Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
మనందరికీ శిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే
ఒక్కొక్కప్పుడు గ్రామంలోని వర్తకులు, నూనె వ్యాపారులు తమ నెంతగానో బాధించారని చెప్పి శిరిడీ విడిచి వెళ్ళిపోతానని, కోపంగా సాయి బయల్దేరేవారు. ఒకసారి ఆయన అలానే కోపగించుకొని ఎవరికీ చెప్పకుండా ఎక్కడకో వెళ్ళిపోయారు. సాయి శిరిడీలో కన్పించడంలేదని భక్తులందరూ ఆందోళనగా చెప్పుకోసాగారు.
ఆ వార్త ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్న మహల్పాపతికి చేరింది. అతడు వెంటనే వచ్చి గ్రామంలో విచారించగా, సాయి రహటాకుగాని, నీమ్ గాంవ్ కు గాని వెళ్ళలేదని, ఆయన గ్రామం విడిచి వెళ్ళే ముందు తీవ్రమైన కోపావేశంలో వున్నారనీ కొందరు గ్రామస్థులు చెప్పారు. ఆయన లెండీ నుండి నీమ్ గాంవ్ వైపుకు బయల్దేరడం మాత్రం చూచామని ఎవరో చెప్పారు.
వెంటనే అతడికి ఆయన శిరిడీలో మొదటిసారి ప్రకటమైన కొద్ది కాలానికి ఎవరికీ తెలియకుండా ఎక్కడకో వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. ఈసారి ఆయన మళ్ళీ తిరిగి శిరిడీ వస్తారో లేదోనని భయమేసింది. అట్టి ఆలోచన కల్గగానే అతడి కాలు, మనసు నిలువలేదు. సాయిలేని ఆ గ్రామంలో జీవించడం అతడికి అసాధ్యమనిపించింది.
వెంటనే అతడు ఆ రోడ్డుమీద ఉత్తరంగా కొద్ది దూరంగా వెళ్ళి, అక్కడ ఎదురైన వారిని విచారించాడు. నీమ్ గాంవ్ రోడ్డు మీద నుంచి తూర్పుగా రూయి గ్రామం నడిచి అక్కడొక పోలంలో పనిచేసుకునే వాణ్ణి విచారించగా. సాయి రూయి గ్రామం మీదగా వెళ్ళారని చెప్పారు. వారాయనను పలకరించినపుడు ఆయన పట్టరాని కోపంతో శిరిడీ గ్రామస్థులను తిట్టి బోసారనీ, తిరిగి ఆ గ్రామానికి రాబోనని అన్నారనీ చెప్పారు. ఆ సంగతి వినగానే మహల్పాపతి మెదడులో ఆశాజ్యోతి పొడజూపింది.
అతడు తిరిగి వెంటనే యిల్లు చేరి, తాను రూయి గ్రామంలో సాయి చెంతకు వెళ్తున్నానని, ఆయన తిరిగి రాకుంటే తాను గూడ రానని తన భార్యకు చెప్పి వెంటనే బయల్దేరాడు. నాటివరకూ శిరిడీకి పట్టిన మహాభాగ్యం విడిచి పెట్టిందేమోనని భయపడ్డాడు. అయితేనేమి? తాను మాత్రం ఆ మహాత్ముని సేవ, సాన్నిధ్యాలు ఎట్టి పరిస్థితులలోను వదలుకోదల్చుకోలేదు.
అతడు రూయి చేరేసరికి ఆ గ్రామ ప్రవేశంలోనే వున్న మారుతి ఆలయంలో ఒక చెట్టుక్రింద సాయి కూర్చొని కనిపించారు. అతనిని చూస్తూనే ఉగ్రులై, తమ చెంతకు రావద్దని,తిరిగి పొమ్మనీ కేకలేసారు. అతడు నడక వేగం తగ్గించి ఆయనను సమీపించ యత్నిస్తుంటే అతనిపై రాళ్ళు రువ్వసాగారు.
చివరకు అతడు, “ఎన్నటికైనా నేను మీ భగత్ నే, మీరు నన్ను చంపినా సరే, మీ సన్నిధి విడిచిపెట్టను. శిరిడీలో మిమ్ము తిట్టిన వారిని నేను దండిస్తాను. మీకు శిరిడీ రాకపోవడం యిష్టం లేకపోతే నేను మీ దగ్గరుండిపోతాను, నేనూ యిక్కడే వుంటాను. మిమ్మల్ని విడిచిపోను. ఆ విషయం యింట్లో వారికి గూడా చెప్పి వచ్చాను!” అన్నాడు.
అతని పట్టుదల చూచి సాయి రాళ్ళు రువ్వడం మాని వేసారు గాని, ఆతనిని తన పాదాలనంటనివ్వలేదు. “నేనిక ఆ గ్రామానికి రాను. మేము ఫకీర్లం, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీవు సంసారివి. నీవు ఇల్లు విడిచి మావెంట రాగూడదు. నీవు తిరిగి యింటికి వెళ్ళు” అని నచ్చచెప్పారు. వారి కంఠంలో ధ్వనించిన నిశ్చయం చూచి మహల్సాపతి నివ్వెరబోయాడు.
చివరికి ఆయన తనతో గూడ శిరిడీకి రాకపోతే అన్నము, నీళ్ళు ముట్టుకోనని ఆయన చెంతనే కూర్చున్నాడు. ఆయన తిరిగి అతనిని తిట్టిపోసారు. నచ్చచెప్పారు. కనీసం రూయీ గ్రామంలోకి వెళ్ళయినా భోజనం చేయమని చెప్పారు. వీరిద్దరి మధ్య సాయంత్రం వరకూ యిదే నాటకం కొనసాగింది. చివరికి భక్తుడి మాటే నెగ్గింది. ఆ యిద్దరూ తిరిగి శిరిడీ చేరారు. మనందరికీ సాయి తిరిగి లభించారు. మనందరికీ శిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే.
గొప్ప విరాగి వివేకవంతుడు మహల్సాపతి
మహల్సా గొప్ప పుణ్యాత్ముడు తన ఇంద్రియాలను చాలా వరకు తన ఆధీనంలో ఉంచుకున్న దివ్యాత్ముడు. ఆకలిని కూడా జయించిన జితేంద్రియుడు. ఎవ్వరి దగ్గరి నుంచి ఏమి ఆశించేవాడు కాదు. బాబా ఇస్తానన్నా, తీసుకునేవాడు కాదు.
బాబా ఇలా అనేవారు అరె భగత్! “ఈ మూడు రూపాయలు తీసుకో కొద్ది రోజుల్లో నీవే ఇంకొకరికి సహాయపడే స్థితి కలిగి ఉంటావు. నీ జీవితము సుఖప్రదం అవుతుంది.” అప్పుడు మహల్సాపతి, “బాబా ఇవన్ని నాకు వద్దు నీ పాదాలను పూజించడం తప్ప నాకింకేమి అక్కరలేదు” అని అనేవాడు. అంతటి గొప్ప విరాగి వివేకవంతుడు మహల్సాపతి. మహల్సా అప్పటికే జ్ఞానవంతుడు.
రేపు తరువాయి బాగం…
ఓం శ్రీ సాయి రామ్ !
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భక్త మహల్సాపతి 1వ బాగం..
- భక్త మహల్సాపతి 8వ బాగం..
- భక్త మహల్సాపతి 5వ బాగం..
- భక్త మహల్సాపతి 7వ బాగం..
- భక్త మహల్సాపతి 2వ బాగం..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments