గోఖలేగారి భార్య ఉపవాసము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

బాబా యెన్నడు ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థ మెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగ జేయు ఆహారము గాని, పౌష్టికశక్తి గాని లేనప్పుడు భగవంతుడి నేకండ్లతో చూడగలము? వేయేల మన యవయవము లన్నియు వాని శక్తిని అవి సంపాదించుకొన్నప్పుడు, అవి మంచిస్థితిలో నున్నప్పుడే, మనము భక్తిమొదలగు సాధనముల నాచరించి దేవుని చేర గలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనముగాని మంచిది గాదు. ఆహారములో మితి, శరీరమునకు మనస్సునకు కూడ మంచిది.

గోఖలే గారి భార్య, కానిట్ కర్ గారి భార్యవద్దనుంచి దాదా కేల్కరుకు జాబు తీసికొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదములవద్దమూడురోజులుపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. అంతకు ముందురోజు బాబా దాదా కేల్కరుతో తన భక్తులను హోళిపండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారుపవసించినచో బాబా (తన) యొక్క ఉపయోగ మేమనెను. ఆ మరుసటిదినము ఆ స్త్రీ కేల్కరుతో పోయి బాబావద్ద కూర్చుండగా బాబా వెంటనే యామెతో “ఉపవాసము చేయవలసిన యవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు బెట్టి నీవు కూడ తినుము.” అనెను. హోళీ పండుగ వచ్చెను. కేల్కరుభార్య బయట చేరెను. దాదాభట్టు ఇంట్లో వండుట కెవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలేగారి భార్య దాదాభట్టు ఇంటికి బోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే యుండెను. ఇతరులకు బెట్టెను, తాను తినెను. ఎంత మంచికథ! ఎంతచక్కని నీతి!

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles