Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా సందర్భానుసారంగా బోధలు చేసేవారు గాని, ప్రత్యేకించి గేయాలను, గీతాలను వ్రాయలేదు.
ధేనువకొండ వెంకయ్య గారికి జన్మత సంగీత సాహిత్యాలు అభిమాన కళలు. సంగీత సాహిత్యాలే కాక ఆయనకు వన్నె తెచ్చినది యోగ విద్య.
ఆయనకు సన్యసింపవలెనని కోరిక ఏర్పడ్డది. కుర్తాళంలోని మౌన స్వామిని ఆశ్రయింపమని సలహా ఇచ్చారు కొందరు. ఆయనకు మంత్రము సన్యాస దీక్ష నిచ్చారు మౌన స్వామి.
కుర్తాళం పీఠాధిపత్యం కూడా వహించవలసి ఉంటుందన్నారు. గురువు అనుజ్ఞతో కాశీ విశ్వనాథ, అన్నపూర్ణలను సేవించి తాడిపత్రి గ్రామం చేరారు.
ఆయన చూపిన మహిమాలలో ఒకటి లక్షమ్మ అను మహిళకు పతి భిక్ష పెట్టటం. ఆ గృహిణి కొంత భూమిని ఆశ్రమానికి రిజిస్టరు చేసింది.
సిద్దప్ప సబ్ రిజిష్టారు. అధికార దర్పంతో ఉండేవాడు. అందరూ ఆయనకు నమస్కరించవలెనని అహంకారంతో ఉండేవాడు. వెంకయ్యగారు ఆయనకు నమస్కరించలేదు.
“స్వామి అయినా, మీరు నమస్కరించవలసినదే” అన్నాడు సిద్దప్ప. “నేను మీకు నమస్కారం చేస్తాను చూడండి” అని అక్కడే ఉన్న బండ రాయికి నమస్కరించారు స్వామి.
ఆ రాయి రెండు ముక్కలైంది. తనకు నమస్కరించ నవసరము లేదని, ఆయనే స్వామి పాదములకు నమస్కరించాడు.
గతంలో వెంక్కయ్య స్వామి, వెంకట సుబ్బయ్యను కుమారునివలె ప్రేమించేవాడు.
వెంకయ్య తన జాడ ఎవరికీ చెప్పకుండా కుర్తాళం వెళ్ళటం, కాశీ వెళ్ళటం, తిరిగి రాకుండటం వెంకట సుబ్బయ్యను చింతాక్రాంతునిగా చేసింది.
దిగులుతో మంచంపట్టాడు. వెంకయ్య స్వామి తాను తాడిపత్రిలో నున్నట్లు అతనికి స్వప్నంలో కనిపించి, తాడిపత్రికి రమ్మన్నారు.
వెంకట సుబ్బయ్య ఇతరులతో కలసి తాడిపత్రి వెళ్ళి వెంకయ్య స్వామిని కలిసాడు.
వెంకట సుబ్బయ్య ఆనందించాడు. వెంకట సుబ్బయ్య వెంటవచ్చిన వారు, వెంకయ్య స్వామిని తిరిగి ధేనువకొండకు రమ్మని, అక్కడే ఉండిపొమ్మని వేడుకున్నారు.
కుర్తాళం పీఠానికే అధిపతిగా ఉండే వ్యామోహాన్నే జయించిన వెంకయ్య స్వామి సున్నితంగా వారి కోర్కెను తిరస్కరించారు. ఐతే అక్కడ ఏర్పాటుచేసిన రామకోటి ఉత్సవాలకు హాజరయ్యారు.
దైవ భక్తి, పాప భీతులను పామర జనానికి అందుబాటులో ఉండే జానపద సాహిత్యాన్ని ఆయన రచించి, జనాదరణను కూడా పొందారు.
గోపాలప్ప భార్య దుష్ట గ్రహపీడితురాలు, భూత వైద్యులు ఏమి చేయలేకపోయారు.
వెంకయ్యగారు తెల్లకాగితంపై కొన్ని అక్షరాలు వ్రాసి ఆ కాగితాన్ని కాల్చి పొగ వేయమన్నారు. ఇంకా విభూతి ఆమె వంటికి రాయమన్నారు అది చేయగానే ఆమెకు పట్టిన దుష్టగ్రహ పీడ విరగడైంది.
పండితులను, పామరులను సమాదరించిన వెంకయ్య స్వామి 12 మార్చి 1936న తనువు వీడారు. వారి సమాధి తాడిపర్తిలో నేటికి దర్శనీయ స్థానమే.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గండాలు తప్పించే ‘గుండం’…..సాయి@366 ఆగస్టు 24….Audio
- శ్రద్ధ….. సాయి@366 మార్చి 8….Audio
- తెలుగుతల్లికి రమ్యహర్మ్యము …. మహనీయులు – 2020… మార్చి 22
- ఇంపు – కంపు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 12
- కాషాయానికి వన్నె… …. మహనీయులు – 2020… మార్చి 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments