ఆకలిగా ఉన్న బిడ్డ ఆకలిని తీర్చిన బాబా వారు ……!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


2004వ సంవత్సరంలో మా వారికి సడన్ గా గుండెపోటు వచ్చింది, కామినేని ఆసుపత్రిలో చేర్పించాము. కానీ ఫలితం లేకపోయింది. మమ్మల్ని అందరిని వదిలివెళ్ళిపోయారు. నాకేమి పాలుపోలేదు.

పిల్లలు చిన్న పిల్లలు, మా పెద్ద అమ్మాయి అగ్రికల్చర్ Bsc, తర్వాత అబ్బాయి ఇంటర్, తర్వాత అమ్మాయి పదవ తరగతి, తర్వాత అబ్బాయి ఆరవ తరగతి చదువుతున్నారు.

పిల్లలు ఎదిగిరాలేదు, చదువులు కూడా పూర్తి అవ్వలేదు. ఇంతలో ఇంట్లో సంపాదించే మనిషి హఠాత్ మరణం. నాకు ఏమి తోచలేదు.

ఇల్లు ఎలా గడపాలో, పిల్లల్ని ఎలా చదివించాలో, నాకేమి అర్ధం కాలేదు.

సహజంగా ఉద్యోగంలో ఉన్న భర్త చనిపోతే భార్యకి ఉద్యోగం ఇస్తారు, కానీ నేను ఆయనకు రెండవ భార్యను కాబట్టి నాకు ఉద్యోగ అర్హత లేదు, బాబుకి ఇద్దాం అంటే వాడి చదువు ఇంకా పూర్తి కాలేదు.

అమ్మాయికి ఇద్దామా అంటే పెళ్ళిచేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయే పిల్ల, చివరికి మా అబ్బాయికి ఇంటర్ పూర్తయితే ఇస్తామన్నారు.

అది పూర్తి కావాలంటే సమయం పడుతుంది, ఈ లోపు మా పరిస్థితి ఏంటి? మాకు ఆఫీస్ నుండి అందవలసిన డబ్బు కూడా తొందరగా రాలేదు.

ఇంచుమించు 18 నెలల పాటు నరకం అనుభవించాం. తినటానికి ఇంట్లో ఏమి ఉండేది కాదు. మా నుండి సాయం పొందిన వారు కూడా మాకేసి తొంగిచూడలేదు.

పిల్లల్ని చూసుకుంటూ నేను ఒంటరి జీవితం ఎలా గడపాలో నాకు అర్ధంకాలేదు.

నేను ఏనాడూ బయటికి వచ్చి ఎవరిని ఏది అడగలేదు. ”బాబా” గుడికి మాత్రం వెళ్లడం మానలేదు.

బాబా గుడిలో పెట్టే ప్రసాదం తీసుకువచ్చి పిల్లలకి పెట్టి, నేను మంచినీళ్లు తాగి పడుకునే దాన్ని.

పిల్లలు నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు, ”నేను గుడిలోనే తినేసాను, ఇది మీ కోసమే తెచ్చానని” చెప్పేదాన్ని.

మా పెద్ద అమ్మాయి దాని కాలేజికి దాదాపు 40 km రాజేంద్ర నగర్ వెళ్ళాలి.

రెండు బస్సులు మారాలి, ఉదయమే ఒకరోజు ఏమి తినకుండా (ఏమైనా ఉంటే కదా తినడానికి) కాలేజికి బయలుదేరింది.

కోఠీ బస్సు స్టాండ్లో నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడి పోయింది. ఒక పక్క తండ్రి పోయిన బాధ, మరో పక్క కడుపులో ఏమి లేని బాధ,

ఇంతలో ఒక ముసలాయన దగ్గరగా వచ్చి నీళ్లు చల్లి లేపి, ”ఎమ్మా ఏంటి అలా పడిపోయావు” అని అడిగాడట.

”అబ్బే ఏం లేదండీ, ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఆ టెన్షన్ లో రాత్రి ఎక్కువ సేపు చదివాను” అని నసిగిందట.

”లేమ్మా, లేచి నాతో రా” అన్నాడట ఆయన. ”ఎక్కడికి అందిట,” ”టిఫిన్ తిందువు గాని రామ్మా” అన్నారట ఆయన.

”ఎందుకు సర్! నేను ఇంటి దగ్గర తిని వచ్చాను” అందిట ఇది. ”నాకు తెలుసమ్మా నువ్వు తిన్నావో, తినలేదో, మాట్లాడకుండా రామ్మ” అని పక్కనే హోటల్ లో కడుపునిండా టిఫిన్ పెట్టించాడట.

ఆ పెట్టించింది బాబా కాక ఇంకెవరు. మేము తిన్నామో తినలేదో ఆయనకీ కాక ఇంకెవ్వరికి తెలుస్తుంది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles