బాబా పేరుతొ మోసపోయినట్టు కదా ?బాబా కీ చెడ్డ పేరు తెచ్చినట్టు కదా?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

మొదట్లో పారాయణ ఎలా చదివాలో తెలియక గురుచరిత్ర ఏడు రోజులు చదివాను అని చెప్పాను కదా! ఆ టైం లోనే ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు, గుడిలో ధుని దగ్గర ఒక ఆంటీ ఏజ్ లో ఉండే ఒక స్త్రీ ,లాల్చీ పైజామా వేసుకుని చేతిలో సత్క లాంటింది పట్టుకుని, తలపై టోపీ పెట్టుకుని చాల ఆకర్షనీయంగా ఉంది.

పక్కన ఇద్దరు నా ఏజ్ అమ్మాయిలని కూర్చోపెట్టుకుని వాళ్లతో ఏదో మాట్లాడుతుంది.నేను వెళ్లేసరికి నన్ను కూడా కూర్చోమంది .సరే పెద్దామె కదా అని కూర్చున్నాను .

తన చేతిలో రెండు గాజులు ఉన్నాయ్.తాను మమ్మల్ని చూసుకుంటూ మీరు ఇలా గుడికి వచ్చారంటే మీకు అంతో ఇంతో భక్తి ,జ్ఞానం ఉండి ఉంటాయి.మీ భక్తికి నేనొక పరీక్ష పెడతాను.అందులో ఎవరు పాస్ అయితే వాళ్లకు ఈ గాజులు ఇస్తాను.ఇవి ఒక దేవత గుడిలో దేవతకి పెట్టిన గాజులు.సమాధానం చెప్పి ఈ గాజులు తీసుకోండి అని అంది.

నేను నాకున్నదే అంతంత భక్తి.ఈ ప్రశ్నలు ఏంటి ఇందులో. అనుకోని,సరేలే తాను ఏం అడుగుతుందో చూద్దాము తెలిస్తే బెటర్. తెలియకున్నా కూడా పరవాలేదు. ఇప్పటి వరకు తెలియంది తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కదా అనుకున్నాను.

తాను సరిగ్గా అదే అడిగింది.ఇప్పుడు మీ మనసులో ఏమి అనుకుంటున్నారో చెప్పండి అని.నేను నేను అనుకుంది చెప్పాను.వాళ్ళు వాళ్ళు అనుకుంది చెప్పారు .

తాను నవ్వుకుని సరే,ఇప్పుడు మీ జ్ఞానానికి సంబంధించి  అడుగుతాను ఇందులో కూడా నాకు నచ్చినట్టు చెప్పినవాళ్ళకి ఈ గాజులు అంది.మేము సరే అన్నాము.

మీ దగ్గర ఏమేమి ఉన్నాయో.మీరు ఏవేవి ఇవ్వగలరో అవి మొత్తం నాకు ఇచ్చేయండి అని అడిగింది.మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసివచ్చారు సో,వల్ల దగ్గర ఉన్న మనీ తలా ఒక పది రూపాయలు ఇస్తున్నారు.నేను గుడికి మనీ తీసుకెళ్లలేదు.మళ్లీ ఆలా తనకి మనీ ఇవ్వడం కూడా నచ్చలేదు.

ఒకవేళ బాబానే వచ్చి ఆలా మీ దగ్గర ఉన్నది.మీరు ఇవ్వగలిగింది ఇవ్వండి ఆంటే,నేను సంపాదించడం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న మనీ నా మనీ కాదు,కానప్పుడు నేను ఎలా ఇవ్వగలను?అని అలోచించి,మీరెవరో నాకు తెలియదు కానీ మీలో ఉన్న బాబాకి నమస్కరిస్తున్నాను అని అనుకుంటున్నాను.ఇప్పటికైతే నేను బాబా కీ ఇవ్వగలిగింది ఇదే అనుకున్నాను మనస్సులో.

తాను హ్యాపీ గా ఫీల్ ఐంది.నీ బుద్ధిబలంతో నను మెప్పించావు ఈ గాజులు నీకే అంది.ఒక శిష్యునికి ఉండవలసింది ఇదే,అని చెప్పి నాతో పాటు బాబా దర్శనం చేసుకుందువు రా అని తీసుకెళ్లింది.

దర్శనం అయ్యాక నేను వెళతాను ఆంటే లేదు నువ్వు నాతో ఉండు.నా శిష్శురాలిగా ఉంటాను ఆంటే ఈ గాజులు నీకు ఇస్తాను అంది.నాకు ఈమె చెయ్యాలో అర్ధం కాలేదు ఏంటి ఈమె ఇలా అంటుంది.

అప్పటికే గురుచరిత్ర చదివాను కదా అందులో శిష్యుడు గురువు ఈమె చెబితే అది చేయాలి అని ఉంటుంది.ఈమెకి నేను శిష్యురాలిని ఐతే ఇక ఈమె చెప్పినట్టే చెయ్యాలి.ఆమ్మో అమ్మవాళ్లకి ఇదంతా ఇష్టం ఉండదు అనుకుని,నేను ఇప్పుడు ఏమి చెప్పలేనండి అని చెప్పాను.

తాను పర్లేదు ఆలోచించుకో ఒక గంట సేపు టైం ఇస్తున్నా.గంట తరువాత ఇక నేను చెప్పినట్టే చేయాలి అని అంది.నేను మొహమాటం తో నో చెప్పలేక సరే అని ఆమెతో పాటు నడుస్తున్నాను.నేను ఆమెని గమనిస్తున్న తనేం చేస్తుంది?ఎం మాట్లాడుతుంది?బాబా కీ ఉండవలసిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని.కానీ అవేవి అనిపించలేదు.

తాను నాకు నచ్చలేదు.తనతో నాకు వేరే చిన్న పని ఉంది.నేను వెళ్ళాలి అని చెప్పి హాస్టల్ కీ వచ్చేసాను.

కానీ నాలో ఒకటే ఆలోచనలు,భయం.నేను అసలే హైదరాబాద్ కీ కొత్త . తనని చూస్తుంటే మాయమాటలు చెప్పి మోసంచేసేమెలా ఉంది.

నేనలా తాను చెప్పినట్టు వినగలను.?తాను నిజంగా గురువైతే,నేను ఏమైనా గురువు లాంటి ఆమెకి మళ్లీ వస్తాను అని అబద్దం చెప్పి వచ్చినట్టు అవుతుందా?నేను అబద్దం ఆడానా?మరి నేను అమ్మాయిని. ఎవరో చెప్పినమాటలు నమ్మి ఎలా మోసపోవాలి?

ఇప్పుడు తాను  నన్ను ఎటైనా తీసు కెళితే ,బాబా పేరుతొ మోసపోయినట్టు కదా ?బాబా కీ చెడ్డ పేరు తెచ్చినట్టు కదా?ఇన్ని ఆలోచనలతో సతమత మవుతున్నప్పుడు మా ఫ్రెండ్ ప్రియా రూమ్ కీ వస్తే జరిగింది చెప్పాను.

తాను నువ్వేం అబద్దం ఆడినట్టు కాదు.తాను రియల్ గా గురువు ఐతే మళ్లీ రేపు నీకు కనిపిస్తదిలే, కనిపించేలా బాబా చేస్తారు.తెలియక,అమాయకంగా ఆడిన అబద్దానికి బాబా ఏమి తప్పుగా అనుకోరు అని చెప్పింది.

అప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించింది.కానీ తరువాత రోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు ఆమె ఎక్కడ కనిపిస్తుందోని భయం తో తాను కనిపించొద్దు అని బాగా కోరుకున్నా.

మళ్లీ తాను నాకెప్పుడూ కనిపించలేదు.ఒక 5 ,6 సంవత్సరాలకీ శరత్ బాబూజీ గారు పరిచయం అయ్యాక,ఒకరోజు బాబాకి అలంకారం చేస్తున్నప్పుడు గుడికి వచ్చింది.అప్పుడు తనని చూడగానే ప్లాష్ బ్యాక్ గుర్తొచ్చి నవ్వొచ్చింది.

అప్పటికే గురువుగారు పరిచయం అయ్యారు కనుక.అసలు నిజమైన గురువు ఎలా ఉంటాడు ఎలా మాట్లాడుతారు.యెంత వినయంగా ఉంటారు.కపట గురువులు ఎలా ఉంటారుఅని గుర్తొచ్చింది.

నిజమైన గురువు అసలు ఏమి మాట్లాడకుండానే శిష్యుని అంతరంగాన్ని కనిపెట్టి వారిలో మార్పు తెస్తారు.వారికీ మాట్లాడే అవసరమే ఉండదు కేవలం ఒక చూపు చాలు.అనిపించింది. నేను ఆమె మాటలకి ప్రభావితం కాలేదు కానీ,ఆలా కపట గురువుల మాటలు నమ్మి మోసపోయేవాళ్లు కూడా ఉంటారు కదా.అఫ్ కోర్స్ బాబా రక్షణలో ఉన్న మనకి అలాంటి పరిస్థితి ఎప్పటికి రాదు.

తరువాతి భాగం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా పేరుతొ మోసపోయినట్టు కదా ?బాబా కీ చెడ్డ పేరు తెచ్చినట్టు కదా?

సాయినాథుని ప్రణతి

All are very nice experiences .Really ur very lucky .మి అనుభవాలు చదువుతుంటె హ్యపిగా వుంటుంది

kishore Babu

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles