‘‘మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నాకు విఠలుణ్ణి చూపించారు”.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

క్షణాల్లో ఏకాగ్రతను తన సొంతం చేసుకున్న సహస్రబుద్ధిని చూసి ఆశ్చర్యపోయాడు శ్యామా.తెల్లారుతోంది. రాత్రి అవుతోంది. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఎవరి పనుల్లో వారు ఉన్నా అంతా సహస్రబుద్ధిని గమనిస్తున్నారు.

అన్నపానాల్లేవు. నిద్ర లేదు. ఒకటే ధ్యానం అతనికి.పాండురంగ విఠలా! పండరినాథ విఠలా!షిరిడి ఆ నామామృతంతో తరించిపోయింది. వారం ఇట్టే గడిచిపోయింది.‘‘దాసగణు’’ అని తనని ఎవరో పిలుస్తున్నట్టనిపించింది సహస్రబుద్ధికి.

మెల్లగా కళ్ళు తెరవబోయాడు. భరించలేనంత వెలుగు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. వెంటనే కళ్ళు మూసుకున్నాడు.

‘‘దాసగణు’’ మళ్ళీ పిలిచారెవరో. తల మీద చేయి ఉంచి, నిమిరారెవరో. తర్వాత కళ్ళ మీద చల్లగా చేతుల్ని ఉంచిన స్పర్శ. మళ్ళీ కళ్ళు మెల్లగా తెరచి చూశాడు సహస్రబుద్ధి.విఠలుడు! పాండురంగ విఠలుడు కొలువుదీరి కనిపించాడు.

సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు సహస్రబుద్ధి. ఆనందబాష్పాలతో చేతులు జోడించాడు.‘‘దేవాదిదేవా! వాసుదేవా! పండరినాథా! పాండురంగా! విఠలా’’ అంటూ సాష్టాంగ పడ్డాడు. లేచి చూస్తే ఇందాక విఠలుడు కనిపించిన స్థానంలో బాబా నవ్వుతూ కనిపించారు.

ఇప్పుడక్కడ విఠలుడు లేరు. బాబా ఉన్నారు. అంటే విఠలుడే బాబా! బాబాయే విఠలుడు అనుకున్నాడు సహస్రబుద్ధి. బాబా పాదాల్ని ఆశ్రయించాడు.

‘‘మీ మాట మీరు నిలబెట్టుకున్నావు. నాకు విఠలుణ్ణి చూపించారు. నా మాట కూడా నేను నిలబెట్టుకుంటాను”.

నేనిక మీ పాదాలు వదలను. ఇక్కణ్ణుంచీ కదలను. మీ సేవే నా జీవితం. నన్ను కరుణించు బాబా, కరుణించు.’’ అన్నాడు సహస్రబుద్ధి.

‘‘దాసగణూ’’ అన్నారు బాబా. అతని నుదుటన ముద్దు పెట్టారు. విఠలుడికి, విఠలుడులాంటి బాబాకి దాసులయిన వారిలో గణుతికెక్కాడు సహస్రబుద్ధి. అందుకే అతన్ని అలా పిలిచారు బాబా.

ఆనాటి నుంచి సహస్రబుద్ధిని అంతా ‘దాసగణు’ అని వ్యవహరించసాగారు. అలా పిలిస్తేనే అతను కూడా పలికేవాడు.

పోలీసుశాఖలో పని చేసేవాడు దాసగణు. వృత్తిరీత్యా అతను చాలా ప్రాంతాలు తిరగాల్సి వచ్చేది.

పని ఒత్తిడిని తట్టుకుంటూనే తరుచూ షిరిడీ చేరుకునేవాడతను. అలసిపోతుండేవాడు.

నిస్త్రాణంగా ద్వారకామాయికి చేరుకుంటున్న దాసగణుని చాలాసార్లు గమనించి, ఒకనాడు ఇలా అన్నారు బాబా.

‘‘దాసగణూ! నువ్వు ఉద్యోగం మానేయ్‌! ఉద్యోగం మానేయడం నీకూ, నీ ఆరోగ్యానికీ మంచిది.’’

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “‘‘మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నాకు విఠలుణ్ణి చూపించారు”.

prathibha sainathuni

saibaba saibaba saibaba saibaba…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles