బాబాని పరిచయం చేసిన శ్రీ షిరిడీ సాయి మహత్యం ……!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు శ్రీకాంత్. మేము వరంగల్ లో ఉంటాము. మాకా ఊళ్ళో కళ్ళజోడు షాప్ ఉంది.

మా చిన్నప్పటి నుండి మా అమ్మ గారు వేంకటేశ్వరస్వామి పూజ చేసేవారు. తరచూ తిరుపతి వెళ్ళి వస్తుండేవాళ్ళము.

నా చిన్నప్పుడు బాబా గుడి దగ్గర ఖాళీ స్థలం ఉంటే అక్కడ క్రికెట్ ఆడేవారము. గుడికి మాత్రము ఏనాడూ వెళ్ళలేదు.

1999 సంవత్సరంలో శ్రీ శిరిడీ సాయి బాబా మహత్యం సినిమా చూసాను.

ఆ సినిమా చూస్తున్న అంత  సేపూ నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆ సినిమా చూసి మరునాడు బాబా గుడికి వెళ్ళాను.

ఆ రోజు నుండి ప్రతి రోజు బాబా గుడికి వెడుతూనే ఉన్నాను.  అలా బాబా మా జీవితాలలోకి ప్రవేశించారు.

మేము ఒకసారి షిరిడీ వెళ్లి బాబాను దర్శనం చేసుకున్నాం, బాబా దర్శనం అయ్యాక శిరిడీ లోనే ఉన్న మరో మహానుభావుడు శ్రీ శివనేశన్ బాబాని చూడడానికి వెళ్ళాము.

ఆయన ఆశ్రమం పింపుల్ వాడి రోడ్ దాటి, ఇంకా పైకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడు, మాకు అక్కడి నుండి రావటానికి ఏ వాహనం దొరకలేదు.

రాత్రి అయిపోయింది, ఇంక ఇటువైపు ఏమి వాహనాలు రావు. ఎలా వెళ్ళాలో అన్నాడు, ఒకాయన.

”ఇప్పుడు కనుక మేము ఉన్న దగ్గరికి ఆటో రాకపోతే రేపు నీ దర్శనానికి రాను బాబా” అని అనుకున్నాను.

ఈ సమయంలో ఇంత ఊరు చివరికి ఏ ఆటోలు రావు అంటున్నారు. నాతో వచ్చిన వాళ్ళు , ”మనం ఉన్నది ఎక్కడ, ఆ దేవ దేవుని దగ్గర బాబా తప్పకుండా మనకి ఏదో ఒక వాహనం పంపిస్తారు, అది కూడా 5 నిమిషాలలో వచ్చేస్తుంది” అన్నాను.

అంతే! 2 నిమిషాలలో ఒక జీపు వచ్చి మా ముందు ఆగింది. ”ఎక్కడికి వెళ్ళాలి” అన్నాడు లోపలి వ్యక్తి, మేము ”గుడికి” వెళ్ళాలి అన్నాము.

”ఎక్కండి” అన్నాడు. మేము ”ఎంత” అన్నాము. ” ఫ్రీ” అన్నాడు. అంతే ! అందరం జీపు ఎక్కాము. వాళ్ళు శని శింగణాపూర్ నుండి వస్తున్నట్లు చెప్పారు.

మమ్మల్ని తీసుకువచ్చి గుడి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. మేము శేజ్ హారతికి లోపలికి వెళ్ళాము.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles