Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
రఘువీర పురంధరే ముంబాయి నివాసి. భార్య, బిడ్డ, తల్లితో ఉంటున్నాడు. గుమాస్తాగా పని చేస్తున్నాడక్కడ. తరతరాలుగా ఆ కుటుంబం పాండురంగడి భక్తులు.
పండరీపురం వెళ్ళి, పాండురంగణ్ణి దర్శించుకుని రావడం వారి వంశాచారం. అయితే పేదరికం కారణంగా ఇంత వరకూ పండరీపురం వెళ్ళలేకపోయారు. ఓ చిన్న పాండురంగడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని, దాన్నే పూజిస్తూ వస్తున్నారు.
దైవదర్శనం ప్రసాదించమని ప్రార్థించని రోజు లేదు పురంధరే. కాని అతని కోరిక తీరడం లేదు.
ఒకనాడు దాసగణు చెప్పిన హరికథ విన్నాడతను. బాబాని గురించిన కథ, బాబా మహిమలను గురించిన చిత్ర విచిత్రాలు హరికథగా విని పులకించిపోయాడు పురంధరే. ఎలాగయినా బాబాని దర్శించుకోవాలనుకున్నాడు.
‘‘ముందు విఠలుణ్ణి చూద్దాం రా’’ అంది తల్లి.‘‘కాదు, ముందు బాబాని చూద్దాం. విఠలుణ్ణి ఆయనే చూపిస్తాడు.’’ అన్నాడు పురంధరే.
బాబా అనుమతి లభించిందతనికి. పురంధరే పైసా పైసా కూడబెడుతూ వచ్చాడు. కొన్నాళ్ళకు ఆ డబ్బు షిరిడీ ప్రయాణానికి సరిపోయేంతగా కూడింది. ఆలస్యం చెయ్యలేదతను. తల్లినీ, భార్యనీ బిడ్డనీ తీసుకుని, బయల్దేరాడు. షిరిడీకి చేరుకున్నాడు.
ద్వారకామాయి మెట్లెక్కసాగారంతా.పవిత్ర పుణ్యక్షేత్రంగా పేర్కొంటున్న షిరిడీలో ఆ పవిత్రత ఎక్కడా కనిపించలేదు పురేంధరే తల్లికి. ద్వారకామాయి అంటే గుడి అనుకుందామె. చూస్తే మసీదు. ఈ మసీదులో ఓ మామూలు మనిషిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాల్సి వచ్చింది.
కుర్రనాగన్న పైసా పైసా కూడబెట్టాడు. కడుపు నిండా తిన్నది లేదు. పూట పూటకూ రెండు ముద్దలు తగ్గించుకుంటూ వచ్చాడు. ఆకలిని దాచుకున్నాడు. డబ్బు చేశాడు దాన్ని. ఆ డబ్బుని ఇలా వృధా చేశాడేమో అనిపించిందామెకు.
‘‘ఈ డబ్బుతో పండరీపురానికి వెళ్తే విఠలుణ్ణి చూసుకునేవాళ్ళం. ఇక్కడికి తీసుకొచ్చావు. ఏంటో ఖర్మ’’ అంది. కొడుకు భుజాన్ని పట్టుకుని ఆఖరి మెట్టుకి చేరుకుంది. తలెత్తి చూసింది. ఎదురుగా ఆసనం మీద బాబా కూర్చుని కనిపించారామెకు. ఆయన్ని చూడగానే ఆ తల్లిలో అసహనం, అసంతృప్తి మాయమయ్యాయి.
ఏదో తెలియని ఆనందం చోటు చేసుకుంది. ఆ దివ్యమంగళ స్వరూపానికి చేతులు జోడించాలనిపించింది. జోడించింది. అంతే! ఆసనం మీద బాబా కనిపించలేదిప్పుడు. వారి కులదైవం పాండురంగ విఠలుడు కనిపించసాగాడు.
‘‘రంగా! పాండురంగా’’ అంటూ పరుగులు తీసిందామె. పురంధరేకి, అతని భార్యకి, బిడ్డకి కూడా పాండురంగ విఠలుని రూపంలోనే బాబా దర్శనం ఇచ్చారు.
ఆ కుటుంబం బాబా పాదాల మీద మోకరిల్లింది. భజనగీతాల్ని ఆలపించింది. తనివి తీరా విఠలుణ్ణి దర్శించుకున్నామని వారికి అనిపించిన మరుక్షణం, బాబా కొలువుదీరారక్కడ. నవ్వుతూ అన్నారిలా.‘‘షిరిడీయే పండరీపురం. నేనే విఠలుణ్ణి. నన్ను దర్శించుకుంటే మీరు విఠలుణ్ణి దర్శించుకున్నట్టే!
’’పురంధరే ఆనందానికి అంతులేకుండాపోయింది. కళ్ళెదుట కులదైవం బాబా రూపంలో ఉన్నాడని తెలుసుకుని, పడి పడి నమస్కరించాడతను. ఆనాటి నుంచి బాబా సేవకుల్లో తానూ ఒకడయ్యాడు.
దేవుళ్ళ రూపాల్లోనే కాదు, పశుపక్ష్యాది రూపాల్లో కూడా బాబా దర్శనం కలుగజేసేవారు. అన్నిటా తానేనని నిరూపించేవారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- ‘‘మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నాకు విఠలుణ్ణి చూపించారు”.
- నీ రాధాకృష్ణుణ్ణి నేనే! నేనే నిన్నిక్కడకి రమ్మన్నాను. సేవించుకుంటావో, సాధిస్తావో అంతా నీ ఇష్టం.’’
- ‘‘సద్గుణానికీ దాసగుణానికీ దేవుడు లొంగిపోతాడు.
- సస్పెన్షన్ లో ఉన్న 10 రోజులు బాబా సేవ లో గడిపిన భక్తునికి, తిరిగి ఉధ్యోగాన్ని ప్రసాదించిన బాబా వారు
- అంతర్యామి, హేమాడ్ పంత్—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments