Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘చెప్పండి బాబా, న్యాయం మీరే చెప్పండి.’ అడిగారు.ఏం చెప్పాలి? ఏం చెబితే ఇద్దరూ తగవు మానుకుంటారు?
బాగా ఆలోచించాను. చెప్పానిలా.‘ఆ భూమి మీ ఇద్దరిదీ కాదు. గౌరిది. దాన్ని ఆమె అమ్ముకుంటే అమ్ముకుంటుంది. పంచుకుంటే పంచుకుంటుంది. ఏదైనా అంతా ఆమె ఇష్టం. అందులో మీరు కల్పించుకోకూడదు.
’‘గౌరి నా భార్య. ఆ సంగతి మీరు మరచిపోతున్నారు.’ చెప్పాడు వీరభద్రప్ప.‘అయినా సరే, పద్ధతి పద్ధతే’’ అన్నాను.
నా మాటకి వీరభద్రప్పకి కోపం వచ్చింది. తప్పు తనదని, ఫకీర్ని తగవు తీర్చమని అడగడం ఏమిటని నా మీద నోరు పారేసుకున్నాడు. చెన్నబసప్పతో చేతులు కలిపానని నిందించాడు.
చెన్నబసప్పకి వత్తాసు పలకకపోతే ఆలయంలో ఉండేందుకు చోటుండద నీ, అందుకోసమే చెన్నబసప్పని వెనకేసుకు వస్తున్నాననీ నన్ను నానా మాటలూ అన్నాడు. నవ్వుకున్నాన్నేను.
‘చెన్నబసప్పకు పైసా కూడా ఇవ్వడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఆ భూమి నీదయినా అది నాదే! జాగ్రత్త.’ గౌరిని హెచ్చరించాడు వీరభద్రప్ప. ఆమెకేం పాలుపోలేదు. వచ్చి నన్ను కలిసింది.‘ఏమిటి బాబా ఇది? నేనిప్పుడేం చెయ్యాలి?’ అడిగింది.‘సమాధానం భగవంతుడే చెబుతాడు, కంగారు దేనికి?’ అన్నాను.
‘ఏం కాదు, నీకంతా మంచే జరుగుతుంది. వెళ్ళి రా’ అన్నాను. వెళ్ళిపోయింది గౌరి.
ఆ రాత్రి గౌరికి కలలో శివుడు కనిపించాడు.‘చెన్నబసప్పకు వాటా ఇచ్చి తీరాల్సిందే! గట్టిగా అడిగితే ఇదే మాట బాబా కూడా చెబుతాడు. కావాలంటే వెళ్ళి అడుగు.’ అన్నాడు.
పొద్దున పొద్దునే గౌరి నా దగ్గరికి వచ్చింది. కలలో శివుడన్న మాటలు చెప్పింది.‘చెప్పండి బాబా, చెన్నబసప్పకు వాటా ఇచ్చి తీరాలా?’ అడిగింది.‘ఇచ్చి తీరాలి. అది అతని హక్కు.’ అన్నాను. అందుకు అంగీకరించింది గౌరి.
చెన్నబసప్పకు వాటా చెల్లించాల్సిందేనని భర్తతో చెప్పింది. ఒప్పుకోలేదు వీరభద్రప్ప.
గౌరికి మందు పెట్టానని, వశీకరణం చేసుకున్నానని, అందువలనే నేను చెప్పినట్టుగా తను వింటున్నదని రెచ్చిపోయాడు వీరభద్రప్ప. అలాగే చెన్నబసప్ప మీదికి దాడికి బయల్దేరాడు.
‘నిన్ను ముక్కలు ముక్కలు నరుకుతాను. నమిలి మింగుతాను. చూస్కో.’ అని అతన్ని బెదిరించాడు. బెదిరిపోయాడు చెన్నబసప్ప. వణికిపోతూ నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. చేతులు జోడించాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- వారి రెండు జన్మలకూ ప్రత్యక్షసాక్షిగా నేను శివాలయాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను.
- ‘దొరుకుతాడు. వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.’
- ఊధీ మహిమతో భక్తురాలి అనారోగ్యాన్ని తగ్గించి ‘గౌరి గణపతి’ పూజ నిర్విఘ్నంగా జరిపించిన బాబా వారు
- ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇంత దూరం వచ్చాను.
- బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “‘చెన్నబసప్పకు వాటా ఇచ్చి తీరాల్సిందే! గట్టిగా అడిగితే ఇదే మాట బాబా కూడా చెబుతాడు.”
kishore Babu
January 23, 2017 at 9:59 amచాల బాగున్నాయి సాయి ..ఈ ఆర్టికల్స్ …సాయి బాబా … సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.
kishore Babu
January 23, 2017 at 9:59 amచాల బాగున్నాయి సాయి ..ఈ ఆర్టికల్స్ …సాయి బాబా … సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.