Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
షిరిడీలో సాయి మండుతున్న ధునిలో చేయి పెట్టి పసి బిడ్డను కాపాడాడు.
నెల్లూరు జిల్లాలో తలుపూరు చిన్న పల్లెటూరు. అనావృష్టి వల్ల పచ్చని గడ్డి మొలవటం లేదు.
అవధూత గొలగలమూడి వెంకయ్య స్వామి వారు భక్తులతో ఆ గ్రామం పోతుంటే, పులిస్తరాకులు మేస్తున్న పశువుల మీద దృష్టి పడింది.
సేవకులను పిలిచి, ఆ ఊర్లో ఉన్న ఎండిపోయిన చెరువులోనికి వెళ్ళారు. అక్కడ అగ్ని గుండం వేయాలని చెప్పారు. కొద్ది క్షణాలలో అగ్ని గుండం ఏర్పరచారు.
స్వామి ఆ గుండన్ని తదేకంగా చూసారు. తరువాత స్వామి సేవకులతో గ్రామంలోనికి వెళ్ళారు. తెల్లవారే సరికి కుంభవృష్టి.
చెరువులు అన్నీ నీటితో నిండయి. వర్షం వెలియగానే ఆ ఊరి వారు స్వామి వద్దకు కృతజ్ఞతలు తెలపటానికి వెళ్ళారు.
ఆయన అదేమి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. స్వామి ఎక్కడ గుండం వేసినా ఆ ప్రాంతం సుభిక్షమవుతుంది.
గొలగమూడి వెంకయ్య స్వామి సాయిబాబాను అన్నగారనే వారు.
”అయ్యా! ఉత్తరాన (షిరిడీలో) మన అన్నగారు ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడూ గుండం (అగ్నిహోత్రం) లేదా ధుని వేసేవారు” అని సాయి బాబాను గూర్చి ప్రేమపూర్వకంగా చెప్పేవారు.
గొలగమూడి వెంకయ్య స్వామి ఆగస్టు 24, 1982న మహాసమాధి చెందారు. ఆయన మహాసమాధి చెందినా, సాయిబాబా వలె నిత్య సత్యుడు.
ఆ ఇద్దరి మహనీయుల భావం ఒక్కటే. భాషలు వేరుగా ఉంటాయి. ”అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడు అని వ్రాసుకో” అన్నారు వెంకయ్య స్వామి.
సాయిబాబా ”పురుగులు, చీమలు, కనిపించుచున్న చరాచర జీవకోటి అంతయు నా శరీరమే” అన్నారు.
”అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూచుకోండి” అన్నారు వెంకయ్య స్వామి.
”వాడాలో అనేకమంది దొంగలున్నారు. తలుపులు గడియలు వేసి జాగ్రత్తగా ఉండుము. దొంగలంతయు తీసికొని పోయెదరు” అంటారు సాయి.
”బ్రేవ్ మని త్రేపే వాడికి కాదయ్యా, కొంగుపట్టే వారికి అన్నం పెట్టయ్యా” అనేవారు వెంకయ్య స్వామి.
”దాహముగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి అన్నము, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును” అన్నారు సాయి.
నేడు ఆగస్టు 24. గొలగమూడి వెంకయ్య స్వామి వారిని స్మరించి వారి బోధలను ఆచరించెదము గాక!
ఓం నారాయణ ఆది నారాయణ!!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రద్ధ….. సాయి@366 మార్చి 8….Audio
- పామరులకు మరింత చేరువలో …. మహనీయులు – 2020… మార్చి 12
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
- దారం…. …. మహనీయులు – 2020… ఆగస్టు 24
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments