Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘బాబా బాబా’’ అని పిలిచారు. కేకలేశారు. అయినా లాభం లేకపోయింది. పెదవుల చివర నుంచి నీళ్ళు కారిపోయాయి. తెరిచిన నోరు తెరిచినట్టుగానే ఉంది. కళ్ళు మూసుకుపోయాయి. బాబా ఇక్కడి గాలినీ, నీటినీ, నేలనీ వదలి వెళ్ళిపోయారు. చనిపోయారు.
‘‘బాబా’’ అని పెద్దపెట్టున రోదించాడు నానా. సరిగ్గా అప్పుడే పరుగున వచ్చాడక్కడకి తాత్యా. పాటిల్ ఒడిలో ప్రాణాలు కోల్పోయిన బాబాని చూశాడు. నెత్తి కొట్టుకుంటూ విలపించాడు.‘‘మామా! ఇది అన్యాయం మామా! చాలా అన్యాయం! నా కోసం మీరు చనిపోవడం తప్పు మామా! చాలా తప్పు.’’ అన్నాడు.
ఏడ్చేడ్చి అలసిపోయాడు శ్యామా. బాబా ఇక లేరని తెలుసుకుని దిగ్బ్రాంతి లోనయ్యాడతను. కాస్సేపటికి తేరుకున్నాడు.‘బాబా! ఇది కలా? నిజమా?’ అనుకున్నాడు.
సమాధానం బాబా చెప్పడం అలవాటు. చెబుతారనే ఆశించాడు శ్యామా. ఇందాక ‘ఇవి ఆఖరి క్షణాలు కాదు కదా?’ అన్నప్పుడు కూడా బాబా స్పందించారు. సమాధానాన్ని అందజేశారు. ఇప్పుడిస్తారా? ఇవ్వరా? చూడాలి.చూస్తున్నాడు శ్యామా. లేదు, సమాధానం రాలేదు. అయిపోయిందనుకున్నాడు శ్యామా.
ఒకటా…రెండా…అరవై ఏళ్ళ సాన్నిహిత్యం. అడుగడుగునా మార్గదర్శనం…తల్లిలా, తండ్రిలా, స్నేహితుడిలా, సద్గురువులా, దేవదేవుడిలా వెన్నంటి ఉండి, ఇప్పుడు బాబా అదృశ్యమయిపోతే తట్టుకోవడం ఎవరి తరం? గోలు గోలున విలపించసాగారంతా.
చిత్రంగా ద్వారకామాయిలో చీకట్లు కమ్ముకున్నాయి. షిరిడీ, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో గల ఆలయాల్లో దీపాలారిపోయాయి.తనకి మరణం లేదని తాత్యాకి చె ప్పారు బాబా.అంటే ధరించిన శరీరంతో తాను ఎల్లకాలమూ ఉంటానని కాదు. ఆత్మతో పర్యవేక్షిస్తానని అర్థం. ఆ ఉద్దేశంతోనే ఇక మీదట తన సమాధి మాట్లాడుతుందన్నారు బాబా.
అయితే ఆ మాటల్ని భక్తులెవరూ చెవికెక్కించుకోలేదు. బాబా పోయారంటూ ఏడుస్తూ కూర్చున్నారు. నిర్దేశించిన పనుల్ని మానుకున్నారు. వారిని మళ్ళీ కర్తవ్యోన్ముఖుల్ని చెయ్యాలి. ఎలా?తను సమాధి చెందిన రాత్రి దాసుగణుకి కలలో కనిపించారు బాబా.
‘‘గణూ’’ మేల్కొలిపారు.‘‘బాబా’’‘‘నా సమాధిని పూలతో కప్పు. నన్ను పరిమళభరితం చెయ్యి.’’ అడిగారు బాబా. అదృశ్యమయిపోయారు. ఉలిక్కిపడ్డాడు దాసుగణు. లేచి కూర్చున్నాడు.
ఇంతలో తలుపు చప్పుడయింది. వెళ్ళి తెరిచాడు. షిరిడీ నుంచి వచ్చినట్టుగా చెప్పాడు గుమ్మంలో ఉన్న వ్యక్తి.‘‘బాబా అవతారాన్ని చాలించారు.’’ చెప్పాడతను.‘‘లేదు! బాబాకి మరణం లేదు. బాబా చనిపోలేదు.’’ అన్నాడు దాసుగణు. అప్పటికప్పుడే షిరిడీకి ప్రయాణమయ్యాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నాకు మీరూ కావాలి. వారూ కావాలి. అంతా అందరూ నా వాళ్ళే’’
- ‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’
- ‘‘నువ్వు నా వాడివి. నిన్ను నేను వదులుకుంటానా? అందుకే రప్పించుకున్నాను.’’
- ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను మామా! కరుణించు. నన్ను ఈ బాధ నుంచి విముక్తుణ్ణి చెయ్యి.’’
- గద్దె మీద బాబా లేరప్పుడు. అక్కడ మారుతి కూర్చుని ఉన్నాడు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments