సత్య ఆచరణ …. మహనీయులు – 2020… మే 13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా జీవితమే ఆదర్శం. అదీకాక అయన భక్తుల జీవితాలు కూడా ఆదర్శవంతంగా ఉంటాయి.

జైనమతంలో ఆచార్య దేవేంద్రసూరి పేరెన్నికగన్న మహనీయుడు. భీంజీ సంఘపతి కాంబేలో ప్రముఖ వ్యాపారస్తుడు.

భీంజీ ఆచార్యుల వద్దకు వెళ్ళి “నేను ఏరకమైన ప్రవర్తన కలిగి ఉంటె భగవంతుని కృపను పొందగలుగుతాను?” అని ప్రశ్నించాడు.

ఆచార్య దేవేంద్రసూరి “అసత్యమును ఎట్టి పరిస్థితుల్లో పలకనని ప్రతిజ్ఞ తీసుకో. నీవు సంతోషంగా ఉండగలుగుతావు” అన్నారు భీంజీ సంఘపతితో. భీంజీ సత్య వ్రతాన్నే పాటించదలచుకున్నాడు.

ఒకసారి భీంజీ వ్యాపార నిమిత్తం అడవి దారిలో పయనిస్తున్నాడు. బందిపోటు నాయకుడు పల్లిపతిభిల భీంజీని అడ్డగించి, బందీగా చేసుకున్నాడు.

తన నివాసానికి తీసుకుపోయాడు బందీగా. పల్లిపతి “నీ ఇంటి దగ్గర ఎంత ధనం ఉంది?” అని అడిగాడు.

భీంజీ నాలుగు వేల నాణెలున్నాయి అని సత్యం చెప్పాడు.

బందిపోటు దొంగల నాయకుడు భీంజీ కుమారునికి వర్తమానం పంపాడు. “నీ తండ్రి నా వద్ద బందీగా ఉన్నాడు. నాలుగు వేల నాణెములను పంపినట్లయితే నీ తండ్రిని విడిచిపెడతాను” అని.

భీంజీ కుమారుడు ఆలోచించాడు. అక్కడ తండ్రి ప్రాణం, ఇక్కడ నాలుగు వేల నాణెములు. ఆ వర్తకుని కుమారుడు నాలుగు వేల నాణెములను పంపాడు గజదొంగకు.

ఆ నాణెములను స్వీకరించిన ఆ దొంగకు ఏదో అనుమానం వచ్చింది.

అవి నిజమైన నాణెములా? కాదా? అని. ఐతే ఎవరు తన సందేహాన్ని తీర్చగలరు? అని ఆ దొంగ కొంతసేపు ఆలోచించాడు.

చివరకు బందీగా ఉన్న భీంజీనే అడిగాడు “ఇవి నిజమైన నాణెములా? కాదా?” అని.

ఆ వర్తకుడు ఆ నాణెములను పరీక్షించి “ఇవి నిజమైనవి కావు” అన్నాడు. అలా భీంజీ చెప్పగానే ఆ గజదొంగ నిర్ఘాంతపోయాడు.

“ఎంత సత్యంగా మాట్లాడాడు” అని భీంజీ నిజాయితీని శ్లాఘించాడు.

ఇంతటి సత్యవ్రతునికి అపకారం చేయటం నేరమవుతుందని భావించి, భీంజీని వెంటనే విడిచిపెట్టాడు. దేవేంద్రసూరికి ఇచ్చిన వాగ్దాన ఫలితం ఇది.

ఆచార్య దేవేంద్రసూరి 1271లో దేహాన్ని విడిచాడు.

ఇంకా ఆయన శిష్యుడైన విద్యానందసూరి కూడ ఆరు, నెలలో దేహాన్ని విడిచాడు.

రెక్కలు తెగిన పక్షిలా విల విలలాడాడు భీంజీ. ఏకంగా 12 ఏండ్లు ఉపవసించాడు.

ఈ సంఘటన తేదీ వివరాలు తెలియకపోయినా, జైన సాంప్రదాయంలో (మతంలో) తనకంటు ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు భీంజీ సంఘపతి, గృహస్తుగా ఉంటూకూడా.

భీంజీని అనుసరించుదాం. సత్యవ్రతాన్ని పాటించుదాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles