Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!
ఒకరోజు ఉదయం ఆఫిస్ కి వెళ్ళేటప్పుడు లేట్ గా 8 .30 కి ఆలా టెంపుల్ కి వెళ్ళాను. ఈరోజు ఏంటి ఇలా లేట్ ఐంది అనుకుంటూ వెళ్లేసరికి టెంపుల్ మొత్తం క్లీన్ చేస్తున్నారు.
ఏంటి ఈ టైం లో ఇలా క్లీన్ చేస్తున్నారు అని అడిగితె,సూర్యగ్రహణం అయిపోయింది అని గ్రహణం తరువాత టెంపుల్ లో ఉన్న వస్తువులతో సహా అన్ని క్లీన్ చేస్తున్నారు .
నా బాబా ఫోటో కూడా క్లీన్ చేసారు.( ఆ పెద్ద ఫోటో ని నా ఫోటో లాగానే ఫీల్ అయ్యేదాన్ని .అందరు అలాగే పేరు పెట్టారు కూడా ).నాకు ఎం చేయాలో అర్ధం కాలేదు.
అప్పుడు అలంకరిద్దాము అంటే ఇంకా ధుని దగ్గర క్లీన్ చేయలేదు.రూమ్స్ మొత్తం చిందరవందరగా ఉన్నాయ్.మొత్తం క్లీన్ చేసాక బాబా ఫోటో కి అలంకరిస్తే ఫ్రెష్ గా ఉంటుంది బాబాకి ,ఆలా కాకుండా రూమ్ మొత్తం చిందర వందరగా డస్ట్ తో ఉన్నప్పుడు నాకు బాబాఫొటోకి అలంకారం చేయాలంటే ఏదో లాగా అనిపించింది.
మనం కూడా ఇల్లు మొత్తం నీట్ గా సర్దుకున్నాకే కదా ఫ్రెషప్ అవుతాము.ఫ్రెషప్ అయ్యాక రూమ్ సర్దుకోముకదా. బాబా కూడా అలానే కదా.ఆలా అని అప్పుడు రూమ్ మొత్తం క్లీన్ చేసి,తరువాత బాబా ని అలంకరించి ఆఫీస్ కి వెళ్లాలంటే చాల లేట్అవుతుంది.
పోయి పోయి ఈ రోజే లేట్ గా వచ్చాను నేను టెంపుల్ కి అని అనుకున్నాను.సాయంత్రం వచ్చాక పెడదాము అంటే ,సాయంత్రం వరకు ఆలా బోసిగా బాబా ఫోటోని ఉంచాలనిపించలేదు.
ఎం చేయాలి అని ఆలోచిస్తుండగా అక్కడ మారుతి టెంపుల్ క్లీన్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ కనిపించింది.మారుతి కి ఆ బాబా ఫోటోకి డెకరేట్ చేయడం అంటే ఇష్టం.కానీ ఎప్పుడు డెకరేట్ చేసే టైం కి తాను మర్చిపోవడమో,ఏదో పని ఉండి చేయలేకపోవడం జరుగుతుంది.
సో ఈ రోజు మారుతిని పెట్టుమని చెపుదాము హ్యాపీ గ ఫీల్ అవుతాది అని వెళ్లి మారుతికి నాకు ఆఫీస్ కి టైం అవుతుంది.ఈవెనింగ్ వరకు పెట్టకుండా ఉంటె బాగుండదు సో,ఈ రోజు మర్చిపోకుండా నువ్వే పెట్టు అని చెప్పా.ఓకే అని చెప్పింది.
బాబా ఈ రోజు మారుతితో అలకరించుకో,నేను చేయలేక పోతున్నాను.ఏమనుకోకు అనివెళ్ళేటప్పుడు బాబా ఫోటో కి చెప్పాను .ఒకవైపు తాను పెట్టాలని ఉన్న ఇంకోవైపు ఎలా పెడుతుందో ఏమో బాబాకి అందంగా పెడుతుందో లేదో అని కొంచం భయం.
కానీ బాబా కి భక్తి తో ఎలా పెట్టిన ఇష్టమే.మారుతికి బాబా అంటే ఇష్టం కదా సో బాగానే డెకరేట్ చేయించుకుంటాడు అనుకుని ఆఫీస్ కి వెళ్ళాను.సాయంత్రం రాగానే టెంపుల్ కి వెళ్ళాను ఎలా పెట్టిందో చూడాలని ఉత్సాహం తో,బాగానే పెట్టింది కానీ,బాబా పక్కన ఓం,స్వస్తిక్ గీయలేదు.
నాకు ఓం కి స్వస్తిక్ కి మీనింగ్ తెలియకపోయిన నా కన్నా ముందు వాళ్ళు పెట్టారు కదా అని నేను పెట్టేదాన్ని అంతే.నేను వెళ్లేసరికి మారుతి ఉంది టెంపుల్ లో.చాల హ్యాపీ గ ఫీల్ అవుతుంది చాలారోజుల తరువాత బాబా తనతో పెట్టించుకున్నారు అని.ఎలా పెట్టాను నువ్వు పెట్టినట్టు పెట్టనా ?అని అడిగింది.బాగా పెట్టావు అని చెప్పి,తాను ఫోటోకి ఓం,స్వస్తిక్ పెట్టలేదని గమనించి ఎందుకు పెట్టలేదు,జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే అని అడిగాను.
తాను నాకు అవి అంత ఇంపార్టెంట్ అనిపించలేదు అందుకే ఓన్లీ బాబా కి మాలా లాగా వేసాను.అని చెప్పింది.నేను ఓకే కానీ నేనైతే అంతకుముందు వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు కదా అని అలానే కంటిన్యూ చేశాను ఆంటే,ఏమో నాకు ఇంపార్టెంట్ అనిపించలేదు అని చెప్పింది.
మారుతి చూడు తాను ఓన్లీ బాబా మీదనే ఫోకస్ చేసింది.నేను మాత్రం పక్కన ఓం, స్వస్తిక్ పై కూడా చేస్తున్నాను,మన ఫోకస్ ఓన్లీ బాబా మీదనే ఉండాలి కానీ,ఇంకా దేనిపైనా ఉండకూడదు.తననుండి ఇది నేను నేర్చుకోవాలి అనుకుని.నెక్స్ట్ టైం నుండి నేను కూడా ఓం,స్వస్తిక్ పెట్టద్దులే అనుకున్నాను.
రెండు రోజుల తరువాత కలలో బాబా ఫోటో ఒకటి పెద్దది.శిరిడీలో విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహం ఫోటో అది. నా చేతిలో లో ఉంది ఆ ఫొటోలో బాబా కళ్ల నుండి నీరు కారుతున్నాయి.నేను ఊరుకో బాబా ఉరోకో ,ఏడవకు అని కళ్ళు తుడుస్తున్నాను.అయినా అలాగే కారుతున్నాయి నేను తుడుస్తూనే ఉన్నాను.
నాకు బాధనిపించి బాబా ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో ప్లీజ్ నాకు బాధనిపిస్తుంది అని చెప్పినా నీరు కారుతూనే ఉన్నాయ్.లాస్ట్ కి ఓకే నేను బాబాని నమ్మట్లేదు అనుకుని బాబా ఏడుస్తున్నారేమో అనుకుని.బాబా నేను నిన్ను నమ్ముతున్నానులే సరేనా ! ఏడవకు ఇక,నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని కళ్ళు తుడిచాను.
నీళ్లు కారడం ఆగిపోయాయి.బాబా ఏడవటం ఆపేసారు అని నాకు హ్యాపీ అనిపించింది.
మళ్ళీ,బాబా బాధపడి ఏడుస్తూ ఉంటె బాబానే ఏడవకు అని ఓదార్చినట్టు ఫీల్ అవుతున్నాను.బాబానే ఓదార్చే అంత దానినా ? నా ఓవర్ ఆక్షన్స్ కాకుంటే ఏంటి ఇది ? అనుకున్నాను.కానీ,బాబా కంటి నుండి నీరు కారడం ఆగిపోయాయి నాకు హ్యాపీ అనిపించింది.
తరువాత వెంటనే మళ్ళీ కలలో ,నేను ధుని దగ్గర రూమ్ లో బుక్స్ ఉన్న సెల్ఫ్ దగ్గర కూర్చుని సచ్చరిత్ర చదువుతున్నానట.నా పక్కన నాకు తెలియని,ఒక కొత్త అతను మొత్తం వైట్ డ్రెస్ లో ఉన్నాడు.తనకి అంకుల్ ఏజ్ ఉంటుంది .నా ముందు కూర్చొని గురు చరిత్ర చదువుతున్నారు .
నేను మనసులో నేను కూడా గురుచరిత్ర చదువుదాము అనుకుంటున్నా కానీ చదవట్లేదు.కానీ ఇతను చూడు యెంత బుద్దిగా కూర్చుని చదువుతున్నాడో తనని చూసి నేర్చుకోవాలి అనుకుంటున్న సమయం లో ఆ బుక్ లో నుండి 11 ఇంపార్టెంట్ పాయింట్స్ బయటికి చదువుతున్నాడు.అవి సరిగ్గా నాకు అవసరమైనవి అట.ఇతను సరిగ్గా నాకు అవసరమైనవి చదువుతున్నాడు.నేను ఆ బుక్ చదవట్లేదు కాబట్టి ,నాకోసమే చదువుతున్నాడు అనిపించింది.
నేను ఆలా ఆలోచిస్తున్నప్పుడు ఆ రూమ్ లోకి రోజు టెంపుల్ కి వచ్చే ఒక తాత,నా వైపు వస్తూ,నువ్వు ఇక్కడ ఉన్నావా ?నీకోసమే వస్తున్నా అని వస్తున్నాడు.అతనిని చూస్తూ.ఇతను తాత లాగే ఉన్నాడు కానీ తాత కాదు బాబానే,ఆ మొహం లో తేజస్సు చూస్తేనే తెలిసిపోతుంది ఇతను బాబా అని.కానీ తాత రూపం లో వస్తున్నాడు అనుకున్నాను.
తన చేతిలో తామరాకు తొడిమ పొడుగుగా ఉంది దాని ముందు భాగం ఎర్రగా ఉంది కుంకుమతో అద్దినట్టు తెలుస్తుంది.అతను నా దగ్గరగా వచ్చి కూర్చుని,నీ చేయి ఇవ్వు.నీ చేతిలో నేను ఓం ,స్వస్తిక్ రాస్తాను అన్నాడు.
నేను నా ఎడమ చేయి తన ముందుకు చాచాను.తాను ఏదో రాస్తున్నాడు.నేను ఎక్కడో చూస్తూ,అవును బాబా చేతిలో బ్లూ పెన్ లేదు కదా ! మరి ఎలా రాస్తాడు అనుకుని,మళ్ళీ నేనే పూర్వకాలం లో బ్లూ పెన్స్ ఉండేవి కాదు కదా! అప్పుడు మునులు ,ఋషులు అందరు ఇలాగె తొడిమలతో లేదా పక్షి ఈకలతో,లాస్ట్ కి ఏవి లేకుంటే కర్ర పుల్లలు ఇన్క్ లో ముంచి వాటితో రాసేవారు కదా ఇప్పుడు కూడా బాబా అలానే రాస్తున్నాడేమో నా చేతిలో అనుకుంటున్నాను.
అప్పుడు బాబా ఇప్పుడు చూసుకో నీ చేతిలో ఏమి రాసానో అన్నాను.నేను వెంటనే నా చేతిని చూసుకునే సరికి అరచేయి మధ్యలో తొడిమతో అద్దినట్టు గుండ్రం గా కుంకుమ అద్ది ఉంది.
చేయి మొత్తం బ్లూ పెన్ తో ఏవేవో రాసారు.నేను బ్లూ పెన్ ఎక్కడినుండి వచ్చింది బాబాకి.ఓకే నేను బ్లూ పెన్ అనుకున్న కాబట్టి బ్లూ పెన్ తో రాసారేమో అనుకున్న టైం లో తాత రూపం లో ఉన్న బాబా నవ్వుతూ నేనేం రాసానో చదువు అన్నారు.
నేను ఏమి రాశారా? అనుకుని చేయి చూసా.అన్ని వేళ్ళ పైన అడ్డంగా రాసారు ఏవేవో.అర చేతిలో ఒక ఆర్డర్ లాగా కాకుండా రాసారు.నేను ఇప్పుడు నేను ఎక్కడి నుండి చదవాలి.అని ఆలోచిస్తూ చేతికి కింది భాగం లో రాసింది చూసి ఇక్కడ ఫస్ట్ చదువుదాం అని చూసేసరికి.”రాముడు నరకం అనుభవించాడు” అని రాసుంది.
నాకు ఒక్కసారిగా భయం వేసింది.నేనేమో ఓం , స్వస్తిక్ రాస్తాను ఆంటే ,ఏదో మంచిది రాస్తారు.మంచి జరుగుతుంది అనుకుంటే ఇదేంటి ఫస్ట్ చదివిందే ఇలా రాముడు నరకం అనుభవించాడు అని ఉంది.
దీనికి అర్ధం ఏంటి.రాముడు చాల బాధలు బడ్డాడు కదా!నేను కూడా ఆలా బాధలు పడతాను అనా?లేదా రాముడు నరకం అనుభవించాడు అని ఉంది కానీ నరకం అనుభవిస్తాడు అని లేదు కదా! ఆంటే నేను కూడా అలాగే బాధలు పడ్డాను అనా ?నాకు అర్ధం కాకా బాబాని అడుగుదాం అని చూసేసరికి అక్కడ బాబా లేడు.
మెలుకువ వచ్చాక చాల భయం వేసింది.అర్ధం కాక,టెంపుల్ లో ఉదయ్ స్వామి అనే పూజారికి చెప్పా ఇలా వచ్చింది.దానికి అర్ధం ఏంటి ? బాబా కంటి నుండి నీరు ఆలా ఎందుకు కారింది ?బాబా ఎందుకు ఆలా రాసారు ?నాకు భయమేస్తుంది అని.
దానికి అతను,ఏమో తెలియదు.అర్ధం ఏదైనా నీకు బాబా కనిపించారు అదే అదృష్టం ఇంకా ఏమి ఆలోచించకు.బాబా నే కనిపించారు .ఇంకా నువ్వు సాదించవలసింది ఏమి లేదు.హ్యాపీగా ఉండు అని చెప్పాడు.
కానీ అవి నా మనసుకు ఎక్కలేదు.బాబా ఆలా ఎందుకు ఏడ్చారు?అని బాధ ఎక్కువైంది.ఆఫీస్ కి వెళ్ళాను.ఆరోజు వర్షం కాబట్టి ఎక్కువగా ఎవరు రాలేదు మెయిన్ గా మా సర్ రాలేదు.సో వర్క్ ఏమి లేదు.ఊరికే కూర్చున్నా,ఎప్పుడు కలనే గుర్తుకు వస్తుంది.
రాముడు నరకం అనుభవించాడు ఆంటే, ఓకే నాకు అలా కష్టాలు వస్తే రానివ్వు కానీ, బాబా కంటినుండి నీరు కారింది గుర్తుకు వచ్చి నాకు బాగా ఏడుపు వచ్చి ఏడిచాను.
మారుతి టెంపుల్ కి వెళితే ఉదయ్ స్వామి చెప్పారట.తనకి అర్ధం కాక నాకు కాల్ చేసింది.బాబా ఫోటోలో కంటి నుండి నీరు రావడం ఏంటి అని.
నేను అంత చెప్పి ,బాబా ఏడ్చారు అని ఏడిచేసా.ఆంటే నేను బాబా ని కూడా ఏడిపించేసాను.పాపం బాబా యెంత బాధపడితే ఆలా కంట నీరు పెట్టుకుంటారు ఆంటే నువేం ఫీల్ అవ్వకు.నువ్వు ఇలా బాధ పడితేనే బాబా ఇంకా ఎక్కువ బాధపడతారు.బాబా బాధపడాలి ఆంటే అలాగే ఏడువు.బాధపడొద్దు ఆంటే ఏడుపు మానేసేయ్.ఏమైనా నువ్వు చాల లక్కీ అంది.
ఫోన్ పెట్టేసాక,నేను ఏడిస్తే బాబా బాధపడతారు అని యెంత కన్నీరు ఆపుకుందామనుకున్నాకూడా నాకు ఆలా నీరు వస్తూనే ఉంది.నేనేంటి ఇలా ఏడుస్తున్నాను.ఇంకా నయం ఆఫీస్ లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది లేదంటే నన్ను ఇలా చూసి నేను ఏదో పెద్ద కష్టం లో ఉండి ఏడుస్తున్నాను అనుకునే వాళ్ళు అందరు.అయినా ఈ రోజు నా సిట్యుయేషన్ ఇలా ఉంటుందనే బాబా ఈ రోజు ఎవరు ఆఫీస్ కి రాకుండా చేశారేమో అనుకున్నాను.మళ్ళీ ఏడుపోచ్చింది. సాయంత్రం వరకు కొంచం బెటర్ అనిపించింది.
సాయంత్రం మారుతి ఎందుకు ఆలా ఏడిచావు ఆంటే ఏమో బాబా కంటిలో ఆలా నీరు చూస్తే నాకు ఏడుపొచ్చింది అని చెప్పా.అప్పటి నుండి కచ్చితంగా బాబా ఫోటోకి డెకరేట్ చేసేటప్పుడు ఓం,స్వస్తిక్ గీస్తున్నా.నాకు వాటి మీనింగ్ తెలియదు.తెలుసుకోవాలని కూడా లేదు.కానీ అవి బాబాకి ఇష్టం అనిపించింది ఆ కల ద్వారా.బాబా కి ఇష్టం కాబట్టి బాబా కోసం గీస్తాను.ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా.
ఇప్పుడు ఆ సంఘటన గుర్తుతెచ్చుకుంటే చిన్న పిల్లలాగా అప్పుడు నేను ఏడ్చింది గుర్తొచ్చి నవ్వొస్తుంది.యెంత పెద్దవాళ్ళమైనా బాబా దగ్గర నేను చిన్న పిల్లలాగే ఫీల్ అవుతాను. అలా ఉండడమే నాకు ఇష్టం
తరువాతి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Latest Miracles:
- బాబా అయితే ,ఆలా అడిగితే ఇస్తాను
- ఆలా నడుస్తూ ఒక దగ్గర ఇక్కడ కూర్చుందాం అన్నారు గురువుగారు.
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
- బాబా చేసే లీలను అందరితో పంచుకొంటాను అని మొక్కుకున్న భక్తురాలు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఆలా బోసిగా బాబా ఫోటోని ఉంచాలనిపించలేదు.”
Sai Suresh
January 26, 2017 at 6:44 amబాబా పట్ల మీకు ఉన్న ప్రేమ చాల అద్బుతం. అటువంటి ప్రేమనే బాబా మన నుండి ఆశించేది.
prathibha sainathuni
January 26, 2017 at 5:45 pmథాంక్యు సురేష్ గారు,
మనం,మన జీవితమంతా అయన మీద యెంత ప్రేమ చూపించినా కూడా, అయన మనమీద చూసే ఒక్క ప్రేమమయ చూపు కి సరిపోదు.కదా….
Sai Suresh
January 28, 2017 at 7:39 amyes మీరు చెప్పింది నిజం సాయి
సాయినాథుని ప్రణతి
January 26, 2017 at 9:12 amPrathiba garu చాలా బాగుంది మి అనుభవం. బాబా తన బిడ్డలను ఎపుడు ఎడిపించరు .ఒకవేల బాదపడల్సి వస్తే తాను ఆ బాదను అనుభవించి తన బిడ్డలకు ప్రేమను పంచుతారు అనిపిస్తుంది.అందుకు నేనే ఒక ఉదాహరణ .నాకు 3 నేలల్ల ముందు అనారోగ్యంగా వునింది ఒక వారం రోజులు బరించలేని కడుపు నొప్పిని అనుభవించాను అపుడు బాబా నాకు పంచిన ప్రేమకు మరేవరు సాటిరారు . ఒకరోజు బాబా నా అనువనువున వున అనుభుతి కలిగింది, ఒకరొజు గురువుగారి రుపంలో ఆనందాని ప్రసాదించారు, ఒకరోజు హరతి సమయంలో ఆయన నవులో ఆనందాని ప్రసాదించారు .నేను కడుపు నొపితో బదపడుతునపటికి బాబా ప్రేమతో నా నొపి తెలియకుండ ఆనందసాగరంలో నను ముంచేసారు బాబా.అలా ప్రతి రోజు ఆయన నాకు నొపి తెలియ కుండ బాబానే ఆ నొపిని తెలియకుండా చేసారు .అది నా జివితంలో మరువలేను
prathibha sainathuni
January 26, 2017 at 5:51 pmథాంక్యూ ప్రణతి గారు,
మీ అనుభూతి చదువుతుంటే ఆనందంగా ఉంది. మీకు బాబా అంటే యెంత ఇష్టమో మీ కామెంట్ లోనే తెలిసిపోతుంది.
సాయినాథుని ప్రణతి
January 26, 2017 at 1:34 pmనేను 2006 నుంచి guruvugari dhagaraku vachanu .
prathibha sainathuni
January 26, 2017 at 5:52 pmఅలాగా ..
saisuma
January 27, 2017 at 9:30 amchala bagundhi akka mi experience inkotentante miru baba ni chudagaligaru and gurthunchagaligaru adhe kadha guruvugaru annaru kadha miku prathi situation lo baba edho oka anubhavani istharu but manam konnisarlu gurthunchagalam konni sarlu gurthinchalem.gurthunchinapudu baba midha inka prema peruguthundhi ani.
ur so lucky akka .
Prathiba Sainathuni
January 27, 2017 at 4:31 pmtnq suma..
Maruthi.Velaga
January 28, 2017 at 1:40 pmSri Sachhidananda Sadguru Sainath Maharaj Ki Jai.
Maruthi.Velaga
January 28, 2017 at 1:51 pmNenu annavi Naku kuda gurthulevu sis NV chepthunte gurthostunnayi.chala baga gurthupettukunnav sis 4,5 years back vi kuda point to point.. Saibaba saibaba saibaba saibaba..