ఔరంగాబాదుకర్ భార్య



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

షోలాపూరు నివాసియగు సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేకదేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతికొడుకగు విశ్వనాథుతో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవచేయుచు రెండు నెలలు గడపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టు భక్తమండలి మూగియుండువారు. బాబా నొంటరిగా జూచి, వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి, తన కొక సంతానము కావలెనని కోరుకొనుటకై తగిన యవకాశమునకై కనిపెట్టుకొని యుండెను. తుట్టతుదకు శ్యామా కీసంగతి చెప్పి, బాబా యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగజేసికొనుమనెను. శ్యామా, బాబా దర్బా రెల్లప్పుడు తెరచియుండుననియు, ఐనను ఆమెగూర్చి ప్రయత్నించెదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగ చేయగనే మసీదుపైకి రావలెననియు చెప్పెను. ఒకనాడు మధ్యాహ్నభోజనానంతరము శ్యామా బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను. శ్యామా కోపగించి “దేవా! నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు మాకక్కరలేదు. మేము నీపై నాధారపడియున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్యఫలితము?” అనెను. బాబా యిట్లనెను. “శ్యామా! 72జన్మలనుంచి నీవు నాతో నున్నప్పటికి నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్ళకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది.” శ్యామా యిట్లనియెను. మీనుండి మాకు గౌరవముగాని, స్వర్గము గాని, విమానము గాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మా కెపుడును నుండుగాక.” బాబా యిట్లనెను. “అవును, నేను వచ్చినది యందుకే ఇన్నాళ్ళనుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీయందు నాకు ప్రేమానురాగము లున్నవి.”

అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపయి కూర్చొనెను. శ్యామా యామెను సైగ చేసి రమ్మనెను. అమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి, కొబ్బరికాయ, అగరువత్తు లిచ్చెను. బాబా ఆ టెంకాయనాడించెను. అది యెండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చు చుండెను.

బాబా:- శ్యామా! యిది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, అది యేమనుచున్నదో విను.
శ్యామా:- ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది. కాన, టెంకాయను నీ యాశీర్వాదముతో నిమ్ము.
బాబా:- టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు?
శ్యామా:- నీ మాటల మహిమయు, ఆశీర్వాదప్రభావమును నాకు దెలియును. నీ యాశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు, ఆశీర్వాదమును ఇవ్వకున్నావు.

ఆ సంవాదము కొంతసేవు జరిగెను. బాబా పదేపదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామా టెంకాయను కొట్టకుండ నా స్త్రీకే ఇవ్వుమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ‘ఆమెకు సంతానము కలుగు’ ననెను. ఎప్పుడని శ్యామా యడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగులగొట్టిరి, ఒక చిన్న చిప్పను ఇరువురు తినిరి రెండవచిప్ప నామె కిచ్చిరి.

అప్పుడు శ్యామా యా స్త్రీ వైపు తిరిగి “అమ్మా! నీవు నామాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో, ఈ దేవుని తలపై నొక టెంకాయను గొట్టి ఈ మసీదునుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో, నేను మాధవుడ గాను, మీరు దీనిని జూచెదరుగాక” యనెను.

ఆమె ఒక సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుఱ్ఱము ‘శ్యామకర్ణ’కు ఈ ధనముతో శాల కట్టించెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles