Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!
This Audio prepared by Mr Sreenivas Murthy
- Mir-14 ఆత్మారాముని భార్య పంపినవాటిని బాబా ప్రేమగా స్వీకరించుట 3:47
అత్మారాముని భార్యవిషయ మాలోచింతుము. ఆమె మూడు వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను.
1. వంకాయ పెరుగు పచ్చడి,
2. వంకాయ వేపుడుకూర,
3. పేడా. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము.
బాంద్రా నివాసియగు రఘువీరభాస్కరపురందరే బాబాకు మిక్కిలి భక్తుడు.
ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను.
ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి యొక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను.
షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసికొని వెళ్ళెను.
బాబాకాపచ్చడి చాల రుచిగా నుండెను. కాన దాని నందరికి పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెననెను.
ఈ సంగతి రాధాకృష్ణమాయికి తేలియపరచిరి. అది వంకాయల కాలము కాదు గనుక యామెకేమియు తోచకుండెను. వంకాయ లెట్లు సంపాదించుట యనునది ఆమెకు సమస్యయాయెను.
వంకాయపచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురందరుని భార్యయని తెలియుటచే వంకాయవేపుడు గూడ ఆమెయే చేసిపెట్టవలెనని నిశ్చయించిరి.
ఆప్పుడందరికి బాబా కోరిన వంకాయవేపుడుకు గల ప్రాముఖ్యము తెలిపినది. బాబా సర్వజ్ఞుడని యందరాశ్చర్యపడిరి.
1915 డిసెంబరులో గోవింద బలరామ్ మంకడ్ యనువాడు షిరిడీ పోయి తనతండ్రికి ఉత్తరక్రియలు చేయవలె ననుకొనెను.
ప్రయాణమునకు పూర్వము ఆత్మారామునివద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబాకొరకేమైన పంపవలె ననుకొనెను.
ఇల్లంతయు వెదకెను. కాని యొక్క పేడా తప్ప యేమియు గన్పించలేదు.
ఈ పేడా యప్పటికే బాబాకు నైవేద్యము పెట్టియుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై యుండెను.
కాని ఆమె బాబాయందున్న భక్తిప్రేమలచే యాపేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను.
గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడా తీసికొనివెళ్ళుట మరచెను. బాబా ఊరకుండెను.
సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినపుడు కూడ పేడా తీసికొని పోవుట మరచెను. అప్పుడు బాబా యోపికపట్టక తనకొర కేమి తెచ్చినావని యడిగెను.
ఏమియు తీసికొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, “నీవు యింటివద్ద బయలుదేరునప్పుడు అత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?” యని యడిగెను.
కుర్రవాడదియంతయు జ్ఞప్తికిదెచ్చుకొని సిగ్గుపడెను.
బాబాను క్షమాపణ కోరెను. బసకు పరుగెత్తి పేడాను దెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగెను.
ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యెక్క భక్తిని బాబా మెచ్చుకొనెను”. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను”. అను గీతావక్యము (౪-౧౧ 4-11) నిరూపించెను.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా శక్తిమంతుడైన, నా భార్య వెంటనే ప్రసవించాలి, హైదరాబాద్–Audio
- ఒక డాక్టర్ గారి భార్య శరీరం లో ఉన్న భూతం వదిలించిన బాబా వారు
- బాబా, దీనర్థం నీవు ప్రాణుల రూపాలలో వచ్చి నీ భక్తులను పరీక్షిస్తూ ఉంటావు-Tharkad-27–Audio
- గోఖలేగారి భార్య ఉపవాసము
- ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments