మనసులోని కోరిక …. మహనీయులు – 2020… మార్చి 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా భక్తుడు దాసగణు. ఒక మకర సంక్రాంతినాడు పుణ్యనదీ స్నానం చేద్దామనుకొని, సాయిబాబాను అనుమతి అడిగాడు.

ఎక్కడికో పోనక్కరలేదని సాయిబాబా తన పాదములనుండి గంగా యమునలను ప్రవహింపచేశాడు.

రాంలాలా ప్రభువు సమయీ గ్రామంలో ఉండగా, ఆ గ్రామవాసులందరూ గంగాస్నాన నిమిత్తం వెళ్ళారు.

గులాబ్ సింహ్ మొదలైన నలుగురైదుగురు మాత్రం రాంలాలా ఆశ్రమంలోనే ఉండిపోయారు.

ఉదయం గులాబ్ సింహ్ ఊరివారంతా గంగా స్నానానికిపోయారని చెప్పాడు సద్గురులైన రాంలాలాతో.

గులాబ్ సింహ్ కు కూడా గంగా స్నానంపై కోరిక ఉంది. దానిని గ్రహించారు గురుదేవులు.

“హ! గులాబ్ సింహ్! మీరు, మేమూ మాత్రమే ఇక్కడున్నాము. భగవంతుడు మీ ఆర్తిని తీరుస్తాడు. మీరు వెళ్ళి బావిలో స్నానం చేసిరండి” అన్నారు గురువుగారు.

గులాబ్ సింహ్ ఇతరులు దిగుడు బావిలో కళ్ళుపెట్టారు. దిగుడు బావిగాని, ఆ పరిసరాలుకాని కనిపించలేదు వారికి.

గంగా స్నానం చేస్తున్న ఆ సమయి గ్రామ ప్రజలు గులాబ్ సింహ్ కు కనిపించారు. వారికీ ఆశ్చర్యం కలిగింది. మకరవాహిని గంగాదేవి దర్శనమిచ్చి “నాయనలారా! మీరు ధన్యులు” అని అదృశ్యమైంది.

వారు భక్తితో స్నానం చేసి బయటకు వచ్చారు. మరల ఆ దిగుడు బావి, పరిసరాలు కనిపించసాగాయి.

రాంలాలాకు యీ విషయం చెప్పాడు గులాబీ సింహ్. గురుపాదముల చెంతనే సమస్త తీర్దములుంటాయి. అది గ్రహించాలి శిష్యులు.

రాంలాలా మహాప్రభు మార్చి 21న 1888 సంవత్సరములో అమృతసర్ లో అవతరించారు.

అయన కొంతకాలం నాసిక్ లో ఉండి అక్కడే మహాసమాధి చెందారు. అయన యోగి. యోగి శక్తులు అద్భుతంగా ఉంటాయి.

అయన వేరొక దివ్య శరీరంతో అమృతసర్ లో కొంతకాలముండి, హరిద్వార్ లో మరల మహాసమాధి చెందారు.

అయన బోధించినది యోగ మార్గమైనా శిష్యులపై ప్రేమాభిమానాలతో భక్తిని కూడా ప్రోత్సహించారు రాంలాలా.

ఒకసారి ప్రయాగలో మేళా జరిగింది. అక్కడ ‘మైండూ’ అనే నావికుడు ఉండేవాడు.

అతడు సంసారాన్ని పోషించేందుకే నావికుడుగా పనిచేసే వాడు. ప్రతి దినం ధ్యానం చేసేవాడు.

మేళాకు వచ్చిన యోగులను దివ్య దృష్టితో వీక్షించసాగాడు. రాంలాలా మహాప్రభువు అయన దృష్టిని ఆకర్షించాడు.

అయన తన పడవలో ఎక్కితే చాలునని కోరుకున్నాడు. శబరి రాముని కోసం వేచి యున్నట్టు మైండూ రాంలాలా రాకకై వేచి చూస్తున్నాడు. ఎవరినీ తన నావలోనికి ఎక్కించుకునే వాడు కాదు.

రాంలాలా తన శిష్యులతో నావలో తిరిగివద్దామని బయలుదేరాడు. ఖరీదైన పడవలు, అందంగా ఆకర్షించే నావలు రాంలాలా శిష్యుల దృష్టిలో పడ్డాయి. వాటిని కాదని, పాత పడవైన మైండూ పడవలోనికి ఎక్కాడు. మైండూ పరవశించిపోయాడు.

నేడు మార్చి 21, రాంలాలా జయంతి. ఆ మహాయోగిని స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles