Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు సుహాసిని, మేము హైదరాబాద్ వనస్థలిపురం లో వుంటాము, నేను ఒక సామాన్యమైన గృహిణిని.
మేము మా నాన్న గారికి ఆరుగురం సంతానం, అందులో నేను చిన్నదాన్ని, ఆఖరుదాన్ని.
నా చిన్నప్పుడు నేను అసలు దేవుడిని నమ్మే దానిని కాను దేవుడేమిటి, ఈ కులాలేమిటి మతా లేంటి? ఇంత మంది దేవుళ్ళేంటి? అన్ని కులా లేంటి? అనుకుంటూండే దాన్ని.
ఆ సమయంలో నేను అప్పుడు 10 th క్లాస్ చదువుతున్నాను, అనుకోకుండా ఒక రోజు దిల్ షుఖ్ నగర్ ”సాయిబాబా” గుడి మీదుగా వస్తున్నాను.
ఆ గుడి గోడలపైన స్వస్తిక్, ముస్లిం ల గుర్తు, క్రిస్టియన్ ప్లస్ అవి కనపడ్డాయి నాకు ఆశ్చర్యం వేసింది.
ఈ మూడు గుర్తులున్న దేవుడా ఈయన, దేవుడంటే ఈయనే, సర్వమతాలను పెట్టుకున్నాడు, అని అనుకుంటూ నేను గుడిలోకి అడుగుపెట్టాను.
లోపల గోడల మీద వున్న బోర్డు పైన వున్న, ”ఏకాదశ సూత్రాలు” చదివాను.
ఓహో! బాబాని చూసి ఇవన్నీ నిజమే! సరే అయితే, మరి నేను నిన్ను నమ్మాలంటే నేను ఇప్పుడు మనసులో ఒకటి కోరుకుంటాను, అది నేను ఎవరికీ చెప్పను, నువ్వు ఆ కోరిక నెరవేరిస్తే నేను నిన్ను నమ్ముతాను,
అదేంటంటే నా పళ్ళు కొంచెం ఎత్తుగా ఉంటాయి వాటి పై క్లిప్ వేయించాలి అప్పట్లో డెంటల్ హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నట్లు లేవు. అది 1990 సంవత్సరం.
అప్పట్లో అసలు ఉండేవి కావు, ఇలా క్లిపు వేయాలంటే హాస్పిటల్ కి తల్లి తండ్రులు వచ్చి సంతకాలు చేయాలి.
అప్పుడు క్లిప్ వేసేవారు, అలా వేసే క్లినిక్స్ ఎక్కడో ఒకటి మాత్రమే ఉండేది.
మా నాన్న గారు పోలీస్ ఇన్స్ పెక్టర్ ఆయనకి అసలు ఇలాంటివి ఇష్టం వుండేవి కావు. ఆయన అసలు సంతకం పెట్టటానికి రాడు, అమ్మ వప్పుకోదు.
ఇంక నాకు సంతకం పెట్టి ఎవరు వేయిస్తారు. ఇది జరగదు కదా ”మరి నువ్వు దేవుడి వైతే ఇది జరిపించు” అనుకున్నాను,
మా మేనత్త కూతురు ఈ ఊర్లోనే వుంది. నేను ఆమె స్నేహంగా ఉండేవాళ్ళం.
మా మేనత్త కుటుంబం వాళ్ళు, తహసీల్దార్ గారు, ACP అందరూ ఫామిలీ ఫ్రెండ్స్. ఒక రోజు ఆమె మా ఇంటికి వచ్చింది.
నువ్వు పళ్ళకి క్లిప్ వేయించుకోవాలనుకుంటున్నావు కదా పద అంటూ నన్ను ఒక చోటుకి తీసుకు వెళ్ళింది.
అక్కడ ఇండియన్ మెడికల్ సైన్స్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాము.
మా మేనత్త కూతురు ఆయన్ని కూడా మామా అని పిలిచేది, ఆయనికీ నన్ను చూపిస్తూ ఇది మా మేనమామ కూతురు పళ్ళకి క్లిప్ వేయించుకోవాలనుకుంది కానీ సంతకాలు చేయాలిట వాళ్ళ నాన్న రాడు దానికి ఆయన సంతకం చేయడు అంది.
”ఏంటమ్మా వాళ్ళ నాన్న దాక ఎందుకు నేను లేను, నేను పెడతాను సంతకం ” అంటూ ఆయన అంతట ఆయన లేచి వస్తున్నాడు.
ముందు మేము నడుస్తున్నాము మాతో పాటు భాస్కర్ రెడ్డి గారు మా వెనకాల 100 మంది డాక్టర్స్ ఆయన్ని ఫాలో అవుతున్నారు.
మమ్మల్ని డెంటల్ డాక్టర్ దగ్గర కి తీసుకుకెళ్ళారు. ఈయన్ని చూస్తూనే ఆ డాక్టర్ వణికి పోతూ ”మీరు వచ్చారేంటి సర్, పిలిస్తే నేనే వచ్చేవాడినిగా” అన్నాడు.
”ఏం లేదు ఈ అమ్మాయికి క్లిప్ వెయ్యలట” అన్నాడు. దానికి అక్కడ డాక్టర్ ”సంతకం మీరు ఎందుకు సార్ నేనే పెడతాను సార్!” అంటూ ఆయనే పేపర్స్ మీద సంతకం చేసేసాడు,
ఆయన అసలు ఎవరు చెప్పినా వినడు రూల్ అంటే రూల్ అంటాడు, అంతే క్లిప్ నాకు వేసేసారు
అసలు ఎటువంటి పరిస్థులలోను జరిగే అవకాశం లేని విషయాన్ని ఎంత గ్రేట్ గా చేయించాడాయన
అవును బాబాదే ఈ గ్రేట్ అంతా అని ఆ వయసులోనే నాకు అనిపించి ఏడుపు వచ్చింది. బాబాకు మనసులోనే దండం పెట్టుకున్నాను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా పేరుతొ మోసపోయినట్టు కదా ?బాబా కీ చెడ్డ పేరు తెచ్చినట్టు కదా?
- తన భక్తురాలి తోబుట్టువును ప్రాణాపాయం నుండి తప్పించిన బాబా వారు
- కష్టాలలో ఉన్న మాకు రతన్ బాబా గారి ద్వారా అభయం ఇప్పించిన బాబా వారు.
- “వాడు నన్ను నమ్ముకొని షిరిడికి వచ్చాడు. మీకు నేను చాలా డబ్బులు ఇచ్చాను కదా! డబ్బు కోసం అతన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు.”
- భక్తుని యొక్క ఉద్యోగ విరమణ వయస్సును 10 సంవత్సరములు పొడిగించిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments