Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అది ముచ్చర్లపల్లి గ్రామం. ఆ సంవత్సరం వర్షాలు కురువలేదు. రైతులు, ప్రజలు అనేక ఇక్కట్లకు లోనయ్యారు. వారు అవధూత బోధానంద సరస్వతిని వేడుకున్నారు.
ఆయన రేగడిమట్టితో బుష్యశృంగ ప్రతిమను చేయించి, అభిషేకించి, వరుణ జపం, చండీ పారాయణ, గురు చరిత్ర పారాయణ చేయించి నామసంకీర్తన గావించారు.
కుండపోతగా వర్షం కురిసింది. వర్షం ఆ గ్రామానికే పరిమితమైంది.
సాయిబాబా జీవిత చరిత్రలో తుఫాన్ ను ఆపివేసే ఘట్టం ఉంది. మహాత్ములు తలచుకుంటే వర్షాన్ని కురిపించగలరు, ఆపనూగలరు.
బోధానందేంద్ర శిష్యులను అనువైన రీతిలో ఆశీర్వదించేవారు.
శ్రీశైలంలో విరివెంటి బాలకృష్ణ శర్మగారికి దత్రాత్రేయ సన్నిధిలో దత్త మంత్రం ఉపదేశించారు.
రఘనాథగడ్ ‘ఓం నమశ్శివాయః అనే మంత్రాన్ని పఠిస్తూ వచ్చాడు బోధానందుల వద్దకు.
“ఒరేయ్ నీవు ఓం నమః శివాయ మంత్రాన్ని పఠిస్తూ వచ్చావు గదా!” అని ఆంజనేయ మంత్రోపదేశం చేసి, పుత్ర సంతానాన్ని అనుగ్రహించారు.
వెంకయ్య అనే భక్తుని ‘మాధారం’ వెళ్లిరమ్మంటే, మాదాపూర్ వెళ్ళాడు. వెంకయ్యను దొంగగా భావించి, ఆ ఊరివారు కొట్టారు.
ఆ దారినపోయే ఒక వ్యక్తి. వారిని వారించి వెంకయ్యను బస్సు ఎక్కించి పంపారు.
వెంకయ్య తిరిగి రాగానే “ఒరే బడుద్ధాయి, ఒక చోటుకి వెళ్ళమంటే, వేరే చోటుకుపోయావు గదా! నిన్ను రక్షించటానికి నేను ఎంతో కష్టపడవలసి వచ్చింది” అన్నారు ఆ శిష్యప్రేమమూర్తి.
నిరక్షరకుక్షి అయిన మల్లయ్యచే వేదాలు వల్లెవేయించారు బోధానందేంద్రులు. ఈ సంఘటన నరసింహ సరస్వతులను జ్ఞప్తికి తెస్తుంది.
బోధానందేంద్రుల బాల్య నామం వీరరాఘవుడు. పదకొండెండ్ల ప్రాయంలో దత్తావతారమైన శ్రీ వాసుదేవానందులు ఈ బాలుని అనుగ్రహించి, దత్త మంత్రాన్ని కాగితంపై వ్రాసి ఇచ్చారు.
ఇక ఆయన దత్త సాంప్రదాయ దీక్షా దీక్షుతులైనారు. శ్రీరామబ్రహ్మేంద్ర సరస్వతులనుండి దీక్షపొంది బోధానందేంద్ర సరస్వతులయ్యారు.
వాసుదేవానందులు స్వప్నసాక్షాత్కారమిచ్చి, మరాఠీ భాషలోని గురు చరిత్రను తెలుగులో అనువదింపమన్నారు.
సాక్షాత్తు వాసుదేవానందులే సమీపంలో కూర్చుని సూచనలిచ్చేవారు. వీరు నవనాథ సన్నిధి, గజానన విజయము మొదలైన వాటిని ఆంధ్రీకరించారు.
భారత భారతీ కంఠంలో ఓంకారఘంట, జ్ఞాన విజ్ఞానాల పంట అయిన ఏకనాథ భాగవతమును ఆంధ్రీకరించి, కృష్ణ తత్వాన్ని అనాయాసంగా తెలుగు వారిచే అనుభవింపచేసిన మహనీయుడు.
అది తెలుగు సరస్వతికి బోధానందేంద్రులు నిర్మించిన రమ్యహర్మ్యము. ఈయన ఏకనాథుని వలె జల సమాధి చెందారు. ఆ దినం ఫాల్గుణ (సాధారణంగా మార్చిలో వస్తుంది) బహుళ దశమి, 1997.
అవధూత శ్రీ బోధానందేంద్ర సరస్వతే నమః
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- అఘోరం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 29
- (అ) ద్వితీయుడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 16
- మందిరం కట్టు…. మహనీయులు – 2020… మార్చి 15
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments