Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘రాధాకృష్ణా’’ అంటూ చేతులు జోడించిందామె. కళ్ళు మూసుకుంది. ప్రార్ధించసాగింది. కళ్ళిప్పి చూసింది.
ఎదురుగా పాండురంగ విఠలుడు. బాబా లేరక్కడ.‘‘కృష్ణా’’ అందామె. ఆనందాశ్రువులు ఆమె కంటి నుండి రాసాగాయి. చూపు మసకబారింది. కన్నీరు తుడుచుకుని చూసింది. కృష్ణుని స్థానంలో బాబా కనిపించారిప్పుడు.
అంతే! బాబా పాదాలను ఆశ్రయించింది రాధాకృష్ణమాయి.‘‘బాబా, మీరే నా రాధాకృష్ణుడు. మిమ్మల్ని వదిలి నేనిక ఎక్కడికీ వెళ్ళను. కరుణించి, నన్ను కటాక్షించండి.మీ సేవా భాగ్యాన్ని నాకు కలిగించండి.’’ అంది.
‘సరే’నన్నట్టుగా సన్నగా నవ్వుతూ దీవించారు బాబా.రాధాకృష్ణమాయి షిరిడీలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంది. ఉండిపోయిందక్కడే!తొలికోడి కూతకు నిద్ర లేచేదామె.
చీపురుపట్టుకుని, ద్వారకామాయి నుంచి లెండితోట వరకు, బాబా భిక్షకు వెళ్ళే తోవలన్నీ తుడిచేది. రాళ్ళు, ముళ్ళు ఎక్కడ బాబా పాదాలను బాధిస్తాయోనని వేయి కళ్ళతో రాదారులన్నీ వెతికి వెతికి చూసేది. దొరికితే తీసి, రోడ్డు పక్కగా ఓ మూలకు విసిరి వేసేది.
ఎండ!ఎండవేళ బాబా నడవడం కష్టంగా ఉంటుంది. అందుకని, దారి పొడుగునా పందిళ్ళు వేసేది. పచ్చదనం కోసం లతల్ని పెంచేది. తర్వాత తర్వాత సాయి సన్నిధిని ‘సంస్ధానం’గా తీర్చిదిద్దింది రాధాకృష్ణమాయే!
బాబాకు హారతులు, అర్చనలు, నామసంకీర్తనలు, ఉత్సవాలతో అరాధించే పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టింది కూడా రాధాకృష్ణమాయే!
తెల్లని గుర్రం ‘శ్యామకర్ణి’, ఛత్రం, బాబా కూర్చునేందుకు ఆసనం, ధనం, ధాన్యం సర్వం సమకూర్చి పెట్టిందీ రాధాకృష్ణమాయే!
ఇవేవీ బాబాకి ఇష్టం ఉండేవి కావు. దాంతో ఆమెను తిట్టిపోసేవారాయన. సమాధానంగా తల వంచుకుని నవ్వుతూ నిల్చుని ఉండేది రాధాకృష్ణమాయి.
ఆమె సేవలతో, ప్రచారంతో షిరిడీ మరింతగా పేరు పొందింది. భక్తజన సందోహంతో నిండి పోయింది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- ‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’
- ‘‘బాపూగిర్ అని బాబా ఒక్కరే నన్ను పిలిచేది. ఇంకెవరూ నన్నలా పిలవరు.
- నానాసాహెబ్ అన్నది నా ముద్దుపేరు. ఆ పేరుతో నా తల్లిదండ్రులొక్కరే నన్ను పిలుస్తారు.
- ‘‘మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నాకు విఠలుణ్ణి చూపించారు”.
- ‘‘నా సమాధిని పూలతో కప్పు. నన్ను పరిమళభరితం చెయ్యి.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments