Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాధ గారి అనుభవములు మొదటి భాగం
నా పేరు రాధ, మేము ఇప్పుడు బెంగుళూరు లో ఉంటున్నాము. నాకు మొదట బాబా అంటే ఎవరో ఏమిటో అసలు తెలియదు.
నాకు బాబా పరిచయం చాలా చిత్రంగా జరిగింది. అది ఎలా అంటే నాకు పెళ్ళయిన తరువాత నేను అత్తగారింటికి వచ్చాక, నన్ను పుట్టింటికి కొన్నాళ్ళ పాటు పంపించలేదు.
ఒకరోజు ఉన్నట్టుండి మా మామగారు మావారిని నన్ను పిల్లల్ని హైదరాబాద్ పంపించారు. మా అమ్మా నాన్నా హైదరాబాద్ లో ఉండేవారు.
నన్ను గుమ్మం లో చూసి అమ్మ నాన్న ఇద్దరు షాక్ అయ్యారు. అదెలా అంటే మా అమ్మ వాళ్ళింట్లో ఒక అమ్మాయి పని చేస్తుంది.
ఒక రోజు ఆమె మా అమ్మ ని అడిగిందట. “అమ్మా! మీకు ఇద్దరు అమ్మాయిలు అంటావు. నీ రెండో కూతురే ఎప్పుడు వస్తూంటుంది. నీ పెద్ద కూతురు ఎప్పుడూ రాదేంటమ్మా అని అంది.
ఇలా ఆమె అడగటంలో ఆశ్చర్యం లేదు, ఆమె మా ఇంట్లో కొంతకాలంగా పని చేస్తుంది. మా అమ్మా ఎం చెప్పమంటావు. చిన్నప్పటినుండి తెలిసిన సంబంధమే, మా వియ్యంకుడు, వియ్యపురాలు కొంచెం కక్కుర్తి మనుషులు.
మా పిల్లను మా ఇంటికి పంపడం మానేసారు. ఒకటి రెండు సార్లు అయ్యగారు వెళ్ళారు. చిత్రహింసలు పాలు చేస్తున్నారే, దానికి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచాము. ఎన్ని అవస్థలు పడుతుందో అది అంటూ ఆమె ముందు కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఆమ్మ.
బాధపడకండమ్మా, నా కూతురికి సాయిబాబా ఒంటి మీదకు వస్తారు. మీరు రేపు గురువారం నాడు, మీరూ సారూ మా ఇంటికి వచ్చి మీ అమ్మాయి గురించి అడగండి. మా చుట్టుప్రక్కల అందరూ వచ్చి అడుగుతుంటారు.
అందరికి నా కూతురు సమాధానం చెపుతుంది. అందరికీ అన్నీ జరుగుతుంటాయి అని చెపుతుంటారు. మీరు కూడా ఒక సారి వచ్చి నా కూతురిని ప్రశ్న అడగండి అంది ఆమె.
ఎవరికైనా ఇలా చెపితే ఆశే కదా! మా నాన్న ఇంటికి వచ్చాక ఆమ్మ ఇలా సంగతంతా నాన్నకి చెప్పింది. ఇద్దరం వెళ్లి అడుగుదాం, ఇందులో పోయేది ఏముంది. జరిగితే జరుగుతుంది. లేకపోతె లేదు అనుకుంటూ గురువారం కోసం ఎదురు చూశారట.
అనుకున్న గురువారం రానే వచ్చింది. ఆమ్మ నాన్న ఇద్దరు పని ఆమె గుడిసెకు వెళ్ళారు. ఆమె కూతురికి పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి. మా నాన్న ఆ పాపకి నా కష్టాలు అన్నీ వివరించి చెప్పారట.
ఆ అమ్మాయి ఏం బాధ పడవద్దు. ఇంక ఏ కష్టాలు ఉండవు, త్వరలో అన్నీ తీరబోతున్నాయి అని చెప్పిందట.
అప్పుడు మా నాన్న – మా అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో? మేము దాన్ని చూసి చాలా కాలం అయింది అన్నారట. మీ అమ్మాయి రాబోయే సంక్రాంతి కి మీ ఇంటికి రాబోతుంది అని చెప్పిందట.
మా ఆమ్మ నాన్న ఆశ్చర్య పోయారట. ఇన్ని రోజులుగా ఎన్ని సార్లు రమ్మని పిలిచాము, బ్రతిమిలాడాము పంపించమని, నీకు ఏమి కావాలంటే అది ఇస్తాము, పిల్లని ఒక్కసారి అయినా పంపమన్నాము. అయినా పంపలేదు.
అటువంటిది ఇప్పుడు ఎవరూ రమ్మనకుండా ఎలా వస్తుంది? అనుకున్నారట. నన్ను చూసేటప్పటికి ఆశ్చర్యం, ఆనందాలు కలిగాయి.
అప్పుడు నాతో బాబా చెప్పింది చాలా వాస్తవం. నువ్వు చూడు ఎలా వచ్చావో, మాకు తెలియదు కదా నువ్వు వస్తావు అని. అసలు ఎలా వచ్చావు. నీకెవరు చెప్పారు. అసలు ఏమైంది అంటూ ఆమ్మ నాన్న ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అసలు బాబా ఎవరు? ఆ పని అమ్మాయి చెప్పటం ఏమిటి? అటువంటివి నమ్మకండి,
చదువుకున్నవాళ్లు అయ్యుండి ఇలాంటివి నమ్ముతారా? డబ్బులేమయినా ఇచ్చారా? డబ్బులు దండుకోవడానికి ఇలాంటి ట్రిక్స్(Tricks) చేస్తుంటారు అని నేను వాళ్ళని కోపడ్డాను.
ఏమయిందో తెలియదుగానీ ఉన్నట్టుండి మా మామగారు మీరు హైదరాబాద్ వెళ్ళి చాలా రోజులు అయింది కదా! ఒకసారి వెళ్ళిరండి అంటూ టికెట్స్ కొనిచ్చారు. అంతే బయలుదేరి వచ్చాము అని అన్నాము.
నేను, మా వారు, పిల్లలు (ట్విన్స్ ఆడపిల్లలు) నాలుగు రోజులు ఉన్నాము. ఆమ్మ నాన్న ఆనందానికి అవధులు లేవు.
నేను ఉన్న నాలుగు రోజులు కూడా ఆ బాబా దయ వలన మీరు వచ్చారు అంటూనే వున్నారిద్దరూ. పైగా నువ్వు ఒక సారి వెళ్ళి ఆ అమ్మాయిని కలువు అన్నారు.
“మిమ్మల్ని నమ్మవద్దు అంటుంటే నన్ను వెళ్ళమంటారేంటి” అన్నాను. ఇంతలో గురువారం వచ్చింది. నన్ను బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు.
నాన్న ఇదిగో బాబా మా అమ్మాయి. మీరు చెప్పినట్లుగానే నా ఇంటికి వచ్చింది. మీకు చూపిద్దామని తీసుకువచ్చాను అని చెప్పారు.
ఆ అమ్మాయి నన్ను చూసి చాలా గంభీరంగా ఒక చిన్న పిల్ల గొంతులాగా కాదు, చాలా పెద్ద వాళ్ళ గొంతు,
పైగా మగ గొంతుతో ఇంక నీకు కష్టాలు ఉండవు. అన్నీ తీరిపోతాయి. నేను నీకంటే ముందు గానే నీ ఇంటికి వెళ్తాను. ఇది బాబా వాక్కు అంది.
ఈ అమ్మాయి చూస్తే చిన్న పిల్ల. బాబా ఎవరో? బాబా ఆట! ఆయన ఎక్కడుంటాడో ఏమిటో? పైగా నాకంటే ముందుగానే ఇంటికి చేరుకుంటారా!
నా ఇల్లు ఈ పక్కనే ఉందా ఎక్కడో గుజరాత్ లో నేనుండేది. అక్కడికి ఈయనసలు ఎలా వెళతారు? వెళ్ళటానికి నా ఇల్లు ఆయనకేలా తెలుసు? అంతా పిచ్చి కాకపోతే అనుకున్నాను.
నాలుగు రోజులు సంతోషంగా గడిపి తిరిగి వెళ్ళిపోయాము. నేను వెళ్లేసరికి మా మామగారు – అమ్మాయి నీకో లెటర్ వచ్చింది. అని అన్నారు.
నాకు ఉత్తరాలు రాసేవారు ఎవరూ లేరు. ఉన్నవాళ్లు, కన్నవాళ్ళు, వాళ్ళ దగ్గరనుండి ఇప్పుడే వస్తున్నాను అనుకుంటూ ఉండగానే ఆయన ఒక గ్రీటింగ్ కార్డు తీసుకుని వచ్చి నాకిచ్చారు.
పైన అడ్రెస్స్ చూసాను. ఏమి రాసిలేదు. లోపల చూసాను. సాయిబాబా బొమ్మతో ఉన్న ఒక గ్రీటింగ్ కార్డు ఉంది. నాకు మతి పోయింది.
నీకంటే ముందుగానే నేను వెళతాను అంటూ ఆ అమ్మాయి ద్వారా బాబా ఇలా పలికాడు. అంటే ఆ అమ్మాయిలో నిజంగానే బాబాయే అంటే దేవుడే అలా మాట్లాడాడా? నాకు కళ్ళంట నీళ్లు వస్తున్నాయి.
ఇంకా నేనా షాక్ నుండి కోలుకోకుండానే, మా మామగారు మరో షాక్ ఇచ్చారు – అమ్మాయి రాధా, సాయంత్రం మనం అంతా బయలుదేరి షిరిడీకి వెడుతున్నాము అన్నారు.
ఏమిటీ వింత? ఎవరీ బాబా? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నారు? నేనేం చేశాను ఆయనకీ? అని నా మనసు అతలాకుతలం అయిపోతుంది.
షిరిడి బయలుదేరాం. ఆయన దర్శనం చేసుకున్నాం. అక్కడి నుండి బాబా విగ్రహం కొనుక్కుని తెచ్చుకున్నాం.
అప్పటి నుండి నేను ఇంకా బాబాను పూజించడం మొదలు పెట్టాను.
అంతకుముందు మా పెళ్ళి అయిన కొత్తలో మా మామగారు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబు, అందువలన ఆయనకి LTC ఇచ్చేవారు.
ఆ పరంపర లో అందరం కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు తిరగటం చేసేవాళ్ళం. నాకు కొత్తగా పెళ్ళి అయినందు వల్ల నాకు LTC వర్తించదు.
నన్ను సొంత ఖర్చులతో వాళ్లతో పాటు తీసుకెళ్ళారు. ఆ సమయంలోనే అన్ని తిరుగుతూ షిరిడికి కూడా వెళ్ళాము.
అప్పుడే నేను బాబాని తొలిసారి చూడటం. ఆయన పేరు వినటము.
ఆ టూర్ లో మా మామగారు తన మొదటి జీతంతో కొన్న కెమెరా ను నా హ్యాండు బాగ్ లో పెట్టారు. ఆ విషయం నాకు తెలియదు. అది కాస్త పోయింది.
ఎలా పోయిందో నాకు తెలియదు. కానీ, నన్ను నానా మాటలు అని కావాలని పారేసావంటూ పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చి ఇన్నాళ్లూగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను.
ఈ రోజు కోడలివి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఒక వస్తువు ఉంచుకోవాల్సింది పోయి ఇంత అజాగ్రత్తగా పడేస్తావా? అంటూ నన్ను మాటలు అన్నారు.
అన్ని ఊర్లు తిరిగిన సంతోషమంతా ఆయన రగడతో నాకు ఆవిరయిపోయింది.
ఇంత మంది దేవుళ్ళని పూజించి కొలిచి వస్తే, ఈ దేవుళ్లందరూ నాకింతటా దుఃఖాన్ని బహుమతిగా ఇస్తారా? అంటూ దేవుళ్ళందిరి పైన కూడా ధ్వజమెత్తాను. అందరి దేవుళ్లను తిట్టిపోసాను.
నేను అప్పటికి ఆంజనేయ స్వామిని బాగా కొలుస్తుండేదాన్ని. ఆయనకి మరో రెండు అక్షింతలు ఎక్కువ వేసాను. దేవుడి మీద అలిగి కొన్ని రోజులు పూజ చేయడం మానుకున్నాను.
మేము మా ఇంటికి వచ్చాక నేను నెల తప్పాను. అమ్మాయి పుట్టింది. నేను తిట్టిన దేవుళ్ళ లిస్ట్ లో సాయి బాబా కూడా ఉన్నారు.
ఆ తరువాత మా అమ్మాయి టెన్త్ క్లాస్ కి వచ్చాక మా మామగారు ఇది బాగా చదవాలి మంచి మార్కులు రావాలి. దీని వాలకం చూస్తే ఇది చదవక తప్పేలా ఉంది.
సరిగ్గా చదువుతున్నావా లేదా? మా వంశం లో ఇప్పటివరకు ఎవరూ టెన్త్ క్లాసు తప్పినవాళ్ళు లేరు. ఇది ఏమి చేస్తుందో ఏమిటో అంటూ నన్ను, దాన్ని (మా అమ్మాయిని) బాగా టెన్షన్ పెట్టేవారు.
పిల్ల భయపడకుండా ఉండటం కోసం పరీక్షలకి నేను కూడా వెళ్ళేదాన్ని.
ఒకరోజు దారిలో బాబా గుడి కనపడింది. నేను వెంటనే లోపలి వెళ్లి బాబా నీ షిరిడి నుండి వచ్చాకే నాకు సంతానం కలిగింది. అది తెలుసుకోకుండా మూర్ఖత్వంగా నిన్ను కూడా బాగా తిట్టాను.
అది నీ వర ప్రసాదమే. నువ్వు కరుణిస్తేనే మాకు అమ్మాయి పుట్టింది. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా దాన్ని పరీక్షలో బాగా రాసేటట్టు గా ఆశీర్వదించు బాబా అని దండం పెట్టుకున్నాను.
ఆ తరువాత కొన్ని రోజులకు అది మంచి మార్కులతో పాస్ అయింది.
The above miracle has been typed by:Shiva Kumar Bandaru,
రాధ గారి అనుభవములు రెండవ భాగం తరువాయి….
Latest Miracles:
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- సచ్చరిత్ర చదవడంతో గురువు అంటే ఎవరో, దైవం అంటే ఎవరో తెలిసింది
- ఆకలిగా ఉన్న బిడ్డ ఆకలిని తీర్చిన బాబా వారు ……!
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
- బాబా అంటే ఎవరో తెలియకుండా తనని ద్వేషించుకున్న మాకు తాను ఎవరో తన మహిమ, ప్రేమ, దయ ఎలాంటిదో చూపించి మా గమ్యాన్ని మార్చిన బాబా గారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments