బాబా అయితే ,ఆలా అడిగితే ఇస్తాను



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!

బాబా కు దీపాలు అంటే ఇష్టం అని మా ఫ్రెండ్ లావణ్య ఒకరోజు వెలిగించింది.అప్పుడు నేను టెంపుల్ కి వెళ్ళలేకపోయాను.నాకు అనిపించింది నిజమే కదా!నాకెందుకు రాలేదు ఇలాంటి మంచి ఐడియా అనుకున్నాను.

ఒక సండే రోజు టెంపుల్ వాళ్ళ పెర్మిషన్ తీసుకుని,రాత్రి, కింద ధుని దగ్గర ఉన్న రూమ్ లో నిండా దీపాలు వెలిగిద్దాము.అక్కడ పెద్ద ఫోటో లోని బాబా ఈ రాత్రంతా ఆ దీపాల వెలుతురులో,ఆ దీపాలను చూస్తూ హ్యాపీ గ ఉంటారు కదా అనుకున్నాను.

గురుచరిత్ర చదివినప్పుడుఅందులో ఉంటుంది.సృష్టి మొత్తం మీదే అయినప్పుడు మీకేమి సమర్పించుకోగలను,సూర్యుని ఇంటిలో దీపావళి పండగ ఎలా జరుపుకోగలరు,స్వయం ప్రకాశకులు, జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా ? అని.

నాకు అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది.సో బాబా ఆలాదీపాలను ఇష్టపడాల్సిన పనేమీ ఉంది దీపాలు అంటే ఇష్టం అని చెప్పడం లో ఏదో అర్ధం ఉండి ఉంటుంది .

మనలోని అజ్ఞానాన్ని,మన మసులోని మలినాన్ని,చెడుని అన్నిటిని తీసివేసి మంచి మనసుతో ఉండగలగడమే అయన కోరుకునేది.ఆలా శుద్ధమైన మన మనస్సుని అయన ముందు పెట్టగలగడమే ,ఆయనకు మనం పెట్టే నిజమైన దీపం అని నాకు అనిపిస్తుంటుంది . లేదంటే ఇంకా ఏదైనా అర్ధం ఉండవచ్చు కానీ,నాకు అయితే ఆలా అనిపిస్తుంది.

సాయంత్రం దీపాలు పెట్టాలి కాబట్టి,ఉదయం వెళ్లి ధుని దగ్గర మొత్తం క్లీన్ చేస్తున్నాను.ఆ టైం లో నాకు బయట ఎవరో కంజీర కొట్టుకుంటూ బాబా నామం చెపుతున్నారు.అది వినగానే నాకు ఎందుకో చాల హ్యాపీ గ అనిపించింది.

బాబా నామం చాల సార్లు విన్నాను,కానీ ఆ గొంతు చాల బాగుంది అనిపించింది.మా టెంపుల్ వాళ్ళ ఎవరి గొంతు కాదు అది .ఈ టైం లో రోడ్ పై ఆలా ఎవరు నామం చెపుతున్నారబ్బా అని అనుకున్నాను.

బాబా కోసం చేస్తున్న పని మధ్యలో ఆపి బయటకు రావాలనిపించట్లేదు కానీ ఆ గొంతులోని మాధుర్యం నన్ను ఆలా బయటకు వచ్చి చూసేలా చేసింది.

రూమ్ దగ్గర నిలుచుని చుస్తే,మా టెంపుల్ కి ఎదురుగా ఉన్న ఇంటి ముందు ఎవరో తెలియని అతను కంజీర కొట్టుకుంటూ నామం చెపుతున్నాడు.అతను అడుక్కునే అతనిలా అనిపించలేదు.కానీ అతను అడుక్కోవడానికే ఆలా వచ్చాడేమో లేదంటే ఆలా ఇంటి ముందు నిల్చొని ఆలా కొట్టుకుంటూ ఉండదు కదా అనిపించింది.

ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయ్.ఇటు పక్క,అటుపక్క ఇంటి తలుపులు కూడా మూసి ఉన్నాయ్.ఈయనేంటి తలుపులు మూసిఉన్నాకూడా అలాగే నించొని ఉన్నాడు అనుకున్నా.అయినా నేనెప్పుడూ ఇలా బాబా నామం చెబుతూ ఇంటిటికి తిరిగి అడుక్కునే వాళ్ళని చూడలేదు.ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అనుకున్నాను.

ఆలా అనుకుంటున్నప్పుడు తాను వెనక్కి తిరిగి నా దగ్గరికి వచ్చి చేయి చాచాడు.నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. అతనికి 2 రూపాయలు ఇస్తే ఏమి సరిపోతుంది.10 రూపాయలు ఇస్తే టిఫిన్ అయినా చేస్తాడు కదా,టిఫిన్ చేయడానికి పది రూపాయలు ఇద్దాం అనుకున్నాను .

మళ్ళీ అడుక్కునే వాళ్ళు ఇలా బాబా నామం చెప్పరు.ఎందుకో ఇతన్ని చుస్తే బాబా నే అనిపిస్తుంది.కానీ, బాబానే అయితే బాబా నామాన్ని బాబానే ఆలా చెప్పుకుంటారా?

ఒకవేళ ఇతను నిజంగా బాబానే అయితే నేను 10 ఇద్దామనుకుంటున్న కదా, మాములుగా అడుక్కునే వాళ్ళు నాకు ఇన్ని రూపాయలు ఇవ్వమని అడగరు యెంత ఇస్తే అంత తీసుకుని వెళతారు. సో ఇతను బాబా అయితే 2 నిమిషాలలో 10 రూపాయలు ఇవ్వమని అడగాలి.అప్పుడు బాబానే అనుకుని హ్యాపీ గా ఇస్తాను.ఆలా అడగకుంటే 2 రూపాయలు ఇస్తాను అనుకుని చూస్తున్నాను.

అతను కూడా నన్ను అలాగే చూస్తున్నాడు ఏమి మాట్లాడట్లేదు.2 నిముషాలు అయిందనుకుని ఇతనేమి 10 రూపాయలు అడగలేదు కదా ఇతను బాబా కాదు అనుకుని,నా దగ్గర చేంజ్ లేదు పైన మేనేజర్ అంకుల్ ని అడిగి 2 రూపాయలు తెచ్చి ఇద్దాముఅని కొంచం డల్ గా స్టెప్ ఎక్కుతున్నాను.

ఎందుకంటె నాకు అతనికి పది రూపాయలు ఇవ్వాలని ఉంది .నేను ముందు అలాగే అతను టిఫిన్ చేయడానికి పదిరూపాయలు ఇద్దాం అనుకున్నా కదా.కానీ,తరువాత బాబా అయితే ,ఆలా అడిగితే ఇస్తాను అనుకున్నాను.సో ఇప్పుడు తాను పదిరూపాయలు అని అడగకుండా నేనే ఇస్తే ఇతన్ని నాకు నేనే బాబా అనుకుని ఇచ్చినట్టు ఉంటుంది.

అనుకుని పైకి వెళ్లి రెండు రూపాయలు తెద్దాం అని ఆలా స్టెప్ ఎక్కానో లేదో వెంటనే, నాకు ఫలహారం చేయడానికి 10 రూపాయలు ఇవ్వండి అని అడిగారు.నేను హ్యాపీ గా పది రూపాయలు ఇచ్చాను.తాను నన్ను అలాగే కొంచం సేపు చూసి వెళ్ళిపోయాడు.

హ్యాపీ గా అనిపించింది.ఎందుకంటె టిఫిన్ అంటే తెలుగులో ఫలహారమే కదా.నేను కేవలం  పదిరూపాయలు తాను అడగాలి అనుకున్నాను కానీ,తాను నేను అనుకున్న పదిరూపాయలతో పాటు నేను ఎందుకోసం ఇద్దాం అనుకుంటున్నానో ఆలానే అడిగారు.

నాకు చాల హ్యాపీ అనిపించింది.ఒకవేళ తాను బాబా ఐన కాకపోయినా నా మనసులోది తాను అడిగాడు అది చాలు అనిపించింది..కానీ తరువాత కొన్ని రోజులకి ఆలోచిస్తే తాను,తాను బాబా కాదేమో బాబా ఐతే తన నామం తాను ఆలా చెప్పుకుంటారో లేదో తెలియదు కాబట్టి వచ్చిన అతను గురువుగారేమో అనిపించింది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా అయితే ,ఆలా అడిగితే ఇస్తాను

Sreenivas

సాయి వంటి దైవంబు లేడోయ్ లేడోయ్ …శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ…సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

Sai Suresh

మంచి అనుభవం సాయి.

బాబా మన మనస్సులోని బావాలు తెలుసుకోగలరు అందుకే మీరు ఎలా అనుకున్నారో అలానే అడిగి 10 రూపాయలు తీసుకున్నారు.

మనలోని అజ్ఞానాన్ని,మన మసులోని మలినాన్ని,చెడుని అన్నిటిని తీసివేసి మంచి మనసుతో ఉండగలగడమే అయన కోరుకునేది.ఆలా శుద్ధమైన మన మనస్సుని అయన ముందు పెట్టగలగడమే ,ఆయనకు మనం పెట్టే నిజమైన దీపం.

ఈ బావాన్ని నేను ఏకీభవిస్తున్నాను సాయి. నాకు ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు కానీ , మీరు వ్రాసిన ఈ వివరణ కచ్చితంగా కరెక్ట్ అనిపించింది సాయి.

prathibha sainathuni

saibaba saibaba saibaba saibaba….

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles