Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నేను అనంతపురం వెళ్ళడానికి మా వాళ్ళెవరూ ఒప్పుకోలేదు. (కుటుంబ సభ్యులు) ట్రాన్స్ఫర్ తప్పించడానికి రికమండేషన్స్ ఏవో ప్రయత్నాలు అయ్యాయి కానీ తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది.
అనంతపురం లో 6 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ వున్న ఆ 6 సంవత్సరాలు నా జీవితంలో స్వర్ణయుగం అని చెప్పాలి.
బాబాతత్వం లోకి బాగా వెళ్ళటం అక్కడే మొదలయ్యింది. భజనలు, గుడిలో బాబావారి సేవలు, సంఘంలో గౌరవం, కొంత ఆధ్యాత్మికత నేను తెలుసుకున్నాను.
అక్కడ “వేంకటేశ్వర స్వామిభక్త సమాజం ఒకటుంది. వాళ్ళు అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టి భజన కార్యక్రమాలు చేస్తుంటారు.
అన్ని దేవుళ్ళ పాటలు పాడుతుంటారు. అక్కడ నేను కూడా చేరి, మెల్లగా అక్కడ వున్న ఫొటోస్ తో పాటు “బాబా” వారి ఫోటో అక్కడ పెట్టించి “బాబా పాటలు కూడా భజన లొ చేర్పించాను, అక్కడ చాలా బావుండేది.
నేను అనంతపురం వెళ్ళాక ఇంట్లో సామాన్లు సర్దుకున్నాక, ఫ్యాన్లు, లైట్లు బిగించడానికి ఒక కరెంట్ తెలిసిన వాళ్ళు కావాలని బ్యాంక్ లో ఒక అతనుతో అంటే,
మన బ్యాంకులోనే డైలీ వేజస్ గా పనిచేసే ఒక అతను ఉన్నాడు అతనికి కరెంట్ పని కూడా తెలుసు బాగా చేస్తాడు అని చెప్పాడు.
సరే అతన్ని పంపమని చెప్పాను. అతను ఒక ఆదివారం నాడు వచ్చి పని పూర్తిచేసి కాసేపు పిల్లలతో ఆడుకుని వెళ్ళిపోయాడు.
తర్వాత వారం మళ్ళీ వచ్చాడు. ఈ సారి పిల్లలకి చాక్లెట్స్ తెచ్చిచ్చి, వాళ్ళతో కాసేపు ఆడుకుని వెళ్ళిపోయాడు. 3వ ఆదివారం కూడా చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు. అతని పేరు నాగేంద్ర.
ఏమిటి ‘నాగేంద్ర’ ఎందుకు ప్రతి వారం పిల్లలకి చాక్లేట్లు తెస్తున్నావు అని అడిగాను .
పాపం అతను భోరున ఏడ్చేశాడు . పొరపాటుగా ఏదైనా అన్నానా అని భయం వేసింది నాకు.
రోజువారీ జీతంలో పనిచేసే వాళ్ళకి తక్కువ డబ్బులిస్తారు. ఆ కొంచెం ఇలా చాక్లెట్స్ కోసం ఖర్చుపెడితే ఎలాగా? అని అడిగాను.
అతను కళ్ళు తుడుచుకోని, “నాకు పిల్లలంటే ఇష్టం సార్ నాకు పిల్లలు లేరు, నాకు పెళ్లి అయి 4 సంవత్సరాలు అయింది,
మా ఆవిడకి రెండు సార్లు గర్భస్రావం కూడా అయ్యింది సార్” అంటూ భోరున ఏడ్చాడు.
అప్పుడు ‘నేను ఊరుకో నాగేంద్ర’ అని అతన్ని ఓదార్చి, “నువ్వు దేవుణ్ణి నమ్ముతావా” అని అడిగాను. అతను ‘ఆ నమ్ముతాను’ సార్, అన్నాడు.
“సాయిబాబా తెలుసా” అన్నాను. ‘ఆ తెలుసు సార్ అన్నాడు. “ఈ సారి ఆదివారం నువ్వు వచ్చేటప్పుడు మంచిగా స్నానం చేసుకుని రా అన్నాను.
మళ్ళీ వారం కాగానే నాగేంద్ర స్నానం చేసుకొని వచ్చాడు. నేను ఊదీ చేతిలోకి తీసుకొని బాబా పాదాలకి తాకించి “బాబా ఈ నాగేంద్ర కి సంతానం లేదు. చాలా బాధ పడుతున్నాడు. అతనికి సంతానాన్నిచ్చి అతని వేదన పోగొట్టు” అని
అతనికి “ఊదీ పొట్లం కట్టి ఇచ్చి రోజూ స్నానం చేసాక ఉదయం, సాయంత్రం ఆవిడని ఊదీ ని నుదుటిన పెట్టుకోమని చెప్పాను.
అతను ఇంటికి “ఊదీ” పొట్లం తీసుకు వెళ్లి తన భార్యకిచ్చి నేను చెప్పిందల్లా వివరించి చెప్పాడట.
ఆ అమ్మాయి నేను చెప్పినట్లుగానే రోజూ ఉదయాన్నే స్నానం చేసి “ఊదీ” ని నుదుటిన పెట్టుకుంటూ వుంది, 3, 4 నెలలకే ఆ అమ్మాయి గర్భం దాల్చింది.
వరుసగా నలుగురు పిల్లలు పుట్టారు నాగేంద్రకి. ముగ్గురు ఆడపిల్లలు, చివరగా మగపిల్లవాడు పుట్టారు.
ఆ పిల్లలకి “సాయి” పేరు కలుపుతూ పేర్లు పెట్టాడు నాగేంద్ర. “బాబా తనవారు అనుకున్న వాళ్ళని తన మార్గంలోకి లాగటానికి కొన్ని మహత్యాలు చూపిస్తాడు”. .
నాకు అనంతపురం నుండి ఆదోని బదిలీ అయ్యింది. నేను వెళ్ళలేదు. మరోచోటికి వేసారు.
నేను అనంతపురం నుండి వచ్చేసే ముందు ఒక ముస్లిం కొలీగ్ నన్నింటికి పిలిచారు. నేను, నాభార్య ఎక్కడుంటే అక్కడివారంతా మమ్మల్ని బాగా అభిమానంగా చూస్తారు.
మేమూ అంతే. మా చుట్టూ ఉన్నవాళ్ళే మా చుట్టాలు, అందరం ఒక కుటుంబంలాగ కలిసి ఉంటాం.
ఆ కొలీగ్ మాకొక బాబా ఫోటో (పాతది) గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ఫోటో 1988 నుండి ఇప్పటివరకూ నాతోనే వుంది.
మేము మొదటిసారిగా ‘శిరిడీ 1987 వ సంవత్సరంలో వెళ్ళాము. అప్పటిదాకా మేము శిరిడి వెళ్ళలేదు, అప్పుడు మేము, మాతో పాటు మా బావమరుదులు అంతా కలిసి వెళ్ళాము.
ఎకామిడేషన్ దొరకలేదు. లాకర్ కూడా దొరకలేదు. ‘సాఠెవాడా” వరండాలో సామాన్లు పెట్టుకుని ఒకళ్ళు కాపలా వుంటే మిగితా వాళ్ళు దర్శనానికి, భోజనానికి వెళ్తూ వచ్చాము.
రాత్రి కూడా అక్కడే 50 పైసలకి పరుపులు అద్దెకి తెచ్చుకుని పడుకున్నాము.
ఇప్పుడు ‘సాఠెవాడా’ అన్నది నామమాత్రం గానే వున్నది. అక్కడ ఇప్పుడు కూర్చోడానికి కూడా వీలులేదు.
ఆ స్థలంలో దుమ్ము, దుమ్ముగా ఉంటె, ఒక బట్టతో క్లీన్ చేసుకొని చక్కగా అందరం పడుకున్నాము.
ఆ సమయంలో ‘బాబా’వారికి లోపల వాయిద్యాలతో ఏదో చేస్తున్నారు. అది వినగానే నా ఒళ్ళు పులకరించి పోయింది.
నేను వెళ్లి కిటికీలోంచి బాబాగారిని చూసాను. అదే నాకు “బాబాగారి ప్రథమ దర్శనం. ఆయన్ని చూడగానే నా ఒళ్ళు రోమాంచితమయ్యింది.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!
- నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు
- సాయి దివ్య పూజ మహత్యం
- బాబా నైవేద్యంలో ఊదీ మహిమ.
- బాబాని పరిచయం చేసిన శ్రీ షిరిడీ సాయి మహత్యం ……!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments