బాబా, దీనర్థం నీవు ప్రాణుల రూపాలలో వచ్చి నీ భక్తులను పరీక్షిస్తూ ఉంటావు-Tharkad-27–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio prepared by Mr Sri Ram


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఇప్పుడు వీరేంద్ర తర్కాడ్ గారు వారి ఫ్యామిలీ కి  చెందిన మరి కొన్ని లీలలు సాయి సచ్చరిత్ర లో వచ్చిన వాటి గురించి చెప్తున్నారు. 

ఒకసారి వారు షిరిడీలో ఉన్నప్పుడు, మా నానమ్మగారు భోజనం చేసేముందు, ఒక కుక్క తోకాడించుకుంటూ వచ్చింది. మా నానమ్మగారు దానికి ఒక చపాతీ ముక్క పెట్టారు.

ఆ కుక్క సంతోషంతో తిని అక్కడినుంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపటి తరువాత అక్కడికి ఒళ్ళంతా పెంటతో నిండి ఉన్న వరాహం ఒకటి అక్కడికి వచ్చింది.

సాథారణంగా అటువంటి అసహ్యకరమైన ప్రాణిని చూసినప్పుడు యెవరికి గొంతులోఉన్న ముద్దని కిందకు దించుకోలేరు. కాని మా నాన్నమ్మగారు చాలా దయ కలవారు.

దేవుడంటే భయం కలది. ఆవిడ ఆ అసహ్యకరమైన వరాహానికి కూడా చపాతీ ముక్కని పెట్టారు. ఆ వరాహం చపాతీ ముక్కను తిని వెళ్ళిపోయింది.

తరువాత ఆ రోజున వారు ద్వారకామాయికి వెళ్ళి బాబాకి దగ్గరగా వెళ్ళారు.

బాబా ఆమెతో “అమ్మా ! ఈ రోజు నువ్వు నీ చేతులతో దివ్యమైన విందు భోజనం పెట్టావు. నాకింకా త్రేనుపులు వస్తున్నాయి” అన్నారు.

అది విని మా నాన్నమ్మగారు ఆశ్చర్యపోయారు. ఆమె బాబాతో “బాబా మీరు పొరబడ్డారు. షిరిడీలో నేను మీకెప్పుడూ భోజనం పెట్టలేదు. నేనిక్కడ వంట కూడా వండలేదు.

నిజానికి నేనిక్కడ, సగుణ నడిపే హోటలులో డబ్బు చెల్లించి భోజనం చేస్తాను. “ అన్నారు.  అప్పుడు బాబా “అమ్మా ! ఈ రోజు మధ్యాన్నం నువ్వు భోజనం చేసే ముందు ఒక కుక్కకి ఆ తరువాత వచ్చిన అసహ్యకరమైన వరాహానికి తిండి పెట్టలేదూ? ఆ ఆహారం నాకు చేరింది” అన్నారు.

అప్పుడు మా నాన్నమ్మగారు “బాబా, దీనర్థం నీవు ప్రాణుల రూపాలలో వచ్చి నీ భక్తులను పరీక్షిస్తూ ఉంటావు” అన్నారు.

బాబా ఆమెతో అన్నారు “అమ్మా ! దయ చేసి ఈ ప్రాణుల మీద అలాగే దయ చూపుతూ ఉండు, భగవంతుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. భగంతుడు నీ యింటిలో ఆహారానికి కొరత లేకుండా చూస్తాడు”

తార్ఖడ్ కుటుంబం యితర సాయి భక్తులతో యెక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. వారిలో శ్రీ ధబోల్కర్, శ్రీ పురందరే, శ్రీ తెండుల్కర్. వీరంతా బాంద్రాలో వీరింటికి దగ్గరి దూరంలోనే ఉంటారు.

వారు ఒకరికొకరు కలుసుకుంటూ బాబాతో తమకు కలిగిన అనుభవాలని చెప్పుకుంటూ ఉండేవారు.

యెప్పుడయినా వారు షిరిడీ వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే దానిని ఆ భక్తుని తరపున చేరవేస్తూ ఉండేవారు.

దీని వెనకనున్న వారి ఉద్దేశ్యం బాబామీద తమకున్న స్వచ్చమైన భక్తిని, ప్రేమను తెలిపేటందుకే. ఒకసారి పురందరేగారు తమ కుటుంబంతో సహా షిరిడీ వెడుతున్నపుడు మా నానమ్మగారు, పురందరే భార్యకు రెండు పెద్ద నల్లవంకాయల నిచ్చి ఒక కాయతో పెరుగు పచ్చడి, రెండవ దానితో వంకాయ ముక్కల వేపుడు చేసి బాబా గారికి భోజనంలో వడ్డించమని చెప్పింది.

మొదటి రోజున పురందరే భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి, మిగతా పదార్థాలతో పాటు బాబా భోజన పళ్ళెంలో వడ్డించింది.

బాబా వంకాయ పెరుగు పచ్చడి భుజించి వంకాయ వేపుడు కావాలనే కోర్కెను తెలియచేశారు. షిరిడీలోని (స్థానికంగా ఉండే భక్తురాలు) రాధాకృష్ణమాయి, ఈమె బాబాగారికి భోజన యేర్పాటులన్ని చూస్తూ ఉండేది.

ఆమెకేమీ తోచలేదు. ఆమె అక్కడ ఉన్న ఆడ వారినందరినీ అడిగి పురందరుని గారి భార్య వంకాయ పచ్చడిని తెచ్చిందని తెలుసుకుంది.

యేమయినప్పటికీ అది వంకాయల కాలం కాదు కనక షిరిడిలో వంకాయలు దొరకడం కష్టం. అంచేత రాథాకృష్ణమాయి వంకాయలు యెక్కడ దొరుకుతాయో కనుక్కొవడానికి పురందరే భార్య వద్దకి పరిగెత్తుకుని వెళ్ళింది. అప్పుడామె తన దగ్గిర ఒకటుందనీ, దానిని మరునాడు బాబాకి వంకాయ వేపుడు చేసి పెట్టడానికని ఉద్దేశించినట్లు చెప్పింది.

అపుడు రాథాకృష్ణమాయి ఆ వంకాయను తీసుకొని వెళ్ళి, తొందరగా బాబాకి వేపుడు చేసి పెట్టాకే బాబా వాటిని స్వీకరించి భోజనం ముగించి లేచారు.

యిప్పుడిది బాబా తన భక్తులపై స్వచ్చమైన ప్రేమను తెలియచేసే సంఘటన యింకా యేమిటంటే అతన్నినించి/ఆమెనించి వారి భక్తిని స్వీకరించారన్నదానికి నిర్థారణ.

పురందరే భార్య బాంద్రాకు తిరిగి వచ్చిన తరువాత ఈ సంఘటన గురించి మా నాన్నమ్మకి చెప్పినపుడు, ఆవిడ యెంతో సంతోషించి, తన హృదయాంతరాళలో నించి బాబా వారికి థన్యవాదాలు తెలుపుకున్నారు.

యిదే విథంగా ఒక సాయంత్రం గోవిందజీ (బాలక్ రాం కుమారుడు) తార్ఖడ్ గారి యింటికి వచ్చి తాను, ఆరాత్రికి షిరిడీ బయలుదేరి వెడుతున్నానని చెప్పాడు.

తాను, స్వర్గీయుడైన తన తండ్రి అస్థికలను నాసిక్ లో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాననీ, అక్కడినించి షిరిడీ వెడతాననీ చెప్పాడు.

అతను చాలా తొందరలో ఉన్నందు వల్ల మా నానమ్మ గారికి బాబాకు పంపించడానికి సరైనదేదీ దొరకలేదు.

చందనపు మందిరంలో బాబా చిత్రపటం ముందు వుంచబడిన ప్రసాదం కుండలో ఉన్న ఒక “కోవా” దొరికింది. ఆవిడ అతనితో తనకు లోపల యిష్టం లేకపోయినప్పటికీ దానినే యిస్తున్నాననీ కారణం యింతకుముందే దానిని బాబాకు ప్రసాదంగా పెట్టాననీ చెప్పారు.

అంతే కాకుండా గోవిందజీ, అస్థికలను నిమజ్జనం చేసే కార్యక్రమానికి తోడు, షిరిడీకి కూడా యాత్రను పెట్టుకున్నారు.

భక్త శబరి రాముల వారికి తాను రుచి చూసిన రేగి పళ్ళను సమర్పించి భక్తి భావాన్ని చాటుకున్నట్లుగా, తన భక్తి భావం ముందు యిటువంటి న్యాయ సమ్మతం కానటువంటి ఆలోచనలన్నిటినీ పక్కకు నెట్టేశారు.

గోవిందజీ తన మిగతా కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకుని ద్వారకామాయిని చేరుకున్నపుడు అతను కోవా గురించి మర్చిపోయాడు.

బాబా అతనిని తనకోసం యేమయినా తెచ్చావా అని అడిగారు. గోవిందజీ తేలేదని చెప్పాడు అప్పుడు బాబా తనకిమ్మనమని ఒకరు యేదో యిచ్చారని అతనికి గుర్తు చేశారు.

గోవిందజీ శిలలా మొహం పెట్టి మరలా లేదని చెప్పాడు. బాబా ఇపుడు కోపంతో అరుస్తూ అన్నారు. “ఏయ్ ! నువ్వు బొంబాయినుండి బయలుదేరేటప్పుడు మా అమ్మ నాకుయిమ్మని ఏదో ఇచ్చింది కదా, ఏది అది?” గోవిందజీకి యిప్పటికి తెలిసింది.

అతను తనున్న చోటకి పరిగెత్తుకుని వెళ్ళి కోవా తెచ్చి బాబాకిచ్చాడు. బాబా వెంటనే దానిని తిని గోవిందజీతో అది చాలా మథురంగా ఉందని అమ్మకి చెప్పమని అన్నారు.

ప్రియమైన సాయి భక్త పాఠకులారా, దైవాంశసంభూతమైన ప్రేమానురాగ దృష్టాంతాలు స్వర్గీయ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు సాయి సచ్చరిత్ర 9 వ అథ్యాయంలో యెంతో మనోజ్ఞంగా వర్ణించారు.

మా నాన్నగారు వాటిని మాకు వివరించి చెబుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళనుండి కన్నీరు కారుతూ ఉండేది. ఆ విథంగా భగవంతుడినించి తిరిగి పొందినపుడు అలా స్పందించకుండా యే భక్తుడూ ఉండడని నాకనిపిస్తుంది.

నేను ఒకదానికి బాథపడుతున్నాను. “యెక్కడికి వెళ్ళారు ఆ ప్రజలంతా (వారందరికీ నమస్కారాలు) ఆ భక్తులంతా యెక్కడ ఉన్నారు? అటువంటి భక్తి ఈ రోజు యెక్కడ ఉంది?” కాని బాబా ప్రేమ తనభక్తుల మీద యెల్లపుడూ వ్యాపించి ఉంటుంది.

రేపు తరువాయి భాగం  …

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles