అడగకుండానే నా అవసరాన్ని తీర్చిన బాబా వారు ……….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు రామయ్య. నేను కుటుంబంతో నాగోల్‌ లో వుంటాము (హైదరాబాద్‌). నేనొక బ్యాంకు లో పనిచేసి రిటైర్‌ అయ్యాను.

1954-55 సంవత్సరాలలోనే మా నాన్నగారయిన సుబ్రహ్మణ్యం గారికి ఒకాయన ద్వారకామాయి లో “బాబా బండ మీద కూర్చున్న ఫోటో ఒకటి తెచ్చిచ్చి, “నువ్వు దీనిని ఇంట్లో పెట్టుకో. నీకుచాలా బావుంటుంది” అని చెప్పారు.

ప్రతి గురువారం మా నాన్నగారు ఆ ఫోటోని ఒక చెక్క పీట మీద వుంచి.దానికి విడిగా దీపారాధన చేసి, అష్టోత్తరం పూజ చేసి, రాత్రికి బాబా కోసం ఏదో ఒక స్వీటు తెచ్చి నైవేద్యంపెట్టటం అలవాటు చేసుకున్నారు.

ఉపాధ్యాయ వృత్తిలో వున్న న్నాన్నగారికి చదవటం, వ్రాయటం ఇష్టంగావుండేది. అప్పట్లో ఇప్పుడు దొరికినట్లుగా బాబా గురించి పుస్తకాలు కానీ సమాచారం కాని ఏవీ ప్రత్యేకంగావుండేవి కావు.

మద్రాసులో ‘సాయి సమాజ్‌ అని ఉండేది. అక్కడ నుండి మెటీరియల్‌ తెప్పించుకొని చదువుకుంటూవుండేవారు.

శిరిడీకి 2 రూపాయలు దక్షిణ మనీయార్దర్‌ చేస్తే అక్కడనుండి ప్రతిగా బాబా ‘ఊదీ” ప్రసాదంపంపించేవారు. ఆ ఊదీ ఒక డబ్బాలో భద్రంగా వుంచి తరచూ వాడుకుంటూ వుండేవారు.

1971 సంవత్సరం నుండి 1982 సంవత్సరం వరకు నేను హైదరాబాద్‌ నారాయణగూడ లో వుండేవాడ్ని మధ్యలో ఒక ఏడాది మాత్రం నల్గొండలో పనిచేసాను.

నా కుటుంబం ఇక్కడే వుండేది. నేను మాత్రం రోజూ నల్గొండ వెళ్ళి వస్తూండేవాడిని. అప్పటికే నాకిద్దరు మగపిల్లలున్నారు.

నా భార్య రత్నమాల మూడవసారి గర్భవతిగా వుంది. ఆ సమయంలో మా తమ్ముడి పెళ్ళి విజయనగరంలో ఫిబ్రవరిలో జరగనుంది.

అప్పటికే మా ఆవిడ 7-8 వ నెలల గర్భిణిగా వుంది. పిల్లలు మగపిల్లలు కాబట్టి అల్లరి బాగా చేసేవారు.

మట్టిలో బాగా ఆడేసి చేతుల నిండా పుండ్లు తెచ్చుకున్నారు. పిల్లల్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము .

 ఆ డాక్టర్ మాకు ముందు నుందే బాగా తెలుసు, ఆయన పిల్లలని టెస్ట్‌ చేసి ఏవో మందులు వ్రాసిచ్చారు.

మా ఆవిడను చూసి ఎన్నోనెల అని అడిగారు. 7వ నెల అని చెబితే, కాదు, పొరపాటుగా లెక్కపెట్టినట్టున్నారు. నీకు 8వ నెల,మరొకసారి చూపించుకోమ్మా అన్నారు.

మా తమ్ముడి పెళ్ళి ఉంది, ఈవిడ చూస్తే ఇలా ఉంది అంత దూరం ప్రయాణం చేయచ్చు అంటారా డాక్టర్‌ గారు అని అడిగితే ఆయన వద్దన్నారు.

పిల్లలు ఉంటె మా ఆవిడని ఇబ్బంది పెడతారని వాళ్ళను తీసుకుని నేను పెళ్ళికి బయలుదేరుతూ, మా ఆవిడ మేనత్త గారు మా ఇంటికి దగ్గరలోనే వుంటారు, ఆవిడకి మా ఆవిడని అప్పజెప్పి నేను పిల్లలను తీసుకొని విజయనగరం బయలుదేరాను,

సామర్లకోట తుని మధ్యలో ఎందుకో బ్యాగ్‌ కోసం చూసాను. ఇంకెక్కడి బ్యాగ్‌, ఎవడో కొట్టేసాడు. ఆ బ్యాగ్‌ లో పిల్లలవి, నావి కొన్ని బట్టలు, పెళ్ళికూతురికి పెట్టటం కోసం రెండు పట్టు చీరలు, రెండు మామూలు చీరలుఉన్నాయి

మిక్సీ పాడైందని అమ్మ అంటే దాని పార్ట్స్‌ కూడా ఆ బ్యాగ్‌ లో ఉన్నాయి, నా జేబులో 30 రూపాయలు,టిక్కెట్లు మాత్రమే వున్నాయి.

నాకు ప్రమోషన్‌ రావల్సివుంది లిస్టు వచ్చింది. అందులో నాకు బదులుగా నా జూనియర్‌ కి ప్రమోషన్‌ ఇచ్చారు. ఆయన బదిలీ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు నేను స్టేషన్‌ కి వెళ్ళాను.

ఆయన్ని రైలు ఎక్కించి తిరిగివచ్చేటప్పుడు నాకు వణుకు రావటం మొదలైంది. ఇంటికి వచ్చాక జ్వరం వచ్చేసింది.

మా ఆవిడ భోజనానికి రమ్మంటే నేను అన్నం తినను, నాకు జ్వరంగా వుందని చెప్పి దుప్పటి కప్పుకుని పడుకున్నాను.

మధ్యరాత్రి బాత్రూమ్‌ కి వెళ్ళి వచ్చి రేపొద్దున అన్నయ్యకి టెలిగ్రాం ఇవ్వాలి. నాకసలు బాగా లేదు, మా ఆవిడకు కాన్సు అయ్యే సమయం. అమ్మని పంపమని చెప్పాలి అని అనుకొని “ఊదీ” నుదిటన పెట్టుకొని పడుకున్నాను.

నాకు జ్వర తీవ్రత వలన నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారుతూండగా కొంచెం సేపు నిద్రపట్టింది. తెల్లారాక నేను ఇద్దామనుకున్న టెలిగ్రాం మా అన్నయ్యకి, జ్వర తీవ్రత  వల్ల ఇవ్వనే లేదు. అసలు నేను బయటకి కూడా వెళ్ళలేదు.

తరువాతి ఉదయం ఆ బీరువా మీద మా నాన్నగారు ఏనాడో ఇచ్చిన “శ్రీ సాయి సత్‌ చరిత్ర గురించి గుర్తుకొచ్చింది.

మా నాన్న గారు “రోజూ ఒక అధ్యాయం అయినా చదువు, కుదరని పక్షం లో రోజూ ఒక పేరా అయినా చదవు అని” చెప్పి ఆయన పుస్తకం ఇచ్చారు.

ఆనాటి నుండి ఈనాటి వరకూ ఆ పుస్తకం నేను చదివింది లేదు ఆ బీరువా పైన పెట్టుంచాను.

మా నాన్నగారు మరో సంగతి కూడా నాకు చెప్పారు. శిరిడీకి  2 రూపాయలు పంపితే వాళ్ళు ‘ఊదీ’ ప్రసాదం పంపిస్తారు. నెలకి 2 రూపాయలు పంపుమని చెప్పారు.

ఒకటీ రెండు సార్లు పంపాను. అక్కడ నుండి ఊదీ వచ్చింది. అది పదిలపరుచుకున్నాను. పోస్ట్‌ ఆఫీసు దూరము. ప్రత్యేకించి వెళ్ళి కట్టి రావాలి. అందుకు బద్దకించి తరచు కట్టలేక పోయేవాడిని.

మధ్యాన్నం కొంచం చారన్నంతిన్నాను. జ్వరం’ లో అన్నం తిని మధ్యాన్నం పూట నిద్ర పోకూడదు అందుకని పడుకోకుండా, మా నాన్నగారు నా చేతికిచ్చిన “శ్రీ సాయి సత్బరిత్ర మా ఆవిడను పిలిచి ఆ బీరువా పైన పుస్తకం ఉంది తీసుకురమ్మనమని తన చేతే చదివించుకున్నాను.

మర్నాడు కూడా ద్వితీయ విఘ్నం ఎందుకని మరల చదివించుకొని విన్నాను.

ఆ రోజు సాయంత్రం  తలుపుకొట్టిన చప్పుడు అయింది, ఎవరు వచ్చారా అని మా ఆవిడ చూసింది, ఎదురుగుండా మా అమ్మ తమ్ముడు ,ఉన్నారట.

మా అన్నయ్య విజయనగరంలో ఒక కంపెనీలో పని చేస్తాడు. ఆయన తెల్లవారుజామున 4 గంటలకి డ్యూటీ మారుతాడు.

ఆ సమయంలో ఇంటికి వెళ్ళకుండా  అక్కడే పడుకొని  బాగా తెల్లారాక ఇంటికి వెళుతుంటాడు. అలా పడుకున్న సమయంలో ఆయన కలలో ఎవరో మీ తమ్ముడు కష్టంలో వున్నాడు. బట్టలు కూడా పోగొట్టుకొని దిగులుగా వున్నాడు. నువ్వు మీ అమ్మని సాయంపoపు అన్నారట.

అంతే, అన్నయ్య ఇంటికి వెళ్ళి అమ్మని, తమ్ముడిని ఇద్దరినీ ఆదరాబాదరా గా రెండు జతల బట్టలు సంచిలో పెట్టి, రైలు సమయం అయిపోతుందని హడావిడి పెట్టి వాళ్ళని రైలు ఎక్కించాడట. నాకీ విషయం తర్వాత కలసినపుడు మా అన్నయ్య చెప్పాడు.

నేను టెలిగ్రామ్‌ ఇవ్వాలి అనుకున్నానే కాని ఇవ్వలేదు.ఎలా వీళ్ళు వచ్చారు, ఎలా తెలిసింది అన్నది అప్పటి ప్రశ్న , అన్నయ్య పంపించాడంతే అనుకున్నాం.

నెలలు నిండినా కూడా మా ఆవిడ “సచ్చరిత్ర పారాయణం పూర్తి చేసాకే హాస్పిటల్ చేరింది కాన్పు కోసం. బాబు పుట్టాడు.

ముందు ఆపరేషన్‌ చేయాలన్నారు, కానీ అదేదీ లేకుండానే కానుపు అయ్యింది. ఇదంతా జరిగిన తర్వాత నాకు ప్రమోషన్‌ వచ్చింది.

ముందు రావలసిన ప్రమోషన్‌ ఇది. ఆ తారీఖునుండే ఇచ్చి నన్ను అనంతపురం బదిలీ చేసారు. ఇది ‘శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ వల్ల జరిగిన అద్భుత లీల.

“బాబాకి తెలియనిది ఏమైనా ఉంటుందా, నాగురించి తెలుసు నా బాధ గురుంచి తెలుసు. నేనుపోగట్టుకున్న బ్యాగ్‌ గురించి, అందులో ఏ వస్తువులు పోయాయో, సూది దగ్గరనుంచి పెద్ద వస్తువుల వరకూ ఆయనకు తెలుసు, అలాగే తన వాళ్ళను ఎలా కాపాడాలో తెలుసు. ఏది ఎప్పుడు చేస్తే బాగుంటుందో తెలుసు.”

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles