Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘సరే’నన్నాడు దాసగణు. అన్నాడే కాని ఉద్యోగాన్ని మానలేదతను. ఇంతలో ఓ పెద్ద బందిపోటును వెతికి పట్టుకోవాల్సి వచ్చింది.
పై అధికారులు ఆ బాధ్యతను దాసగ ణుకి అప్పజెప్పారు. ఆ పని మీద నలుగురైదుగురు సహోద్యోగులతో ఓ రోజు అడవి మార్గంలో ప్రయాణించసాగాడతను.
ఆ ప్రయాణంలో దారి తప్పాడు. ఒంటరివాడయిపోయాడు. అప్పుడు, ఏ బందిపోటునయితే తను పట్టుకోవాలో అదే బందిపోటుకి దాసగణు చిక్కిపోయాడు.
బంధించారతన్ని. చంపేందుకు సిద్ధమయ్యారు.ఉద్యోగం మానేయమని, బాబా చెబుతూనే ఉన్నారు. విన్నాడు కాదు. ప్రాణాలు పణం పెట్టాల్సి వస్తోందిప్పుడు అనుకున్నాడు దాసగణు.
కళ్ళు మూసుకున్నాడు. కాపాడమని బాబాని ప్రార్థించాడు. ప్రాణభిక్ష పెట్టమని అర్థించాడు. ఇంతలో ఎవరో మీద పడుతున్నట్టనిపిస్తే కళ్ళు తెరిచి చూశాడు. బందిపోటు! కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు.
చేతిలో ఉన్న కత్తినీ, దాసగణునీ ఒకటికి రెండు సార్లు చూశాడు బందిపోటు. చంపుదామా? వద్దా? మీమాంసలో పడ్డాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో! చేతిలోని కత్తితో దాసగణు కట్లు తెగ నరికాడు బందిపోటు.
‘‘పో! పో ఇక్కణ్ణుంచి.’’ అన్నాడు.నమస్కరించి, పరుగుదీశాడు దాసగణు. వెనక్కి తిరిగి చూడలేదు.చాలా దూరం వచ్చాడు. వచ్చి, అక్కడున్న చెట్టుకి చేరబడ్డాడు. ఆయాసం తీర్చుకున్నాడు. ఆలోచనలో పడ్డాడు.
చంపుదామని కత్తితో వచ్చిన బందిపోటు తనని ఎందుకు చంపలేదు. దయ తలచి వదిలిపెట్టాడెందుకు? ఏమయింది?
ఇనుప గుండె ఎలా మెత్తబడింది? కఠినశిల ఎలా కరిగింది?అంతా బాబా కృప అనుకున్నాడు దాసగణు.
తన ప్రాణాల్ని బాబానే కాపాడాడని గట్టి నమ్మకానికి వచ్చాడతను. మనసులో బాబాకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుని, కదిలాడు అక్కణ్ణుంచి. రెండు రోజుల్లో ద్వారకామాయికి చేరుకున్నాడు.
‘‘క్షేమంగా ఉన్నావు కదా, కావాల్సింది అదే’’ అన్నారు బాబా, దాసగణుని చూస్తూనే.‘‘నీకా ఉద్యోగం వద్దు! ప్రాణానికే ప్రమాదం. నా మాట విను. రాజీనామా చేసేయ్.’’ చెప్పారు మళ్ళీ.
‘‘అలాగే బాబా! నువ్వు చెప్పినట్టే చేస్తాను.’’ అన్నాడు దాసగణు.‘‘తర్వాతేం చేస్తాడు?’’ అడిగాడు శ్యామా. బాబానే ప్రశ్నించాడతను.
నిక్షేపంలాంటి ఉద్యోగాన్ని వదలుకోమని చెబితే రేపేం కావాలి దాసగణు? బతకడం ఎలా? శ్యామాకెందుకో ఆ సలహా నచ్చలేదు. అందుకే అడిగాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- ‘‘నీకిష్టమే! కాని, నిన్ను అంత దూరం పంపించడం నాకిష్టం లేదు.’’
- ‘‘మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నాకు విఠలుణ్ణి చూపించారు”.
- వామన్ శశి ఇస్లాంపూర్ కర్…..సాయి@366 జూన్ 3….Audio
- సత్య ఆచరణ …. మహనీయులు – 2020… మే 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “‘‘క్షేమంగా ఉన్నావు కదా, కావాల్సింది అదే’’”
Prathibha sainathuni
January 28, 2017 at 11:30 amSaibaba saibaba saibaba…
Naku kuda job vishayam lo dasaganu gurtuku vastaru..baba yenta cheppina dasaganu job ni maneyaru. Alage nenu kuda baba yenta cheppina baba ni job adagadam maanaledu.☺
Saibaba saibaba saibaba