Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
ఏదయితేనేం ఎలాగయితేనేం డబ్బు వస్తోంది. ఆ డబ్బుతో శివాలయాన్ని బాగు చేయించగలననుకున్నది ధనరాజ్ భార్య. భర్త చెప్పినట్టుగానే అతనికి నగలు అమ్మి, భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమిని గుడి పూజారికి స్వాధీనం చేసింది.
‘ఈ భూమిని అమ్మి, ఆలయం మరమ్మత్తులు చేపట్టండి.’ అన్నది.‘తప్పకుండా’ అన్నాడు పూజారి.కొద్దిరోజులు గడిచాయి.
ఒకనాడు కుండపోతగా వర్షం కురవసాగింది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు. ఏళ్ళూ, ఊళ్ళూ ఒకటయిపోయాయి. వరదలా వచ్చి పడుతున్న నీటిలో మొక్కా, మోడూ, గడ్డీ, గుడిసె అన్నీ కొట్టుకుపోతున్నాయి.
ఓ గుడిసెలో దుబాకి నివసిస్తోంది. అది కూడా కొట్టుకుపోయింది. గుడిసెతో పాటు ఆమె కూడా నీటిలో కొట్టుకుపోయింది. చనిపోయింది.
పెద్ద శబ్దంతో పిడుగు పడి ధనరాజ్, అతని భార్య కూడా మరణించారు.’ చెప్పడాన్ని ఆపాను నేను. చిలుం పీల్చి, కళ్ళు మూసుకున్నాను. మత్తుగా ఉంది. నిద్ర వస్తోంది.‘బాబా’ పిలిచాడు భక్తుడు. పలకలేదు నేను.
‘బాబా’ మళ్ళీ పిలిచాడు భక్తుడు. నన్ను పట్టుకుని కుదిపాడు. కళ్ళు తెరచి చూశాను.‘తర్వాత ఏమయింది బాబా? తర్వాతేం జరిగిందో చెప్పండి బాబా, పూర్తి చెయ్యండి.’ చెబుతున్న దానిని మధ్యలో ఆపడాన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు.
ఉత్కంఠతో ఊగిపోతున్నాడు.‘దయచేసి చెప్పండి బాబా’ బతిమలాడసాగాడు. అప్పుడిలా చెప్పాను.
‘ధనరాజ్, అతని భార్య, దుబాకి పునర్జన్మించారు. ముగ్గురూ మళ్ళీ పుట్టారు. ధనరాజ్ ఓ బీద బ్రాహ్మణుడింట పుట్టాడు. అతనికి వీరభద్రప్ప అని నామకరణం చేశారు. ధనరాజ్ భార్య, ఏ ఆలయ పూజారికయితే తన భూమిని అందజేసిందో ఆ ఆలయ పూజారికే కూతురుగా జన్మించింది. ఆమెను ‘గౌరి’ అన్నారంతా.
దుబాకి ఈసారి పురుషుడిగా జన్మించింది. చెన్నబసప్ప పేరు మీద ఆమె శివాలయం ధర్మకర్త అయింది.
వారి రెండు జన్మలకూ ప్రత్యక్షసాక్షిగా నేను శివాలయాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను.
అక్కడే తిండి, అక్కడే నిద్రగా గడిచిపోతోంది. నేనంటే గుడి పూజారికి గౌరవమూ, భక్తీ ఉండేవి. తన కష్ట సుఖాలన్నీ నాకు చెప్పుకునేవాడతను. తండ్రితో పాటు గౌరి అప్పుడప్పుడూ ఆలయానికి వచ్చేది. ఆడుకునేదక్కడ. ముద్దుగా బొద్దుగా బావుండేది గౌరి. శివుడు అంటే విపరీతంగా భక్తిభావం ప్రకటించేది.
గుడిమెట్లు తుడుస్తూ, ఆలయంలోని నిర్మాల్యాన్ని ఎత్తువేస్తూ అందరి అభినందనలూ అందుకునేది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నగలు అమ్మి, వచ్చిన డబ్బుతో శివాలయం మరమ్మత్తులు చేయిస్తుందా?
- ‘మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచించు. నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’
- ‘నా ఆలయం మరమ్మత్తులు నువ్వు పూర్తి చేయించు’
- ‘దొరుకుతాడు. వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.’
- సాయి తప్పకుండా ఏదొ ఒక రూపంలో వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాను–Gopal Rao-10-Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “వారి రెండు జన్మలకూ ప్రత్యక్షసాక్షిగా నేను శివాలయాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను.”
kishore Babu
January 22, 2017 at 6:47 pmSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4