప్ప.
అన్ని రోజులూ ఒక్కలా ఉండవు కదా, రోజులు మారాయి. ఒక రోజేమో, గౌరి పేరిట ఉన్న రెండెకరాల భూమికీ మంచి ధర పలికింది. లక్షరూపాయలు ఇవ్వజూపారు దానికి. బయానాగా ముందు యాభైవేలు చెల్లిస్తామన్నారు.
కష్టాలు గట్టెక్కాయి అనుకున్నాడు వీరభద్రప్ప. అలా అనుకోవడమే ఆలస్యం, ‘ఎక్కడ గట్టెక్కాం’ అంటూ కష్టాలు మళ్ళీ అతన్ని పలకరించాయి.
గతంలో గుడి మరమ్మత్తుల కోసం ధనరాజ్ భార్య దానం చేసిన ఆ రెండు ఎకరాల భూమీ పూజారి సొంతం కాదంటూ, సొంతం అనుకుని దానిని పూజారి గౌరికి అందజేసినా, అమ్ముకున్న పక్షంలో ఆలయ ధర్మకర్తగా తనకి అందులో వాటా చెల్లించాలన్నాడు చెన్నబసప్ప.
ఆలయానికి లభించే కానుకల్లోనూ, అక్కడ జరిగే వేడుకల్లోనూ ధర్మకర్తకి వాటా ఉంటుంది. అది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని అనుసరించే వీరభద్రప్పను వాటా అడిగాడు చెన్నబసప్ప.
వాటా చెల్లించడం వీరభద్రప్పకు ఇష్టం లేదు. పైసా ఇవ్వనని భీష్మించుక్కూర్చున్నాడతను. ఇవ్వకపోతే ఒప్పేది లేదన్నాడు చెన్నబసప్ప.
ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడతను. ఇద్దరూ తగవుకి దిగారు. పోటా పోటీగా మాటలూ, చేతులూ విసురుకున్నారు. తగవు తెగ లేదు.
ఎవరో చెప్పారు, బాబా దగ్గరికి వెళ్ళండి, తగవు తెగుతుందని. దాంతో నా దగ్గరకి వచ్చారిద్దరూ.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘మళ్ళీ పెళ్ళి చేసుకో సాఠే! నీకు తప్పకుండా మగపిల్లాడు పుడతాడు. నాదీ హామీ.’’
- కొత్త దంపతులకు షిరిడీ ద్వారకామాయి లో బాబా వారు చేసిన లీల….
- ‘చెన్నబసప్పకు వాటా ఇచ్చి తీరాల్సిందే! గట్టిగా అడిగితే ఇదే మాట బాబా కూడా చెబుతాడు.
- నీ బాధలు తీరాలంటే ఒకరే దిక్కు. ఆయనే షిరిడీ సాయిబాబా
- ‘‘ఆ వాడా ‘సాఠేవాడా’గా ప్రసిద్ధి చెందుతుంది.’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “‘దొరుకుతాడు. వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.’”
kishore Babu
January 22, 2017 at 6:45 pmSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4
kishore Babu
January 22, 2017 at 6:45 pmSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4