పులికి ముక్తిని ప్రసాదించుట–Tharkad-28–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio prepared by Mr Sri Ram


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఇప్పుడు వీరేంద్ర తర్కాడ్ గారు వారి ఫ్యామిలీ కి  చెందిన మరి కొన్ని లీలలు సాయి సచ్చరిత్ర లో వచ్చిన వాటి గురించి చెప్తున్నారు. 

సాయి సచ్చరిత్రలో మరికొన్ని ఘట్టాలు

ప్రియమైన పాఠకులారా ! మరొకసారి నేను భావించేదేమిటంటే ఈ అథ్యాయంలోని సంఘటనలన్నీ ప్రత్యేకంగా సాయి సచ్చరిత్ర చదివన వారి కోసం. మిగతావారికి కూడా నిస్సందేహంగా తృప్తిగా ఆసక్తికరంగా ఉంటాయనుకోండి.

షిరిడీలో మా నాన్నగారు ఉన్నపుడు, జరిగిన సంఘటనలన్నీ సాయి సచ్చరిత్రలో వివరించబడ్డాయి.

వాటిని మా నాన్నగారు మాకు మాటి మాటికి వివరించి చెపుతూ ఉండేవారు.

వాటిని నేనిప్పుడు మీముందుంచుతున్నాను. వాటిని మానాన్నగారి ద్వారా నేను విన్నందుకు అదృష్టవంతుడినని నాకు నేను అనుకుంటున్నాను,

యెందుకంటే అవి నా హార్డ్ డిస్క్ లో భద్రపరచబడి ఉన్నాయి. యిపుడు వాటిని మీ వ్యక్తిగతం గా మీకు తెలియడం కోసం మీముందు విస్తృత పరుస్తున్నాను.

ఒకవేళ యెక్కడయినా చెప్పకుండా దాటవేసి ఉంటే నన్ను మన్నిస్తారని సవినయంగా భావిస్తున్నాను.

పులికి ముక్తిని ప్రసాదించుట

ఈ సంఘటన 1918 సంవత్సరంలో జరిగింది. మా నాన్నగారు దీనిని స్పష్టంగా తిరిగి గుర్తు చేసుకోవడానికి కారణం, బాబాగారు జీవించి ఉన్నపుడు ఆయన షిరిడీని దర్శించడం అదే ఆఖరిసారి అయింది.

ఈ సంఘటన తరువాత ఒక వారం తరువాత అనుకుంటాను బాబా మహా సమాథి చెందారు. అ రోజున యెప్పటిలాగే ద్వారకామాయిలో దర్బారు జరుగుతోంది. హటాత్తుగా ద్వారకామాయి బయట పెద్ద అలజడి అయింది.

అందరూ కూడా అక్కడేమి జరుగుతోందోనని తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారు.

నలుగురు దర్వీషులు (ఫకీర్) బలిష్టంగా ఉన్న ఒక పెద్ద పులిని గొలుసులతో బంథించి యెడ్లబండి మీద తీసుకుని వస్తున్నారు. 

వారు ఆ యెడ్లబండిని ద్వారకామాయి ప్రవేశ ద్వారం దగ్గిరకి తీసుకువచ్చి ఆపారు. దర్వీషులలో ఒకతను ద్వారకామాయిలోకి వచ్చి మాథవరావు దేశ్ పాండేతో (బాబాకు సన్నిహిత భక్తుడు) ఆ పులే తమ జీవనాథారం అని మనవి చేసుకున్నారు.

వారాపులిని ఒకచోటినించి మరొకచోటకి తిప్పుతూ ప్రదర్శనలు చేసి వచ్చిన ఆదాయాన్ని తమ జీవనానికి, పులికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

కాని, ఆ పులికి జబ్బు చేసిందని, షిరిడీ గ్రామం నుంచి వెడుతుండగా, గొప్ప సాథువయిన సాయిబాబా వారు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.

అంచేత తమకు అనుమతిస్తే వారు బాథపడుతున్న ఆ పులిని, బాబా వారి వద్దకు తీసుకొద్దామని తమ ఉద్దేశ్యం చెప్పారు.

బాబాతో మాట్లాడిన తరువాత, ఆయన పులిని ద్వారకామాయిలోకి తీసుకు రమ్మని అనుమతిచ్చారు. దర్వేషులు అన్ని జాగ్రత్తలు తీసుకుని నెమ్మదిగా నడుస్తున్న పులిని తీసుకుని వచ్చారు.

అది బాబా సాథారణంగా కూర్చుండే వేదిక మెట్లదగ్గరికి వచ్చింది. అప్పుడది బాబా వైపు చూసి తనముందరి రెండు పంజాలను ముందుకు చాపి, బాబాకి నమస్కారం చేస్తున్నట్లుగా వంగింది. 

అప్పుడది హటాత్తుగా పెద్దగా గర్జించింది. ఆ గర్జన శబ్దం చాలా గట్టిగా భయంకరంగా ఉండి ద్వారకామాయి మొత్తమంతా ఒక్క కుదుపుకి లోనయింది.

గర్జించిన తరువాత అది అచేతనంగా నేల మీదకు ఒరిగిపోయింది. ఆ నలుగురు దర్వేషీలు ముందుకు పరిగెత్తుకుని వచ్చి చూసేటప్పటికి అది చనిపోయిందని తెలిసింది.

వారు బాబాతో ఆ పులి చనిపోయిందని చెప్పి యిపుడు తామా పులి శవాన్ని ఏచేయాలని అడిగారు.

బాబా వారికి శివుని గుడి బయట నంది విగ్రహం దగ్గర పులి శవాన్ని సమాథి చేయమని సలహా యిచ్చారు. షిరిడీలోని వారందరూ పులి సమాథి కార్యక్రమాన్ని చూడటానికి గుమిగూడారు.

మా నాన్నగారు ఈ జరిగినదంతా వివరంగా ప్రత్యక్షంగా చూడటంవల్ల, బాబాకి పులికి మథ్య ఒక విథమైనది ఏదో జరిగిందని దాని తరువాతనే పులి చనిపోయిందని అనిపించింది.

మా నాన్నగారు ఆయనకి పులికి మథ్య సరిగా ఏ జరిగిందన్నది ఆయనని అడిగి తెలుసుకోవడానికి చాలా ఆతురతగా ఉండి తగిన సమయం కోసం వేచి ఉన్నారు.

బాబా చిరునవ్వునవ్వి మా నాన్నగారితో “హేయ్ భావూ ! ఆ పులి భరింపరాని వేదనతో ఉంది. తనిక ఆవేదనని భరించలేనని తనని దానినుంచి విముక్తి చేయమని అర్థించింది.

దాని దీనావస్థకి నాకు జాలి వేసింది. నేను దానికి ముక్తిని ప్రసాదించమని దేవుడిని ప్రార్థించాను. నా దేవుడు చాలా దయ కలాడు.

ఆయన నా ప్రార్థనలను స్వీకరించి దానికి ముక్తిని ప్రసాదించాడు. ఆ పులి ఈ జనన మరణ చక్రాలనుంచి స్వేచ్చ పొందింది అన్నారు బాబా. బాబా చెప్పిన ఈ వివరణకి మా నాన్నగారు నిశ్చేష్టులయ్యారు.

మా నాన్నగారు బాబాతో యింతవరకూ ఆయన మానవమాత్రుల మీదే తన అనుగ్రహపు జల్లులను కురిపించడం చూశానని కాని యిప్పుదు మొదటిసారిగా ఒక క్రూర జంతువైనటువంటి పులి మీద కూడా అనుగ్రహపు జల్లులని కురిపించడం ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.

రేపు తరువాయి భాగం  …

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles