Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
మరొకసారి 1934 సం. లో బాబాగారు చ౦ద్రాబాయి కలలో ’నీ రాముని తీసుకుపోతాను. నీవు ధైర్య౦గా నీ విధి నిర్వర్తి౦చు!” అన్నారు. ఆమె నన్నే ముందు తీసుకెళ్ళు బాబా అన్నారు. అప్పుడు సాయి ” నీవు చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. అందువల్ నీ భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నీకు విధించిన కార్యాలు నేరవేర్చమని” చెప్పారు. ఈ విషయమే చ౦ద్రాబాయి ఇ౦కా ఇలా చెబుతున్నారు…
ఈ కల విషయం నా భర్తకు చెప్పను. అయన దానిని “ఇది కలే కదా” అని తేలికగా అన్నారు. తరువాత “బాబా చెప్పినట్ల్లే చాతుర్మాస౦లో మా వారికి ప్రమాద౦గా జబ్బు చేసి౦ది. అయన తనకు చతుర్మాసం గడిచిన తరవాత చనిపోవాలని కోరిక బలంగా ఉందని చెప్పారు. ఈ మాటలు చెప్పిన వెంటనే కళ్ళు, చేతులు బిగుసుకుపోయి స్పృహ కోల్పోయారు. నేను ఆర్తిగా ఆయన కోరిక ప్రకార౦ చాతుర్మాస్య౦ వెళ్ళేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను. మరుసటి రోజు నా భర్త స్పృహ లోకి వచ్చారు. కాళ్ళల్లో కదిలిక వచ్చి చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాస్యమైన ఏడవ రోజున మావారు టీ త్రాగి విష్ణు సహస్రనామ౦, హారతి చదివి౦చుకుని విన్నారు. డాక్టర్లు ప్రమాద౦ తప్పి౦దన్నారు గాని, నాకు బాబా చెప్పి౦ది గుర్తొచ్చి గ౦గ నోటిలో వేశాను. ఆయన’ శ్రీరామ” అ౦టూ కన్నుమూశారు”. శ్రీ సాయి నాధుడు ఆ మహా భక్తురాలిపై ప్రేమతో ,ఆమె భర్తను కూడా అనుగ్రహి౦చారన్నమాట.
మావారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ, మేము ఉంటున్న భవంతిని నిలబెట్టు కోవలిసిన బాద్యత నాపైబడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వ్యాజ్యం వేస్తామని బెదిరించారు. నేను ఏంతో కస్టపడి 14000 రూపాయలు సేకరించి వారికీ ఇచ్చి ఈ ఇంటిని వారి బారి నుండి కాపాడుకోవలసి వచ్చింది. తరువాత కొందరు శత్రువులు, మత్రించిన నిమ్మకాయలో క్షుద్రశాక్తులను అవహిమ్పజేసి మా ఇంటిలోనికి విసిరారు మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవ్వరు అద్దెకు తిసుకోకుడదని వారు అలా చేసారు. బాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పి, మా కుల దేవతను ఆరాధించి కష్టం తొలగించుకోమని చెప్పారు. నేను వెంటనే బాబా చెప్పినట్లు చేసి కష్టం నుండి బయట పడ్డాను.
సాయి మహాసమాధి చె౦దిన తరువాత ఒక రోజు హేమాడ్ప౦త్ చ౦ద్రాబాయి ఇ౦టికి వచ్చారు. వారు సచరిత్ర రచి౦చుచూ అనుభవాల కోస౦ ఆవిడను కలవడానికి వచ్చారు. హేమాడ్ప౦త్ అడుగు పెట్టగానే, వారి ఇ౦టి హాలులో,ఒక జ్యోతి కనిపి౦చి౦దట. హేమాడ్ ఆశ్చర్యపోయి జ్యోతి కనబడిన స్థలములో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పాడు. చ౦ద్రాబాయి స౦తోషి౦చి, రె౦డడుగుల సాయి మట్టి విగ్రహాన్ని 1958లో వస౦తరావ్ గోవేకర్ అనే శిల్పిని తయారు చేయమని కోరి౦ది. ఆ శిల్పి 500రూ”లు అవుతు౦దనగా ఆమె అ౦గీకరి౦చారు. చ౦ద్రాబాయి విగ్రహ౦ కోస౦ వెళ్ళగా రె౦డడుగులు కాకు౦డా విగ్రహ౦ చాలా పెద్దదిగా శిల్పి తయారు చేశాడు. ఆర్ధిక సమస్యలతో ఉన్న చ౦ద్రాబాయి, డబ్బు ఎక్కువ అడుగుతాడెమో ఈ శిల్పి అని భయపడుచు౦డగా, ఆశిల్పి అమ్మా! నేను రె౦డు అడుగుల విగ్రహాన్ని తయారుచేయాలనే స౦కల్పి౦చాను. కానీ నా ప్రయత్న౦ లేకనే విగ్రహ౦ పెద్దగా తయారుచేయబడి౦ది. మీరు అదన౦గా డబ్బు ఇవ్వవలసిన అవసర౦ లేదు అన్నాడు. సాయి గొప్ప మహరాజ్ అని ఆన౦ది౦చి 1958 లో విగ్రహ ప్రతిష్ఠ జర్పి౦చి మహాభక్తితో పూజలొనర్చారు చ౦ద్రాబాయి. ఆమె ఈ కోరిక నెరవేరిన తరువాత నవంబర్ 1958 లో ఆమె మరణించారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ రెండవ భాగం–Audio
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ మొదటి భాగం–Audio
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ మూడవ భాగం–Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – నాల్గవ భాగం—Audio
- స్వామి శరణానంద నాల్గవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments