Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా — గొప్ప వైద్య నిపుణుడు
ఈ రోజు ఇస్తున్న బాబా లీల సాయిలీల సంచికలో మే 1984 లో ప్రచురింపబడింది. జె.ఆర్. లారోయీ, నోయిడా నించి వ్రాసినది.
షిరిడిలో ఎవరయితే కాలు మోపుతారో వారి బాధలన్నీ పటాపంచలవుతాయి. అన్న బాబా వాక్కు మాకు ఈమధ్యనే అనుభవంలోకి వచ్చింది.
పాఠకులారా, నా భార్య చాలా సంవత్సరాల నుండి, గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. అది మామూలుగా దగ్గు, జలుబుతో మొదలై, ఎన్ని మందులు వాడినా నయం కాకపోగా రోజు రోజుకీ యెక్కువ కాసాగింది. నేను ఇండొర్ లోని సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసులో పే & ఎక్కౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న కాలంలో చాలామంది వైద్యులను సంప్రదించడం జరిగింది. కాని ఏమీ లాభం లేకపోయింది.
ఆ సమయంలో ఆమె సరిగా యేమీ తినడం, తాగడం చేయలేకపోయేది. అనేకమంది వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ చాలా పదార్థాలు తినడం తగ్గించింది.
ఈమధ్యనే షిరిడీలో ప్రతిసంవత్సరం జరిగే రచయితల సభకి ఆహ్వానం అందింది. ఆమె ఆరొగ్య పరిస్థితి వల్ల మేము వెళ్ళడమా, మానడమా అని సందేహంలో పడ్డాము. బాబా గారు సందేశం ఇచ్చారా అన్నట్లుగా, నా భార్య తనకు అంత గొంతు బాధ ఉన్నప్పటికీ షిరిడీ వెళదామని పట్టు పట్టింది. మేము షిరిడీ చేరుకోగానే బాబా ని దర్శించుకుని ఆయన చరణ కమలాలముందు నిలబడి, తనకు ఎంతో కాలంనుండి వున్న వ్యాధిని తొలగించమని ప్రార్థించింది.
పాఠకులారా, రచయితల సమ్మేళనం అవగానే మేము షిరిడీ వదలి వెళ్ళే ముందు నాభార్యకి గొంతులో ఏవిధమైన నొప్పి లేదు. ఇది అప్పుడు కొంతసేపు తాత్కాలిక ఉపశమనం అనే ఉద్దేశ్యంతో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు చాలా రోజులు గడచిన తరువాత చెపుతున్నాము, ఆమె గొంతు బాధ పూర్తిగా నయమయింది. అంతే కాదు, గొంతునొప్పి వల్ల ఏ పదార్థాలయితే వదలి వేసిందొ అవన్నీ కూడా మరలా తీసుకోవడం మొదలుపెట్టింది.
ఇదంతా కూడా బాబా గారు చేసిన వైద్యం కాక మరేమిటి?
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా సమీపంలో, ఆ పరిసరాలలో(శిరిడి) ఉండటమే గొప్ప యోగం
- కాకాజీ వైద్య
- నేను గొప్ప భక్తుడని అనే అహంకారము నాలో రాకుండా ఉంటేనే తగ్గించండి
- అందరి కంటే గొప్ప వైద్యుడైన శ్రీ సాయికి సాధ్యం కానిది ఏముంది?
- బాబా సచ్చరిత్ర పారాయణ వల్ల తమ్ముడు తమ్ముడి జాడ తెలిసింది-4
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments