Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ప్రతి మతానికి పవిత్ర గ్రంథం ఉంటుంది. అలాగే సిక్కు మతానికి గురుగ్రంథ సాహెబ్ పవిత్ర గ్రంథం. ఆ గ్రంథం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది.
ఆ గ్రంథం ఏ ఒక్క గురువు యొక్క జీవిత చరిత్ర కాదు. సాయి సచ్చరిత్ర సాయిబాబాను గూర్చి, గురు చరిత్ర శ్రీపాదవల్లభ, నృసింహుల జీవిత గాధలను తెలుపుతుంది.
గురుగ్రంథం కేవలం పవిత్ర పారాయణ గ్రంథమే కాదు. అది సాక్షాతూ గ్రంథ రూపంలో ఉన్న గురువు. సిక్కుల గురు పరంపరలో 11వ గురువు గ్రంథ రూపంలో ఉన్నాడు.
1430 పుటలున్న ఈ గ్రంథరాజంలో 31 అధ్యాయాలలో కవితా ధోరణిలో సంగీతం వినిపిస్తుంది. ఇది ఏక్ ఓంకార్ అనే శబ్దంతో ఆరంభమవుతుంది.
ఇందులో ఆరుగురు సిక్కు గురువుల బోధనలతో, ప్రార్థనలతో, ఆదేశాలతోపాటు, 36 మంది హిందూ, మహమ్మదీయ మతాలలోని సత్పురుషుల శబ్దములు చోటు చేసుకున్నాయి.
ఇవి గురుముఖి లిపిలో ఉన్నాయి. షేక్ ఫరీద్, కబీర్, రవిదాస్, నామదేవ్ మొదలైన వారి ప్రార్థనలు కొన్ని చేర్చబడి ఉన్నాయి.
ఈ గ్రంథం గురువే కాదు.
సందేహాలను తీరుస్తుంది, బాధలను నివారిస్తుంది, ప్రశాంతత చేకూరుస్తుంది. భగవంతుని ఉనికిని మనసుకు చూపుతుంది.
వాసు భరద్వాజ అనే వ్యక్తి ఒక గుజరాతీ దిన పత్రిక ప్రత్యేక విలేఖరి. అమెరికాలో చదువు, శాస్తజ్ఞులతో పరిచయంతో దేవుని ప్రసక్తి ఈయన జీవితం నుండి తప్పుకున్నది.
దేవుని ప్రసక్తియె కాదు, దేవుని ఉనికియే ప్రశ్నార్థకమైంది ఈయన దృష్టిలో. ఈయనకు శారీరక వ్యాధి ఒకటి వచ్చింది.
భారత దేశంలోని ప్రఖ్యాత వైద్య నిపుణులు ఈయనకు రాచ కురుపు ఉందని, వ్యాధి కండరాలను తినివేస్తోందని, ఈ జీవితం కొద్ది రోజులు మాత్రమేనని ఘంటాపథంగా చెప్పారు.
ఆకలి చచ్చిపోయింది. తినలేక పోతున్నాడు. ఈయనకు కొందరు సిక్కులు అమృతసర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించి, ప్రార్థనలు చేసి, గురుగ్రంధ్ సాహెబ్ ముందు ప్రార్ధించి, సేవించాలని చెప్పారు.
ఆయన కాలు కదపలేని స్థితిలో ఉన్నాడు. ఆయన తన కుటుంబంతో 48 గంటలసేపు నిరవధికంగా సాగే అఖండ గురుగ్రంథ పారాయణలో పాల్గొన్నాడు. ఊహించని రీతిలో ఆయన స్వస్తుడవసాగాడు.
సాయి సచ్చరిత్ర పారాయణ, గురు చరిత్ర పారాయణ ఫలములు అందరుకూ తెలిసిన విషయమే.
నేడు అక్టోబర్ 20. గురుగ్రంథ సాహెబ్ గురుత్వాన్ని పొందిన దినం.
నేటి నుండి గురుగ్రంథ సాహెబ్ లోని కొన్ని బాణీలను వినుటను అలవాటు చేసుకొనెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- మట్టి బొమ్మలను మహారణానికి …. మహనీయులు – 2020… అక్టోబరు 21
- రాముడైన ….రహిమైన ….దేవుడొక్కడే …. మహనీయులు – 2020… అక్టోబరు 1
- తీయని బాధ .. …. మహనీయులు – 2020… అక్టోబరు 4
- కఠిన సాధన…. మహనీయులు – 2020… మే 7
- చెప్పవద్దు…. మహనీయులు – 2020… అక్టోబరు 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments