Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
యునైటెడ్ కింగ్డం నుండి ఒక సాయి భక్తురాలి బాబా లీలను ఈ రోజు తెలుసుకుందాము.
నా మొఱ ఆలకించి పరీక్ష కాలంలొ బాబా చేసిన సహాయము
నా కథ నేను 9 గురువారముల వ్రతము చేస్తున్నప్పుడు, జరిగిన అనుభవాల వర్ణన. పరీక్షలు జరుగుతున్న సమయంలో నేను విపరీతమైన పీరియడ్స్ నొప్పితో బాథ పడడం జరిగింది. నాకు యెప్పుడూ అపనమ్మకం. నాకు యేకాగ్రత లేదు. ఒకోసారి స్థిర నిర్ణయం కూడా ఉండేది కాదు. నాకసలు నమ్మకం లేదు, దీనిని బట్టి నా మన స్థితి యెలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. నేను పరీక్షకి యేమి పున్శ్చరణ చేయలేదు దాని వల్ల నేను చాలా ఒత్తిడితో వెళ్ళాను. నేను పరీక్ష హాలులో సాయిబాబా విగ్రహాన్ని చూశాను. నేను నిర్ఘాంతపోయాను, యెందుకంటే విదేశాల్లో, పరీక్ష హాలులో దేవతల విగ్రహాలుంటాయని ఊహించం. బాబా దయ వల్ల నేను పరీక్ష లో ఉత్తీర్ణురాలినయ్యాను.
నాకెప్పుడు సమస్యలే కాబట్టి నాకు మంచి జరుగుంతదనే నమ్మకం లేదు. నా తరువాతి కథ కూడా పరీక్షల గురించే. నేను శ్రీ సాయి సచ్చరిత్ర, భగవద్గీత ఒకదాని తరువాత ఒకటి చదువుతూ ఉండేదాన్ని. రెండూ కూడా నువ్వు భగవంతుడితో సమానమనే చెపుతున్నాయి. ఇది చదివాక, నువ్వు కనక ఫలితాన్ని భగవంతునికి వదిలేస్తే ప్రతీదీ సాథ్యమే అని నమ్మాను. నీలో యేదైనా నైపుణ్యం ప్రకటితమైతే అది పూర్తిగా నీలో ఉన్న భగవంతుని శక్తి. అందుచేత ప్రతీ వారు సమానమే అన్నిటికీ సమర్థులే. యింతకు ముందు చెప్పినట్లుగా నేనింకా చాలా సమస్య్లలతో బాథపడుతున్నాను, కాని యింతకు ముందు చెప్పినట్లుగా నేను రెండు గ్రంథాలనూ చదవడం ప్రారంభించాక శాంతంగా ఉన్నాను. నేను ఇంక యెక్కువగా యేమీ ఆశించటంలేదు, పరీక్షా ఫలితం గురించి కూడా పట్టించుకోలేదు, నాకు తెలుసు సాయిబాబా యేది నిర్ణయించినా అది మంచి కోసమేనని. ఆయన దయవల్ల నేను ఊహించని మార్కులతో ఉత్తీర్ణురాలినయ్యాను. ఇది నా తోటివారిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.
యింతే కాకుండా, నేను ఉద్యోగం సంపాదించడానికి కూడా చాలా కష్టపడ్డాను. సాయి సచ్చరిత్ర చదవడం పూర్తి అయేంతవరకు నేను రోజంతా సాయిబాబా మందిరంలోనే ఉన్నాను. ఈ సమయంలో నేను కడుపు నింపుకోవటానికి చిరుతిళ్ళు తిన్నాను. అక్కడే నేను నా ఫోన్ లో మెయిల్ చూసుకున్నాను. అందులో ఒక కంపనీ నన్ను తిరస్కరించినట్టుగా చదివాను. నా స్థితి మారి పోయి వ్యాఖ్యలు చేశాను : ” యేమి చేసినా గాని అన్ని సమస్యలే అవుతుంటే మంచిగా ఉండి లాభం యేమిటి, యింకా యెవరైతే న్యాయబథ్థంగా వ్యవహరించరో, యెవరైతే యితరులనించి సహాయం పొంది, వారికి కృతజ్ణత తెలపరో, యితరుల ప్రతిభని తమ ప్రతిభగా చాటుకుని విరుథ్థంగా ప్రవర్తిస్తారో, వారికిన్నా, వివేకవంతులైన వారు, స్వచ్చంగా ఉన్నవారే యెక్కువ సమస్యలను యెదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని నేనొక వ్యక్తితో చర్చించినప్పుడు, అతను మామూలుగా “శ్రథ్థ, సబూరీ” (నమ్మకము, విశ్వాసము) కలిగివుండు అని చెప్పాడు.
నేను సచ్చరిత్ర చదవడం కొనసాగించాను, ప్రతీసారి కొంచెం ఆపి, బ్రేక్స్ కి వెళ్ళినప్పుడు ప్రతిసారి నాకు ఒక కొత్త మైల్ వస్తూండేది. ఆరోజు ఒకేసారి మూడు కంపనీలనించి యింటర్వ్యూకి రమ్మని మైల్స్ వచ్చాయి. అదొక్కటే విచిత్రం కాదు, నేను మళ్ళీ నా అప్లికేషన్ తిరిగి చదివినప్పుడు, నా ఫారం లో చాలా పెద్ద పొరపాటు చేసానని అనుకోకుండా గ్రహించాను. ఎడిటింగ్ ప్రాసెస్లో రెండు వేరు వేరు ప్రశ్నలకి ఒకే సమాథానం రాయడం జరిగింది. నాకు చాలా వణుకు వచ్చింది. నా అప్ప్లికేషన్ చదివినట్టుగా ఇంటర్వ్యూ చేసేవారు చెప్పారు, కాని యెవరూ కూడా వదలివేయడానికి వీలులేని ఈ తప్పుని గమనించలేదు. తనని నమ్మితే కనక యేదైనా సాథ్యమే అని బాబా నిరూపించారు. భగవంతుడు అందరికోసం ఇక్కడే ఉన్నారు అనె కాకుండా, తన లీలలు నమ్మశక్యం కానంతగా ఉంటాయని అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు.
మరి కొన్ని బాబా లీలలను రేపు తెలుసుకుందాము.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- యు . కే భక్తురాలి అనుభవాలు 2వ బాగం..
- షిర్డీ లో నేను(సాయి సురేష్) పొందిన అనుభవాలు 1వ భాగం
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
- ప్రతీ రోజు నాకు సాయి అనుభవాలు — రవి
- భక్తురాలి మనసులోని కోరికను సర్వాంతర్యామి అయిన బాబా తీర్చుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments