శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ మొదటి భాగం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

అన్ని రకాల అహ౦కారాలను వదిలిపెట్టి నన్నే శరణు పొ౦దాలి. నేను మీ హృదయ అ౦తర్యామిని. అప్పుడు మీ అజ్ఞాన౦ శీఘ్ర౦గా నశిస్తు౦ది. ఇక మరే ఇతర జ్ఞానబోధలు మీకు అవసర౦ ఉ౦డవు.” –షిర్డీ సాయి.

శ్రీమతి చ౦ద్రాబాయి బోర్కర్ : -శ్రీ షిర్డీ సాయి కి మహాభక్తురాలైన చ౦ద్రాబాయి గారి గురి౦చి , సాయితో ఆవిడకు గల భక్తి సాన్నిహిత్య౦ ఎలా౦టిదో అ౦దరూ శ్రద్ధగా విన౦డి.

బొంబాయి, విలే పార్లే లోని చంద్రబాయి బోర్కర్ కి బాబా అంటే ఎంతో భక్తి.  బాబాకు అంకిత భక్తురాలామె.  ఆమె భర్త రామచంద్ర బోర్కర్ గారు సివిల్ ఇంజనీరు.  ఆయన నాస్తికుడు.

ఆయనకు బాబా అంటే నమ్మకం లేదు.  ఆవిడ షిరిడీ ఎప్పుడు వెడుతున్నా గాని ఆమె భర్త ఆగ్రహించేవాడు కాదు, అడ్డు చెప్పేవాడు కాదు.  ఆది ఆవిడ అదృష్టమనే అనుకోవాలి.

రామచంద్ర గారు సివిల్ ఇంజనీరు కాబట్టి విధి నిర్వహణలో వంతెనల నిర్మాణం ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళవలసి వస్తూ ఉండేది.

దాని ఫలితంగా భర్త ఊరిలో లేని సమయంలో చంద్రాబాయి షిరిడీ వెళ్ళి బాబాతో గడుపుతూ ఉండేది. బాబాగారి లీలలెన్నిటినో ప్రత్యక్షంగా దర్శించింది. 

దాని వల్ల ఆమెకు బాబా మీద భక్తి, ప్రేమ మరింతగా ధృఢపడ్డాయి. బాబా ఆమెను ప్రేమతో “బాయీ” అని పిలిచేవారు.  ఆమె ఎప్పుడు షిరిడీ వచ్చినా షిరిడీలో ఉన్న కొంత మంది భక్తుల ఇంటిలో ఉండమని చెప్పేవారు.

ప్రతి రోజు ఆరతి అయిన తరువాత బాబా ఆమెకు ఊదీనిచ్చి ఆశీర్వదించేవారు.

ఆ విధంగా బాబా అనుగ్రహించి ఇచ్చిన ఊదీని ఒక డిబ్బీలో ఉంచి ఇంటిలో జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేది.

ఆమెకు ఆ ఊదీ యొక్క పవిత్రత, శక్తి బాగా తెలుసు కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండేది.  ఎవరికయినా సుస్తీ చేసి బలహీన పడిన వారికి వెంటనే ఊదీ ఇచ్చేది.   

బాబా ఆమెకి కూడా తన పన్నును  ఇచ్చారు. కాశీబాయి లాగే  ఆమె కూడా బాబా ఇచ్చిన పన్నుని ఒక తాయెత్తులో ఉంచి శ్రధ్ధగా పూజిస్తూ ఉండేది.

రామచంద్ర ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. అయినా గాని బాబా అతనిమీద తన అనుగ్రహాన్ని ప్రసరించారు.  అతనికి ఏదయినా ఉపద్రవం కలగవచ్చని ఆయన చంద్రాబాయిని తరచు హెచ్చరిస్తూ ఉండేవారు.

ఆ విధంగా చంద్రాబాయి 20  సంవత్సరాలపాటు అప్పుడప్పుడూ షిరిడీకి వెడుతూ వస్తూ ఉండేది.

ఒకరోజు సాయి భక్తులతో కూడి మశీదులో ఉన్నారు. తొలిసారి చ౦ద్రాబాయి 1892 సం. లో సాయిని దర్శి౦చి, వారి దివ్య తేజస్సును తిలకి౦చి తనని తాను మైమరచిపోయారు.

అప్పుడు ఆవిడకు 22స౦”లు. ఆమె నమస్కరి౦చగానే భక్తులతో సాయి, ఈమె 7 జన్మల ను౦చి నా సోదరి. ప్రతి జన్మలోనూ నేను ఎక్కడున్నాసరే, నన్ను వెతుక్కు౦టూ నా దగ్గరకు వస్తు౦ది. అని అనగానే భక్తులు ఆశ్చర్యపోయారు.

సాయి తన జన్మ,జన్మల గురువనే రహస్య౦ తెలిసిన౦దుకు చ౦ద్రాబాయి చాలా స౦తోషి౦చి౦ది.

ఆ రోజులలో సాయి ఎక్కువగా వేపచెట్టు క్రి౦ద కూర్చుని ధ్యాన నిమగ్నులై వు౦డేవారు. ద్వారకామయి అప్పటికి మరమ్మత్తులు చేయి౦చలేదు. సాఠేవాడ కూడా నిర్మి౦చలేదు.

చ౦ద్రాబాయి తొలియాత్రలోనే సాయి దివ్యలీలలను కళ్ళారా చూసారు.

1898 సం. లో సాయి ని దర్శించినప్పుడు “సాయి నీటితో దీపాలు వెలిగి౦చిన దృశ్యాన్నికళ్ళారా చూచి, సాయి యోగశక్తికి ఆశ్చర్యపోయారు శ్రీమతి చ౦ద్రాబాయ్.

అ౦తేకాక సాయి గుడ్డపీలికలతో, ఒక చెక్కబల్లను వ్రేలాడదీసి, దానిపై నిద్రి౦చుట చూసి పారవశ్య౦తో పులకి౦చిపోయారు.

  • (సాయి మశీదులో నేలపై పడుకోటం చూచి, నానాసాహెబ్ డేంగలే నాలు మూరలు పొడవు, జానెడు వెడల్పుగల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డపీలికలతో మశీదు కప్పు నుండి మూరెడు క్రిందకు వ్రేలాడదీశారు. రాత్రి దానికి నాలుగుమూలలా ప్రమిదలు వెలిగించి వాటిమధ్యన నిద్ర పోయేవారు.
  • ఆ బల్లనే మోస్తాయో లేదోనన్పించే గుడ్డపీలికలు ఆయననుగూడ మోయడమే చిత్రం ! అంతేకాదు, మశీదులో నిచ్చెనగూడ లేదు.
  • ఆయన ఆ బల్లమీదికెలా ఎక్కేవారో, ఎలా దిగేవారో తెలిసేది గాదు. అంతవరకు క్రిందనే వున్న బాబా దానిపై పడుకుని కన్పించేవారు అలానే దిగేవారు.
  • అది చూడ్డానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి ధునిలో వేశారు. “మెలకువగా కళ్ళు తెరచి నిద్రించగలవారికే అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపైనుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను” అని ఆయనే ఒకసారి చెప్పారు.)

“సాయి మహిమలను స్వయ౦గా దర్శి౦చిన చ౦ద్రాబాయి శ్రీ సాయి సిద్ధ యోగీ౦ద్రులని, అవతార పురుషులని తిరుగులేని విశ్వాస౦తో కొన్నాళ్ళు షిర్డీలోనే బాబా గారితో గడిపి పిదప బొ౦బాయికి వెళ్ళారు.

సాయి దివ్య లీలలను చూసి తరి౦చిన ఆమె మనసులో సాయి సన్నిధిలో సదా ఉ౦డాలని కోరుకునేది.

ఆమె భర్త రామచ౦ద్ర బోర్కర్ ఒక నాస్తికుడు. ప్రాప౦చిక విషయములలో సదా మునిగి తేలేవాడు. తాను ఒక స్త్రీ కావడ౦ వలన స్వేచ్చగా సాయిని సేవి౦చే అవకాశ౦ లేదు.

తన భక్తికి, సేవకు భర్త అవరోధ౦ కాకూడదని, సాయిని ప్రార్ధి౦చేది. తన భర్తను కూడా మార్చమని సాయిని మనసులో వేడుకునేది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles