ఆలా నడుస్తూ ఒక దగ్గర ఇక్కడ కూర్చుందాం అన్నారు గురువుగారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!

కొన్ని రోజుల తరువాత గురువుగారు నాకు నచ్చలేదు అని బాబాకి చెపుదాం అనుకున్న నేను.గురువుగారు ఇచ్చిన స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ తోనే గురువుగారికి దగ్గరవడం స్టార్ట్ అయింది.

నేను గురువుగారు లైవ్ గా ఉన్నప్పుడు లేను కదా.ఉంటే నన్ను ప్రతిభ అని పేరు పెట్టి పిలిచేవారు కదా అనుకుని.గురువుగారి నోటినుండి ఒక్కసారి నా పేరు వినాలనిపించింది.

ఒకరోజు కలలో మొత్తం తెల్లని మంచు ఉంది.అక్కడ మంచు మీద కొన్ని కర్రలు వేసి పైన గుడిసె లాగా నో ఎలాగో వేశారు కరెక్ట్ గా కనిపించలేదు.కానీ అది మాత్రం మంచుమీద లేదు.కొంత మంది గురువుగారి కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు.

నేను ఆ స్టే చేసిన ప్లేస్ నుండి గురువుగారు ఎలా వస్తారా అని చూస్తూ ఉన్నా,అందరు అటు తిరిగే గురువు గారి కోసం చూస్తున్నారు.సడెన్ గా నేను ఇటు పక్కన చేసేసరికి గురువు గారు వేరే సైడ్ లో స్టెప్స్ పైనుండి దిగుతూ వస్తున్నారు.

 అందరు గురువుగారికోసం ఇక్కడ వెయిట్ చేస్తుంటే గురువుగారేంటి అక్కడి నుండి వెళ్తున్నారు .గురువుగారు మహాత్ములు కదా తనకోసం ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది కదా అనుకున్నాను.

నేను ఒక్కదాన్నే గురువుగారి దగ్గరకి వెళ్ళాను.నన్ను గురువుగారు ఆలా మంచులో నడిపిస్తూ తీసుకెళ్తున్నారు. గురువుగారు అక్కడ అందరు వెయిట్ చేస్తుంటే అటు సైడ్ వెళ్లకుండా నన్ను ఇటు తీసుకొస్తున్నారు.గురువుగారికి నేనంటే ఇష్టం అనుకున్నాను.

చుట్టూ తెల్లని మంచు,వెన్నెలలా వెలుతురు చాల బాగుంది ఆ ప్లేస్.అంత మంచులో మేము ఇద్దరం కనీసం స్వేటెర్ ,కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు మేము. ఆలా నడుస్తూ ఒక దగ్గర ఇక్కడ కూర్చుందాం అన్నారు గురువుగారు.

గురువుగారు మోకాళ్ళ మీద కూర్చుని చేతితో మంచుని తవ్వుతున్నారు.నేను కూడా మోకాళ్ళ మీద కూర్చుండి గురువుగారు ఏం చేస్తున్నారో చూస్తున్నాను.అందులోనుండి ఏమో తీశారు.

నన్ను ప్రతిభా ఈ మంచులో నుండి వేడి ఉప్మా తీయి అన్నారు.నేను అంత మంచులో నుండి వేడి ఉప్మా ఎలా తీయాలో అర్ధం కాలేదు.నాకు రాదు గురువుగారు అని చెప్పాను.ఏం కాదు నేను ఉన్నాను కదా తీయి అన్నారు.

నా మైండ్ లో నాకేమి రాదు నాకేమి తెలియదు అనే ఆలోచన స్ట్రాంగ్ గా ఉంది.సో నేను గురువుగారికి ,ఏమి ట్రై చేయకుండానే నాకు రాదు అని మళ్ళీ చెప్పాను .నువ్వు ట్రై చేయి నీకు ఎలా తీయాలో రాకుంటే నేను ఉన్నాను కదా నేర్పిస్తాను తీయి ప్రతిభా అన్నారు.ఆలా గురువుగారు ప్రతిభా అని నన్ను పేరుతో పిలుస్తుంటే నా పేరు నాకే ఏదో కొత్తగా అనిపించింది.

మీరంటే మహాత్ములు కాబట్టి మంచులో నుండి చేతితో వేడిగా ఉప్మా తీశారు కానీ, మీ చేయికి ఏమి కాలేదు నేను మహాత్మురాలిని కాదు కదా. నేను ఇందులో చేయి పెడితే నా చేయి కాలుతుంది.నేను తట్టుకోలేను అని చెప్పాను.గురువుగారు చిన్నగా నవ్వారు.

నాకు ఏమి రాదు అని బాధేసింది.మళ్ళీ కనీసం ఇంత చిన్నది కూడా రాదా ఈమెకి అని నాగురించి గురువుగారు అనుకుంటారేమో అని బాధనిపించింది.మరి నాకు రాదు దానికి నేనేం చేయాలి అనుకున్నాను.

ఇన్నిరోజులు తరువాత ఇప్పుడు నేర్చుకుంటే నేను నేర్చుకుని,అందరిలాగా బ్రైట్ స్టూడెంట్ అవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో,అసలు నేను నేర్చుకోగలనో లేదో అని బాధనిపించింది.

ఉదయం గుర్తు తెచ్చుకుంటే అనిపించింది.యెంత పిచ్చిపని చేశాను.నాకు తెలియకుంటే చెప్పడానికి గురువుగారు ఉన్నారు కదా!తాను చెప్పిన కూడా నేను,కనీసం ట్రై కూడా చేయలేదు. నా చేయి కి వేడి తగలకుండా చేసేవారు కాదా .గురువుగారు ఏదో నేర్పిద్దాం అనుకున్నారేమో నేను తెలివితక్కువగా నేర్చుకోలేకపోయానేమో అనిపించింది.

నాకేమి తెలియదు కానీ, గురువుగారు ప్రతిభా అని పేరు పెట్టి పిలవాలి అనుకున్నాను చూడు అని అనిపించింది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles