Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు సాయి బా.ని.స. బాబాతో అనుభవాలలో 10 వ అనుభవాన్ని తెలుసుకుందాము.
బాబా పై మనం విశ్వాసము, నమ్మకము ఉంచుకుంటే ఏది జరిగినా ఆయన అనుగ్రహంతోనే జరుగుతుందన్నది మనకి తెలుస్తుంది. ఇది సాయి భక్తులకి మాత్రమె అవగతమవుతుంది.
అందుచేతనే మనము శ్రీ సాయి సచ్చరిత్రని యెక్కువ శ్రధ్ధతో మనసు లగ్నం చేసి పారాయణ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నది యదార్థం.
శ్రీ సాయి సచ్చరిత్రలోని 40 వ అధ్యాయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము.
అందులో శ్రీసాయి 1917 వ సంవత్సరం హోలీ పండుగ తెల్లవారుజామున హేమాద్రిపంతుకు కలలో చక్కని దుస్తులు ధరించిన ఒక సన్యాసి రూపములో దర్శనమిచ్చి, హేమాద్రిపంత్ యింటికి మధ్యాహ్న్నము భోజనానికి వస్తానని తెలియచేశారు.
భోజన సమయానికి ముందుగా ఒక పటం రూపంలో శ్రీసాయి వచ్చి తమ మాటను నిలబెట్టుకున్నారు.
ఇటువంటి అనుభవాన్నే నాకు కూడా కలిగించి, శ్రీ సాయి తాను జీవించి ఉండగా తన భక్తులను ఏవిథంగా అనుగ్రహించారో ఇప్పటికీ అదే రీతిలో అనుగ్రహిస్తున్నారని తెలియజేసినారు.
అది 1996 వ సంవత్సరం మార్చ్ నెల. ఒక ఆదివారము నాడు వేకువ జామునే సాయి మా ఫ్యాక్టరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపంలో దర్శనమిచ్చి, మధ్యాహ్న్నము మా యింటికి భోజనానికి వస్తానని చెప్పారు.
ఈ విషయాన్ని నేను ఉదయము నా భార్యకు తెలియచేసి మధ్యాహ్ న్నం రాబోయె అతిధి కోసం కూడా వంట చేయమని చెప్పాను.
నా భార్య కూడా సాయి భక్తురాలయినప్పటికీ , మా కుటుంబంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారికి రాకపోకలు లేకపోవడం వల్ల అది సాధ్యమేనా అని సందేహించింది.
ఏది యేమయినప్పటికి తను మాత్రం వచ్చే అతిధికి కూడా వంట చేసి ఉంచింది. మధ్యాహన్నం భోజనం వేళకు నేను పిలవకుండానే యెవరయినా వస్తారని నా మనస్సుకు అనిపించింది.
మధ్యాహ్న్నము ఒంటిగంటయినా ఎవరూరాలేదు, ఇక యింత వేళ దాటి యెవరు మాత్రం వస్తారని చెప్పి, నా భార్య ఆకలితో ఉండలేక ఒంటిగంట పావుకు భోజనానికి ఉపక్రమించింది.
నేను కొంచెం అసహనంతో ఉన్నాను. సాయి తప్పకుండా ఏదొ ఒక రూపంలో వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాను. నామనస్సు సాయి మీద నమ్మకము నా భార్యకు ఉన్న అపనమ్మకానికి మధ్య ఊగిసలాడటం మొదలెట్టింది.
ఇక ఏమీ చేయలేక నా భార్య ఆదేశం ప్రకారం మధ్యాహ్న్నము రెండుగంటలకు భోజనానికి ఉపక్రమించాను. ఆ భోజన సమయంలో బాబా నామస్మరణే చేయసాగాను.
నేను భోజనము పూర్తి చేసే సమయానికి మా యింటి కాలింగ్ బెల్లు మ్రోగింది. నేను యెవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తున్న సమయంలో నా భార్య తలుపు తెరిచి నా ఆఫీసులో నా దగ్గిర పనిచేస్తున్న కార్మికుడు శ్రీ సత్తెయ్య వచ్చినారని చెప్పింది.
సాధారణంగా నా ఆఫీసునుంచి నా యింటికి నన్ను కలవడానికి యెవరూ రారు.
ఇదంతా కూడా సాయి ప్రేరణతో జరిగిందా అని మనసులో అనిపించింది. నేను నా చేతులు కడుగుకుని అతనిని నా ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుండబెట్టి “ఏమిటి సత్తెయ్యా ! ఈ వేళకాని వేళలో నా యింటికి వచ్చినావని అడిగాను.
అతను చెప్పిన మాటలు మీకిప్పుడు తెలియపరుస్తున్నాను. “సారూ, మధ్యాహ్న్నము నా డ్యూటీ పూర్తి చేసుకుని బస్సులో యింటికి వెడుతూ, మీ వీధిలోంచి వెడుతుండగా ఆకలితో ఉన్న నాకు తినడానికి మీయింట ఏదయినా దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీయింటికి వచ్చినాను.”
రాత్రి కలలో శ్రీ సాయి మా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపములో దర్శనమిచ్చి నా దగ్గిర పనిచేస్తున్న ఒక సాధారణ కార్మికుడి రూపములో నా యింట భోజనానికి రావడము నన్ను ఆశ్చర్య పరిచింది.
అప్పటికే నేను, నా భార్య భోజనము పూర్తి చేసి ఉన్నాము. మరి వచ్చిన అతిధికి ఎంగిలి భోజనము పెట్టడానికి మనస్సు అంగీకరించలేదు.
అప్పుడు నా భార్య ఉదయము తాజాగా చేసిన జంతికలను ఒక ప్లేటులో తెచ్చి శ్రీ సత్తెయ్యకు తినమని కోరినది. నా భార్య చేసిన ఈ మంచి పనికి నా హృదయము ఆనందముతో నిండిపోయినది.
ఆనాడు హేమాద్రిపంత్ యింటికి బాబా నీవు సన్యాసి రూపములో వస్తానని చెప్పి పటము రూపములో వచ్చి హేమాద్రిపంత్ ను వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించావు కదా, మరి ఈ రోజు నీవు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపములో వస్తానని చెప్పి ఒక సాధారణ కార్మికుడి రూపములో వచ్చినావు కదా ఏది యేమైనా నీ ఆశీర్వచనాలు మాకు ప్రసాదించమని వేడుకున్నాను.
అదే సమయములో మా ఆఫీసు కార్మికుడు శ్రీ సత్తెయ్య నా భార్య పెట్టినటువంటి జంతికలను కడుపారా తిని ఒక గ్లాసు మంచినీరు త్రాగి ఒక చిరు నవ్వు చిందించి వెళ్ళివస్తానని చెప్పినాడు.
శ్రీ సాయి శ్రీ సత్తెయ్య రూపములో మనింటికి వచ్చినారని నాభార్య చెప్పటము నాకు నాభార్యకు సాయిపై ఉన్న నమ్మకమును రెట్టింపు చేసింది.
రేపు తరువాయి భాగం…..
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఒక పట్టు ధోవతీని బహూకరించమని ఆదేశించారు–Gopal Rao–14–Audio
- లక్ష్మీ, ఆకలితో ఉన్న ఆకుక్కకు రొట్టె పెట్టినావు, ఆ రొట్టె నాకే చెందినది నా ఆకలి తీరినది-Gopal Rao –13–Audio
- నాకు అయిదు రూపాయలు దక్షిణ ఇవ్వగలవా–Gopal Rao–11–Audio
- నాకాలి నొప్పిని స్వీకరించి నన్ను రక్షించారని ఈ నాటికీ నమ్ముతున్నాను-Gopal Rao–16–Audio
- అన్ని మతాలలోని మహాపురుషులకు నేను నమస్కరిస్తాను– Sree Gopal Rao –18
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయి తప్పకుండా ఏదొ ఒక రూపంలో వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాను–Gopal Rao-10-Audio”
B.mallesh
September 5, 2016 at 7:48 amSainath Maharaja ki jai