Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-76-1107-దైవమే కష్టాలను ప్రసాదించుట 2:56
సాయి నార్కే అను భక్తునికి చెప్పిని ఆత్మ బోధ :
సుఖసంపదలను అనుభవించుచు , నీవు ప్రకటించు శాంతి కంటే కష్టములు యందు నీవు చూపు ఓర్పు , శాంతి, నన్ను సంతోషపరుచును.
ఎంతటి కష్టములు వచ్చినా, వాటిని దైర్యముగా ఎదుర్కునుటకు సిద్ద పడాలి . కష్ట నష్టములు, ప్రతి ఘటనలు లేనప్పుడు ప్రతి మనిషి మహా శూరుడుగా ప్రవర్తించును .
ఇతరలకు గొప్ప గొప్ప ఉపదేశాలను చేయగలడు.
తన మాటలచే ఇతరలను ప్రోత్సహించగలడు.
కానీ ఆ సంకటములు తనకు ప్రాప్తించితే, ఆ ఉపదేశాలను తన ఆచరణ యందు ఉంచుకోనలేడు.
స్వల్పములగు కష్టనస్టంలలో కూడా మనష్యుడు ఎంత చీకాకు పడునో గమనించి తనకు మేలు చేయడానికే, దైవం ఆ కష్టంలను ప్రసాదించినట్లు గ్రహించలేడు.
నీకు కలగు కష్ట నష్టములను సావధాన మనస్సుతో ఎదుర్కోనవలయను. ఎంతెంత కష్టములు కలుగునో, అంతంత అణుకువ, గర్వం లేకుండా ఉండడం అభ్యసించాలి. వానికి లొంగరాదు .
అభ్యాస , వైరాగ్యములచేత, నా కరుణ వలన నీకు ఆ కష్టములు సైతం భాధ పెట్టవు.నన్ను పూర్ణ విశ్వాసంతో నమ్మి ఓర్పు కలిగి నా సహాయముకోరితేన, నీకు తోడ్పడి నిన్ను ఉద్దరించుటకు నేను ఎల్లవేళలా సిద్దముగా ఉంటాను.
శాంతి, సమతలతో ఇంతకంటే అధికమైన కష్టమును ఎదుర్కొ. తరుచగా నీవు కష్ట నష్టముల పాలగుచున్నట్లు తోచుచున్నను, నీవు భయపడవద్దు.
నా భక్తుడైన నిన్ను కాపాడటమే నా విధి. ప్రాపంచికంగా నీవు ఓటమి పొందినా, నీకు నష్టమేమి లేదు.
ఆ ఓటమి నన్ను (సాయి బాబా ని ) పొందటానికే దారితీయను.
ఎదుటవారి కటినమయిన మాటలకు నీవు శాంతి కోల్పోరాదు. సంతోషములతో కష్టములను ఎదుర్కునే శక్తి లేకపోతే, ఓర్పుతో సహించు. అంతేగాని ప్రతిగటించవద్దుని సాయి తెలిపారు.
సాయి తెలిపిన ఈ భోదను ఒక్కసారి చదివితే నిరాశ, నిరుత్సహములతో ఉన్నవారు, వారి భాధలను మరిచి సాయినాధుని నూతన ఉత్సాహముతో అత్యంత భక్తీ శ్రద్ద లతో, విశ్వాసము, ఓరిమితో పూజింతురు. ప్రేమతో సేవింతురు.
సాయి సేవకురాలు: నాగోలు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అనంతరావు పాటంకర్
- పులికి ముక్తిని ప్రసాదించుట–Tharkad-28–Audio
- బాబా అంటే ఎవరో తెలియని కుటుంబానికి, పనిమనిషి ద్వారా తెలియచేసి కష్టాలను తీర్చిన సాయినాథుడు.
- శ్రీషిరిడీ సాయి వైభవమ్ బాబా, విశ్ కాంతగారికి జీవితాన్ని ప్రసాదించుట రెండవ అనుభవం
- తప్పు ! ….. సాయి@366 ఫిబ్రవరి 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “దైవమే కష్టాలను ప్రసాదించుట–Audio”
Sreenivas Murthy
March 14, 2016 at 11:53 amచాల సంతోషముగా ఉంది సాయి. కష్టములు కూడా బాబా ప్రసాదముగా భవించ్చి ఓర్పు , శాంతి లతో ఉంటాను సాయి.