బాబా నిన్ను 5 రూపాయలు అడిగితే 200 రూపాయలు ఇప్పించావా!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను ఉద్యోగం లో చేరాక ఒక రోజు సాయి భవన్ లో పని పూర్తి చేసుకుని వెడుతుండగా పుణతాంబే జుంక్షన్లో నాకు పొడుగాటి తెల్ల బట్టలు ధరించి ఒక చేతిలో నల్ల భిక్ష పాత్ర మరో చేతిలో భజన చేసే చిరతలు పట్టుకుని నాకు రోడ్డుకి అవతలి వైపు ఒకతను కనపడ్డాడు.

నేను అతన్ని చూసా . అతను నన్ను చూసాడు. నేను ” బాబా అని అనుకునే లోపల ” ఒక ట్రక్ ఇద్దరి మధ్యకు అడ్డం వచ్చింది.

అది వెళ్ళిపోయాక చూస్తే ఇంకా ఆ మనిషి కనపడలేదు. నాకు బాబా అలా దర్శనం ఇచ్చాడు.

అక్కడ పని చేస్తున్నప్పుడు ఒక సారి నేను ఇంటి దగ్గర నుండి ఏమీ తెచ్చుకోలేదు, నాకు బాగా ఆకలి వేస్తోంది. చేతిలో పైసా లేదు.

సంస్థానం భోజనం ఐదు రూపాయలు. అప్పుడు ఆ 5 రూపాయలు కూడా లేవు నా దగ్గర, నేనేం చెయ్యాలి? బాబా, నాకు ఆకలి గా ఉంది ఐదు రూపాయలు ఇప్పించు బాబా అనుకున్నాను.

నేను అక్కడంతా ఊడుస్తున్నాను. ఆ చెత్తలో నాకు 200 రూపాయలు దొరికాయి. అక్కడ ఎవరూ లేరు అడుగుదామంటే.

నేను బాబా నిన్ను 5 రూపాయలు అడిగితే 200 రూపాయలు ఇప్పించావా అనుకున్నాను.

నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా సమాధి మందిరంలో బాబా దర్శనానికి వెడుతుంటాను.

అలాగే ఒక సారి దర్శనానికి వెళ్లి బాబా ఎదురుగా నుంచొని బాబా నువ్వు ప్రపంచమంతా అందరికి కోవా తినిపిస్తావు . నాకు మాత్రం నువ్వు ఎన్నడూ కోవా తినిపించలేదు అనుకున్నాను.

బాబా పాదాల దగ్గరికి రాగానే, పాదాల మీద ఇంత కోవా ఉండ ఉంది. అప్పటికి జనాలు వస్తూ పోతూ ఉన్నారు, ఎవరూ గమనించలేదు.

నేను ఆ కోవా తీసుకున్నాను. నేను బాబాని అడిగాను కదా ! వెంటనే నా కోరిక తీర్చాడు అనుకున్నాను.

నేను పని చేస్తున్న సాయి భవన్ ఎదురుగా సాయి ద్వారకామాయి భవనాన్ని హైదరాబాద్ చాదర్ ఘాట్ గుడి వాళ్ళు రూములు కట్టిస్తున్నారు.

అది కట్టించడానికి సాయి భవన్ ఎదురుగా ఉంది కాబట్టి ఇందులో రూమ్ తీసుకుని అక్కడ పని చేయించేవారు.

ఇక్కడ నేను చేస్తున్న పని విధానాన్ని చూసి, వాళ్ళకి నచ్చి నన్ను అందులో పనికి పిలిచారు.

ఇందులో నాకు నెలకి 2500 ఇస్తుండగా వాళ్ళు నాకు నెలకి 3000 ఇస్తామన్నారు, సరే అన్నాను. అక్కడికి మారిపోయాను.

3000 లతో మొదలైన నా జీతం ఇప్పుడు నెలకి 10000 కి చేరింది . నన్ను ఇలాగే చూస్తుండమని రోజు బాబాకి దండం పెట్టుకుని వేడుకుంటున్నాను .

కోపర్ గాంవ్ 20 km దూరంలో గల బుజాడి గ్రామం మా అత్తగారి వాళ్ళది. దత్త మందిరం ఉంది అక్కడ.

మా ఆవిడ పెళ్లి కాకా ముందు ” కృష్ణ గిరి బాబా ”ఆమెకి ఎప్పుడూ కలలోకి వస్తుండేవారు. ఆయనది దత్త సంప్రదాయం.

కృష్ణ గిరి బాబా మా ఆవిడ కలలో కనపడి ” నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పారుట ”. ఇంట్లో చెబితే ఎవరూ నమ్మలేదు.

ఏదోలే కలలు అలాగే వస్తుంటాయి అని కొట్టిపారేశారు. కలలో ఆయన వచ్చే తారీఖు, సమయం అన్ని చెప్పారుట. ఆ తేదీ రానే వచ్చింది. ఆయన నిజంగానే వచ్చారు. అందరు ఆశ్చర్యపోయారు.

అలా ఆయన ఆమెకి కలలో కనపడి వస్తాను అని చెప్పడం ఆ తారీఖు కి తప్పకుండా రావడం జరుగుతుండేది. అలా ఐదు సార్లు జరిగింది. అలా జరుగుతుంటే ఆయనను వీళ్లంతా గురువుగా భావించారు.

వాళ్లంతా దత్త పరంపర అని వీళ్ళ నమ్మకం. ఆయన భక్తుల మధ్యలోనే కూర్చొని భోజనం చేస్తారుట.

ఆ గురువుగారే మా అత్తగారు వాళ్ళకి  గోదావరి అవతల ఉన్న అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చెయ్యండి, అని చెప్పాడట.

వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు. ఆయన పేదవాడు అనంగానే నేనే గుర్తుకు వచానుట.

మా అత్తగారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మా ఆవిడకి మంచి మంచి మినిస్టర్ వాళ్ళ అబ్బాయి సంబంధాలు వచ్చాయిట అయినా వాళ్ళు ఒప్పుకోలేదు.

నాతో పెళ్లి కుదుర్చుకున్నాక బాబా మా ఆవిడకి కలలో కనపడి నాకు షాల్ కావాలి అని అడిగాడట. మా మామ గారు వచ్చి బాబాకి షాల్ ఇచ్చి వెళ్ళాడు.

ఆ తర్వాత మా పెళ్లి అయ్యింది. దత్త పరంపరలో ఆమెకి చెప్పి వప్పించి నన్ను అనుకున్నాక అప్పుడు ఆమెకి బాబా కలలో కనపడ్డాడు .

ఆ గురువు గారు అప్పటికి సమాధి చెందారు. మా మామగారు ఆయన సమాధి దగ్గరికి నన్ను తీసుకువెళ్లి ”ఇదిగో ఈయన్ని మేము అల్లుడిని చేసుకుంటున్నాము చూడుమని చెప్పి ” నా చేతికి 501 రూపాయలు ఇచ్చి హుండీ లో ఆ డబ్బు వేయించాడు.

ఆ సమాధి నుండి పెద్ద వెలుగు రావడం నేను కళ్లారా చూసాను. ఆయన సమాధిని నేను చూడడానికి అప్పుడప్పుడు వెళుతుంటాను .

నా భార్యకి ఒకసారి బాబా కలలో కనపడి నా బట్టలు ఉతికి ఇమ్మన్నాడు.

ఆయన ఒంటిమీద నుండి బట్టలు తీసి ఉతకటానికి ఇచ్చాడుట.

ఈమె బట్టలు ఉతికి ఇదిగో బట్టలు ఉతికాను ఎక్కడ ఆరెయ్యను అని అడిగిందిట, ఒక షాపులాంటిది చూపించి  అక్కడ ఆరేయమన్నాడు.

సరే ఆరేస్తాను కానీ నీ దర్శనం కావాలి అని అడిగిందట. ఆయన పాదాలంటి నమస్కారం చెయ్యబోయిందట, ఇంతలో ఆయన కిందకి, కిందకి వెళ్ళిపోయాడు.

సమాధి లాగా మూసుకు పోయిందట. అది కల (మా ఆవిడకి మా పెళ్లి కాక ముందు వచ్చింది).

మా ఆవిడ పెళ్లి కాకముందు ఇప్పుడు కూడా స్నానం చెయ్యగానే తులసి చెట్టులో నీళ్లు పోసి సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకునే అలవాటుంది.

అలాగే ఒక రోజు సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకుంటుంటే ఆ సూర్య కిరణాలోలోనుంచి 25 పైసల నాణెం వచ్చి ఆమె కాళ్ళ ముందు పడిందట.

ఆ నాణెం తీసుకువెళ్లి కృష్ణ బాబా దత్త పరంపర అని ముందు దేవుడు గూట్లో పెట్టింది.

అలా పెట్టాక కొన్ని రోజులు ఆ డబ్బు పెరుగుతూ వచ్చింది. 25 పైసలు. 50 పైసలు, ఒక్క రూపాయి అయ్యింది.

ఇలా చిల్లర నాణాలు పెరుగుతూ వచ్చిందట. ఇప్పటికి 25 పైసల నాణెం ఇంకా ఉంది. ఆవిడ పెళ్లి అయ్యేంత వరకు పెరుగుతూ వచ్చింది. ఆవిడ అక్కడనుండి వచ్చేసిన తర్వాత కొంచెం తగ్గిందట.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles